newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

కరోనా కేసుల సంఖ్యపై అప్డేట్స్..!

22-10-202022-10-2020 11:17:46 IST
Updated On 22-10-2020 11:21:17 ISTUpdated On 22-10-20202020-10-22T05:47:46.590Z22-10-2020 2020-10-22T05:47:38.428Z - 2020-10-22T05:51:17.587Z - 22-10-2020

కరోనా కేసుల సంఖ్యపై అప్డేట్స్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కేసుల సంఖ్యపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 55,838 మందికి కరోనా నిర్ధారణ అయిందని  పేర్కొంది. అదే సమయంలో 79,415 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,06,946 కి చేరింది. గ‌త 24 గంట‌ల సమయంలో 702 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,16,616 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 68,74,518 మంది కోలుకున్నారు. 7,15,812 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  

తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,456 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,292 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,27,580 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,06,105 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,292 కి చేరింది. ప్రస్తుతం 20,183 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 16,977 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 254 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 98 కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఓరి నాయ‌నో..ఏపీలో మ‌ళ్లీ లాక్ డౌన్ ఉంటుందా...

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి వివరాలపై వైద్య ఆరోగ్య శాఖ 21-10-2020న బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 74,422 కరోనా టెస్టులు నిర్వహించగా 3,746 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 677 కొత్త కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 65 మందికి వైరస్ సోకినట్టు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 27 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,508కి పెరిగింది. తాజాగా, 4,739 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 7,93,299 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 7,54,415 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32,376 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle