newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పంచాయతీ ఎన్నికల్లో నెగ్గలేకపోయిన అందగత్తె..!

04-05-202104-05-2021 08:21:33 IST
2021-05-04T02:51:33.221Z04-05-2021 2021-05-04T02:51:27.430Z - - 14-05-2021

పంచాయతీ ఎన్నికల్లో నెగ్గలేకపోయిన అందగత్తె..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఎన్నికలు అందరికీ కలిసిరావని అంటారు. ఎంత పెద్ద పేరు ఉన్నా.. పరపతి ఉన్నా రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమే..! ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నో ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సి ఉంటుంది. చాలా విషయాల్లో కొత్తగా రాజకీయాల్లోకి ఎంటర్ అయిన వాళ్లు పంచాయతీ ఎన్నికల్లో నెగ్గడం కష్టమే..! ఇక మాజీ మిస్ ఇండియాగా పేరు ఉన్న మోడల్, నటి దీక్షా సింగ్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం దేశ వ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే..! సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చ జరిగింది. మాజీ మిస్ ఇండియా అది కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం ఏమిటా.? అని చాలా మంది మాట్లాడారు. అయితే ఆమెకు భారీ ఎత్తున పబ్లిసిటీ వచ్చింది కానీ.. ఓట్లు మాత్రం పడలేదు. 

ఉత్తరప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల్లో మోడల్ దీక్షా సింగ్ ఓడిపోయింది. జాన్‌పూర్ జిల్లా బక్షా డెవలప్ మెంట్ బ్లాక్ పంచాయతీలో 26వ వార్డు నుంచి దీక్షా సింగ్‌ బరిలోకి దిగింది. ఆమె ఓటర్లను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. పంచాయతీ సర్పంచ్ గా ప్రజలకు మంచి చేయాలని అనుకున్న దీక్షా సింగ్ ను ప్రజలు గెలిపించలేదు. ఆమెకు కనీసం 2500 ఓట్లు కూడా పడలేదు.  దీక్ష స్వస్థలం బక్ష ప్రాంతంలోని చిట్టోరి గ్రామం. వ్యాపార రీత్యా గోవాలో సెటిల్ అయ్యారు. ఆమె తండ్రి జితేంద్ర గోవా, రాజస్థాన్‌లో ట్రాన్స్‌పోర్టు బిజినెస్‌ నిర్వహిస్తున్నారు. దీక్షా సింగ్ తల్లి గృహిణి. దీక్షా సింగ్ 2015లో జరిగిన మిస్‌ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలిచారు. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పాటు పలు యాడ్స్ లో నటించారు. తండ్రి కోరిక మేరకు ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దీక్ష తండ్రి జితేంద్ర సింగ్‌.. పంచాయతీ ఎన్నికల్లో బక్షా డెవలప్‌మెంట్‌ బ్లాక్‌లోని 26వ వార్డు నుంచి పోటీ చేసేందుకు ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అయ్యారు. అయితే ఈ స్థానాన్ని మహిళలకు కేటాయించడంతో ఆయన తన కూతురు దీక్షను బరిలోకి దించారు.  మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థికి 7500కు పైగా ఓట్లు రాగా.. రెండో స్థానంలో ఉన్న అభ్యర్థికి 5000కు పైగా ఓట్లు వచ్చాయట. ఇక దీక్షా సింగ్ కు మాత్రం 2500 ఓట్లు కూడా పడలేదని.. ఆమె మూడో స్థానంలో నిలిచిందని అధికారులు తెలిపారు.  

 

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   4 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   12 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   12 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   a day ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle