newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

కరోనిల్ మందుపై నిషేధం విధించిన నేపాల్

09-06-202109-06-2021 18:29:39 IST
Updated On 09-06-2021 18:29:34 ISTUpdated On 09-06-20212021-06-09T12:59:39.027Z09-06-2021 2021-06-09T12:59:17.142Z - 2021-06-09T12:59:34.179Z - 09-06-2021

కరోనిల్ మందుపై నిషేధం విధించిన నేపాల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ స్థాపించిన పతంజలి ఆయుర్వేద సంస్థ తయారు చేసిన స్వసారి–కరోనిల్‌ కిట్‌ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ ఔషధం కరోనాను తరిమికొడుతుందని, మహమ్మారి నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందంటూ విస్తృతంగా ప్రచారం సాగింది. జనం కరోనిల్‌ కిట్లను ఎగబడి కొన్నారు. ఈ ఏడాది జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు రూ.250 కోట్ల విలువైన 25 లక్షల కిట్లు విక్రయించినట్లు పతంజలి సంస్థ స్వయంగా ప్రకటించింది. అయితే, స్వసారి–కరోనిల్‌ కిట్‌తో ఎలాంటి ఉపయోగం లేదని, కరోనా వైరస్‌ నుంచి ఏమాత్రం రక్షణ కల్పించలేదని యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లోని బర్మింగ్‌ హామ్‌ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది.

దీంతో ఒక్కసారిగా ఈ ఔషధం పై వ్యతిరేకత ఏర్పడింది. తాజాగా కరోనా వైరస్‌ సోకకుండా తీసుకువచ్చిన కరోనిల్‌ మందును భూటాన్‌ నిలిపివేయగా.. తాజాగా నేపాల్‌ ఆ మందును వాడకూడదని ఆదేశించింది. భూటాన్‌ గతంలోనే కరోనిల్‌పై నిషేధం విధించింది. తాజాగా నేపాల్‌ సోమవారం ఆ మందుల పంపిణీని నిలిపివేసింది. రామ్‌దేవ్‌ బాబా బహుమతిగా అందించిన 1,500 కరోనిల్‌ కిట్లను వాడకూడదని నిర్ణయించింది. ఎందుకుంటే కరోనా వైరస్‌ను ఎదుర్కోనవడంలో కరోనిల్‌ విఫలం చెందిందని గుర్తించింది. ఈ మేరకు ఆ దేశ ఆయుర్వేద మంత్రిత్వ శాఖ కరోనిల్‌ మందును నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కరోనిల్‌ కిట్‌లో ఉన్న ట్యాబ్లెట్లు, నూనె కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో విఫలం పొందినట్లు పేర్కొంది. దీంతో ఆ కిట్‌ను పంపిణీ చేయడం నిలిపివేసింది. అయితే ఈ మందు కరోనా కట్టడిలో విఫలం చెందిందని పలు సర్వేలు వెల్లడించడంతో ప్రస్తుతం ఈ మందుకి డిమాండ్‌ లేకుండాపోయింది. 

బీజేపీ యేతర వేదిక సిద్దమవుతుంది, ఈ రోజు ప్రతిపక్ష పార్టీల సమావేశానికి శరద్ పవార్ పిలుపునిచ్చారు

బీజేపీ యేతర వేదిక సిద్దమవుతుంది, ఈ రోజు ప్రతిపక్ష పార్టీల సమావేశానికి శరద్ పవార్ పిలుపునిచ్చారు

   7 hours ago


భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కోవిద్-19 కేసులు.. 91 రోజుల్లో అతి తక్కువ కేసులు

భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కోవిద్-19 కేసులు.. 91 రోజుల్లో అతి తక్కువ కేసులు

   8 hours ago


మహారాష్ట్రలో కొత్త డెల్టా - ప్లస్ కోవిడ్ వేరియంట్ 21 కేసులు నమోదు: మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే

మహారాష్ట్రలో కొత్త డెల్టా - ప్లస్ కోవిడ్ వేరియంట్ 21 కేసులు నమోదు: మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే

   11 hours ago


ప్రధాని నరేంద్ర మోడీ పై సుప్రీం కోర్టు ఆగ్రహం

ప్రధాని నరేంద్ర మోడీ పై సుప్రీం కోర్టు ఆగ్రహం

   11 hours ago


ఈ రోజు ఉత్తర అర్ధగోళంలో పొడవైన రోజు, ఢిల్లీ 14 గంటల సుదీర్ఘ పగటిపూట అనుభవిస్తుంది

ఈ రోజు ఉత్తర అర్ధగోళంలో పొడవైన రోజు, ఢిల్లీ 14 గంటల సుదీర్ఘ పగటిపూట అనుభవిస్తుంది

   a day ago


 దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్ ఈ రోజు నుంచే.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీ

దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్ ఈ రోజు నుంచే.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీ

   21-06-2021


అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021

   21-06-2021


కోవిడ్ ఉద్భవించినప్పుడు, ఏ దేశమూ సిద్ధం కాలేదు; యోగా సహాయపడింది: మోడీ

కోవిడ్ ఉద్భవించినప్పుడు, ఏ దేశమూ సిద్ధం కాలేదు; యోగా సహాయపడింది: మోడీ

   21-06-2021


జూన్ 23 నుండి భారతదేశం నుండి దుబాయ్ వెళ్లే విమానాలను ప్రారంభం

జూన్ 23 నుండి భారతదేశం నుండి దుబాయ్ వెళ్లే విమానాలను ప్రారంభం

   20-06-2021


కొత్తగా ఎన్నికైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని ప్రధాని మోదీ అభినందించారు

కొత్తగా ఎన్నికైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని ప్రధాని మోదీ అభినందించారు

   20-06-2021


ఇంకా

Newssting


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle