డిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ కొత్త ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది..?
18-01-202218-01-2022 16:32:42 IST
2022-01-18T11:02:42.799Z18-01-2022 2022-01-18T11:01:25.730Z - - 27-05-2022

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పంజాబ్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుందో చెప్పమని పంజాబ్ జనాలకే అవకాశం ఇస్తున్నట్లు మూడు రోజుల క్రితం కేజ్రీవాల్ ప్రకటించారు. అంతేకాదు ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పటం కోసం 78740 78740 మొబైల్ నెంబరును కూడా ప్రకటించారు. తమ అభిప్రాయాలు చెప్పటానికి జనాలకు కేజ్రీవాల్ 96 గంటలు గడువిచ్చారు. ఈ ప్రకటనకు మంచి స్పందన వచ్చినట్లే ఉంది చూస్తుంటే. తాజాగా పార్టీ వర్గాల ప్రకటన ప్రకారం 96 గంటల్లో 19 లక్షల మంది రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఎంపిక చేయటంలో 19 లక్షల మంది తమ అభిప్రాయాలను చెప్పటమంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం సీఎంను ఎంపిక చేయాలంటే గెలిచిన ఎంఎల్ఏలు మాత్రమే ఎన్నుకుంటారు. అయితే ఇలాంటి పద్దతికి కేజ్రీవాల్ స్వస్తిపలకాలని అనుకున్నారు. అందుకనే డైరెక్టుగా ప్రజల అభిప్రాయం మేరకు సీఎం అభ్యర్ధిని ప్రకటించాలని అనుకున్నారు. కేజ్రీవాల్ మంగళవారం మొహాలీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జనాల స్పందన ఎలాగుందో ఎవరిపేరును ప్రతిపాదించారో ప్రకటించబోతున్నారు. 19 లక్షల్లో 6.5 లక్షల మంది వాట్సప్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపారు. 2.5 లక్షల మంది వాయిస్ మెసేజ్ చేశారు. అలాగే మరో 8 లక్షల మంది వాయిస్ కాల్ ద్వారా పేరును సూచించారు. అయితే ఆప్ ఎంపీ భగవంత్ సిగ్ మాన్ పేరునే ఎక్కువమంది సూచించినట్లు సమాచారం. ఒక వేల పంజాబ్ ప్రజలు సూచించిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవకపోతే ఏమిటి పరిస్థితి అన్నది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. ఎందుకంటే మెజారిటి ఎమ్మెల్యేలు ఎన్నుకున్న వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారు కదా..

మరో కీలకమైన పదవిలో భారతీయ-అమెరికన్
11-05-2022

మార్క్సిజంపై నమ్మకాన్ని పెంపొందించండి
10-05-2022

ఉక్రెయిన్లో పర్యటించిన అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్
10-05-2022

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జాకెట్కి వేలంలో 90వేల డాలర్లు
10-05-2022

పాత నిబంధనను తెరపైకి తెచ్చిన సెర్బియా ..!
09-05-2022

దక్షిణ కొరియాలో పెరుగుతున్న కొత్త COVID-19 కేసులు
08-05-2022

రెండోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ ప్రమాణ స్వీకారం
08-05-2022

OPEC క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర పెరిగింది ..!
06-05-2022

‘పద్మ’అవార్డుల కోసం ఆన్లైన్ నామినేషన్లకి ఆహ్వానం
06-05-2022

రక్షణ సహకారంపై దక్షిణ కొరియా, నార్వే ..!
02-05-2022
ఇంకా