newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి

11-10-202111-10-2021 16:38:56 IST
Updated On 11-10-2021 17:56:28 ISTUpdated On 11-10-20212021-10-11T11:08:56.847Z11-10-2021 2021-10-11T11:08:49.900Z - 2021-10-11T12:26:28.223Z - 11-10-2021

ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అయిదుగురు జవాన్లు మరణించిన సంఘటన జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో  చోటు చేసుకుంది. ఉగ్రవాదుల ఉనికి గురించి నిఘా వర్గాలకు సమాచారం అందింది. సూరంకోట్‌లోని డీకేజీకి దగ్గరగా ఉన్న గ్రామంలో  ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో ఆర్మీ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. అక్కడ చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో భారత ఆర్మీ సైనికులు ఐదుగురు మరణించారు. ఇందులో ఒకరు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) ఉన్నారు. 

గాలింపు చర్యలు జరుపుతున్న ఆర్మీ అధికారులపైకి ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు దిగడంతో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన జేఓవీ, నలుగురు జవాన్లను సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వారు మరణించారని సర్చ్‌ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆర్మీ అధికారి అధికారికంగా ప్రకటించారు. 

కేరళలో భారీ వర్షాలు... కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి

కేరళలో భారీ వర్షాలు... కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి

   26 minutes ago


బంగ్లాదేశ్‌లో దుర్గా పూజ వేడుకలలో హింస.. 3 మృతి, 60 మంది గాయాలు

బంగ్లాదేశ్‌లో దుర్గా పూజ వేడుకలలో హింస.. 3 మృతి, 60 మంది గాయాలు

   15-10-2021


J&K లో కౌంటర్-టెర్రర్ ఎటాక్ లో ఆర్మీ ఆఫీసర్, సైనికుడు మరణించారు

J&K లో కౌంటర్-టెర్రర్ ఎటాక్ లో ఆర్మీ ఆఫీసర్, సైనికుడు మరణించారు

   15-10-2021


ఆ మూడు రాష్ట్రాల సరిహద్దులు 50 కి.మీ.ల మేర BSF పరిధిలోకి...

ఆ మూడు రాష్ట్రాల సరిహద్దులు 50 కి.మీ.ల మేర BSF పరిధిలోకి...

   14-10-2021


షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన

   14-10-2021


ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదానికి మూలంగా మారకుండా నిరోధించండి: G20 సమావేశంలో ప్రధాని మోడీ

ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదానికి మూలంగా మారకుండా నిరోధించండి: G20 సమావేశంలో ప్రధాని మోడీ

   13-10-2021


దేశంలో బొగ్గు సంక్షోభం.. రాష్ట్రాల నుంచి లేఖలు

దేశంలో బొగ్గు సంక్షోభం.. రాష్ట్రాల నుంచి లేఖలు

   12-10-2021


రానున్న రోజుల్లో చీకటిలోకి ఇండియా..

రానున్న రోజుల్లో చీకటిలోకి ఇండియా..

   12-10-2021


జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ ఆఫీసర్, 4 మంది సైనికులు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ ఆఫీసర్, 4 మంది సైనికులు మరణించారు

   11-10-2021


ఎయిర్ ఇండియా ని టాటా సన్స్ 18,000 కోట్లకు గెలుచుకుంది

ఎయిర్ ఇండియా ని టాటా సన్స్ 18,000 కోట్లకు గెలుచుకుంది

   08-10-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle