newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

చైనా సైనికుడిని అప్పగించేశారు

21-10-202021-10-2020 10:27:21 IST
Updated On 21-10-2020 10:42:11 ISTUpdated On 21-10-20202020-10-21T04:57:21.768Z21-10-2020 2020-10-21T04:57:07.825Z - 2020-10-21T05:12:11.037Z - 21-10-2020

చైనా సైనికుడిని అప్పగించేశారు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

చైనా సైన్యం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)కు చెందిన సైనికుడు సోమవారం తూర్పు లద్దాఖ్‌లో భారత సైన్యానికి పట్టుబడ్డాడు. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) దాటి అతడు భారత భూభాగంలోకి ప్రవేశించడం సంచలనం రేపింది.

‘ఈ నెల 19వ తేదీన తూర్పు లద్దాఖ్‌ సెక్టార్‌లోని డెమ్‌చోక్‌ ప్రాంతంలో చైనా సైనికుడొకరు ఎల్‌ఏసీని దాటి భారత భూభాగంలోకి దారి తప్పి ప్రవేశించాడు. అతడి వద్ద ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా పీఎల్‌ఏ కార్పొరల్‌ వాంగ్‌ య లాంగ్‌గా తెలిసింది. స్వస్థలం చైనాలోని ఝెజియాంగ్‌ ప్రావిన్స్‌లోని షాంగ్జిఝెన్‌ పట్టణమని తేలింది. దీని వెనుక గూఢచర్యం ఉన్నట్లు భావించడం లేదు’ అని భారత ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. 

దారి తప్పివచ్చిన చైనా సైనికుడు.. వదిలేస్తామన్న భారత్

‘పర్వతమయమైన ఈ ప్రాంతంలో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య దారితప్పి వచ్చిన అతడికి ఆక్సిజన్, ఆహారంతోపాటు చలి నుంచి రక్షణ కల్పించే దుస్తులు అందించాం. తప్పిపోయిన తమ సైనికుడి ఆచూకీ కోసం పీఎల్‌ఏ నుంచి ఒక వినతి అందింది అని భారత ఆర్మీ వెల్లడించింది. చైనాతో ఉన్న అవగాహనను అనుసరించి ఇతర లాంఛనాలన్నీ పూర్తయ్యాక చుషుల్‌–మోల్డో ప్రాంతంలో అతడిని తిరిగి చైనా సైనిక అధికారులకు అప్పగిస్తామని భారత సైన్యం స్పష్టం చేసింది.

భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా సైనికుడిని భారత సైన్యం ఈ ఉదయం తిరిగి చైనాకు అప్పగించినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. చుషూల్-మోల్దో మీటింగ్ పాయింట్ వద్ద ప్రొటోకాల్ ప్రకారం చైనా సైనికుడిని అప్పగించినట్టు తెలిపింది.   తప్పిపోయిన జడల బర్రెను వెతికిపెట్టాలన్న స్థానికుడి విజ్ఞప్తి మేరకు దానిని వెతుకుతూ అతడు పొరపాటున భారత భూభాగంలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle