newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

భారత్ లో పరిశోధనలు ఎంతో ముఖ్యమని ప్రపంచానికి చెప్పిన బిల్ గేట్స్

21-10-202021-10-2020 15:56:36 IST
Updated On 21-10-2020 16:12:40 ISTUpdated On 21-10-20202020-10-21T10:26:36.254Z21-10-2020 2020-10-21T10:26:33.087Z - 2020-10-21T10:42:40.283Z - 21-10-2020

భారత్ లో పరిశోధనలు ఎంతో ముఖ్యమని ప్రపంచానికి చెప్పిన బిల్ గేట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారత్‍లో జరుగుతున్న పరిశోధనలు, భారీ స్థాయిలో టీకా తయారీ ప్రయత్నాలు కొవిడ్‍ 19 నివారణలో ఎంతో కీలకమైనవని మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకులు బిల్‍ గేట్స్ అన్నారు. గ్రాండ్‍ ఛాలెంజెస్‍ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. టీకా తయారీ, కరోనా సోకినట్లు నిర్ధారించే పక్రియలు క్లిష్టమైనవని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కొవిడ్‍కు టీకా తయారుచేసే యత్నాల్లో నిమగ్నమయ్యారని, ఈ పెను సవాల్‍ను ఎదుర్కోవటానికి వారంతా పరస్పరం సహకరించుకుంటున్నారని చెప్పారు. 

కరోనాపై పోరాడేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని, అదే ప్రస్తుతం మన ముందున్న గ్రాండ్‌ ఛాలెంజ్‌ అని అన్నారు. పరిశోధనలు పూర్తయ్యే వరకు వేచి చూడకుండా ప్రతిరోజూ శాస్త్రవేత్తలు తమ అధ్యయనాలను అందిస్తున్నారని చెప్పారు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి శాస్త్రవేత్తలు ఇప్పటివరకు వైరస్‌కు సంబంధించిన 1,37,000 జన్యు క్రమాలను అందించారని, ఔషధ కంపెనీలు కూడా టీకా ఉత్పత్తి మార్గాలకు సహకరిస్తున్నాయని చెప్పారు. 

ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్‌ గతంలో అనేక కీలక వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేసిందని, కరోనాకు కూడా ఎంఆర్‌ఎన్‌ఎ రూపొందించిన వ్యాక్సినే మొదటగా ఆమోదం పొందుతుందని అన్నారు. రాబోయే ఏళ్లలో ఎంఆర్‌ఎన్‌ఎ మరింత అభివృద్ధి చెందుతుందని బిల్‌గేట్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని గుర్తించడం, రోగ నిర్థారణ పరీక్షలు, అనంతరం వైద్యం అందించడం సులభతరం చేయాలని సూచించారు. పరీక్షలను వేగవంతం చేయాలని, ఔషధాలను కమ్యూనిటీ సెంటర్లలో, ఫార్మసీలలో నిల్వ చేయాలని అన్నారు. టీకాల క్లినికల్‌ ట్రయల్స్‌కు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందాలు సోదరభావంతో సహకరిస్తున్నాయని, ఈ టీకాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వచ్చే ఏడాది ప్రారంభంలో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle