newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

నకిలీ టాటా మోటార్స్ కుంభకోణంలో చైనాకు చెందిన హ్యాకర్లు

10-06-202110-06-2021 16:27:59 IST
2021-06-10T10:57:59.160Z10-06-2021 2021-06-10T10:39:38.236Z - - 22-06-2021

నకిలీ టాటా మోటార్స్ కుంభకోణంలో  చైనాకు చెందిన హ్యాకర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టాటా మోటార్స్ నుండి ఆఫర్ ఉన్నట్లు చెప్తూ, ఉచిత బహుమతులని కూడా ఇస్తున్నట్లుగా  వినియోగదారులని నమ్మిస్తూ వారి డేటాను సేకరిస్తున్న  చైనాకు చెందిన హ్యాకర్లను భారతదేశంలోని సైబర్-భద్రతా పరిశోధకులు గురువారం కనుగొన్నారు. 

న్యూ ఢిల్లీకి  చెందిన సైబర్‌పీస్ ఫౌండేషన్ కి చెందిన పరిశోధనా విభాగం వాట్సాప్ ద్వారా టాటా మోటార్స్ నుండి ఉచిత బహుమతి ఆఫర్‌కు సంబంధిం చిన కొన్ని లింక్‌లను అందుకుంది, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా కుకీ డేటాను కూడా వినియోగదారుల నుండి సేకరించింది.

"ఈ ప్రచారం టాటా మోటార్స్ నుండి వచ్చిన ఆఫర్‌గా చెప్తున్నప్పటికీ  టాటా మోటార్స్ వారి  అధికారిక వెబ్‌సైట్‌కు బదులుగా మూడవ పార్టీ డొమైన్‌లో హోస్ట్ చేయబడటం మరింత అనుమానాస్పదంగా ఉండటంతో " పరిశోధనా బృందం ఒకటి వెంటనే వారి కనిపెట్టే పనిలో దిగిందని ఒక  ప్రకటనలో సైబర్ పీస్ ఫౌండేషన్ కి చెందిన పరిశోధనా విభాగం తెలిపింది.

వాట్సాప్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయబడిన స్మార్ట్‌ఫోన్‌ల వంటి పరికరం నుండి ఏదైనా వినియోగదారు లింక్‌ను తెరిస్తే, సైట్‌లోని‌న యూసర్ లింక్ ని  పరికరంలోని  వాట్సాప్ అప్లికేషన్‌ను తెరుస్తాయి.

"సామాన్య ప్రజలను ఆకర్షించగలిగేలాగా  బహుమతులు నిజంగానే అవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి" అని ఆ బృందం తెలిపింది.

నకిలీ వెబ్‌సైట్ టైటిల్ "టాటా మోటార్స్ కార్స్, అమ్మకాలు 30 మిలియన్లను దాటాయి."

ల్యాండింగ్ పేజీలో, టాటా సఫారి కారు ఒకటి  ఆకర్షణీయమైన ఫోటోతో అభినందన సందేశం కనిపిస్తుంది మరియు ఉచిత టాటా సఫారి వాహనాన్ని పొందడానికి షార్ట్ సర్వేలో పాల్గొనమని వినియోగదారులను కోరుతుంది.

"అలాగే, ఈ పేజీ దిగువన, ఒక విభాగం వస్తుంది, ఇది ఫేస్బుక్ కామెంట్ విభాగం లాగా అనిపిస్తుంది, ఇక్కడ చాలా మంది వినియోగదారులు ఈ ఆఫర్ ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో అని వ్యాఖ్యానాలు ఉంటాయి. " అని పరిశోధన బృందం వెల్లడించింది.

సరే అనబడే బటన్‌ను క్లిక్ చేసిన తర్వాత, బహుమతిని గెలుచుకోవడానికి వినియోగదారులకు మూడు చాన్సెస్ ఇస్తారు.

అన్ని ఛాన్స్ లు  పూర్తి చేసిన తరువాత, వినియోగదారు "టాటా సఫారి" ను గెలుచుకున్నారని చెప్తుంది. 

"అభినందనలు! మీరు పూర్తి చేశారు ! మీరు టాటా సఫారిని గెలుచుకున్నారు!" 'సరే' బటన్‌పై క్లిక్ చేసి, వాట్సాప్‌లో ఈ కాంపెయిన్ ని  పంచుకోవాలని వినియోగదారులను ఇది కోరుతుంది. 

గెలిచినా బహుమతిని అందుకోవటానికి ఒక ఫారం ని  పూర్తి చేయమని వినియోగదారులని అది ప్రేరేపిస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వాట్సాప్ బటన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ ఆకుపచ్చ రంగులో  'కంప్లీట్ రిజిస్ట్రేషన్' బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఇది వినియోగదారుని మల్టిపుల్  ప్రకటనల వెబ్ ‌పేజీలకు మళ్ళిస్తుంది.  వినియోగదారులు బటన్‌పై క్లిక్ చేసిన ప్రతిసారీ ఇది మారుతూ ఉంటుంది.

సైబర్ క్రైమినల్స్ టాటా మోటార్స్ ప్రచారం నుండి ఉచిత బహుమతుల్లో ఉపయోగించిన ఫ్రంట్ ఎండ్ డొమైన్ నిజమైన ఐపి చిరునామాలను మాస్క్ చేయడానికి క్లౌడ్ ఫ్లేర్ అనబడే టెక్నాలజీ ని ఉపయోగించినట్లుగా అనుమానిస్తున్నారు.

"కానీ దర్యాప్తు దశలలో, ఈ నేపథ్యంలో పేర్కొన్న  డొమైన్ పేరును మేము గుర్తించాము అంటే కాకుండా అది చైనాకు చెందినదిగా గుర్తించాము" అని పరిశోధకులు వెల్లడించారు.

ఈ వెబ్‌సైట్లు ఆన్‌లైన్ మోసం అని గ్రహించడానికి  సైబర్‌పీస్ ఫౌండేషన్, థింక్ ట్యాంక్ మరియు సైబర్ సెక్యూరిటీ పాలసీ నిపుణుల ఎన్‌జిఓ, ఆటోబోట్ ఇన్ఫోసెక్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా పలు ఇన్వెస్టిగేషన్ సంస్థలు కలిసి ఇన్వెస్టిగేట్ చేశాయి. 

సామాజిక వేదికల ద్వారా పంపిన ఇటువంటి సందేశాలను ప్రజలు దయచేసి నమ్మి తెరవకుండా ఉండాలని ఫౌండేషన్ వినియోగదారులను అభ్యర్థిస్తుంది.

బీజేపీ యేతర వేదిక సిద్దమవుతుంది, ఈ రోజు ప్రతిపక్ష పార్టీల సమావేశానికి శరద్ పవార్ పిలుపునిచ్చారు

బీజేపీ యేతర వేదిక సిద్దమవుతుంది, ఈ రోజు ప్రతిపక్ష పార్టీల సమావేశానికి శరద్ పవార్ పిలుపునిచ్చారు

   7 hours ago


భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కోవిద్-19 కేసులు.. 91 రోజుల్లో అతి తక్కువ కేసులు

భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కోవిద్-19 కేసులు.. 91 రోజుల్లో అతి తక్కువ కేసులు

   9 hours ago


మహారాష్ట్రలో కొత్త డెల్టా - ప్లస్ కోవిడ్ వేరియంట్ 21 కేసులు నమోదు: మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే

మహారాష్ట్రలో కొత్త డెల్టా - ప్లస్ కోవిడ్ వేరియంట్ 21 కేసులు నమోదు: మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే

   12 hours ago


ప్రధాని నరేంద్ర మోడీ పై సుప్రీం కోర్టు ఆగ్రహం

ప్రధాని నరేంద్ర మోడీ పై సుప్రీం కోర్టు ఆగ్రహం

   12 hours ago


ఈ రోజు ఉత్తర అర్ధగోళంలో పొడవైన రోజు, ఢిల్లీ 14 గంటల సుదీర్ఘ పగటిపూట అనుభవిస్తుంది

ఈ రోజు ఉత్తర అర్ధగోళంలో పొడవైన రోజు, ఢిల్లీ 14 గంటల సుదీర్ఘ పగటిపూట అనుభవిస్తుంది

   a day ago


 దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్ ఈ రోజు నుంచే.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీ

దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్ ఈ రోజు నుంచే.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీ

   21-06-2021


అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021

   21-06-2021


కోవిడ్ ఉద్భవించినప్పుడు, ఏ దేశమూ సిద్ధం కాలేదు; యోగా సహాయపడింది: మోడీ

కోవిడ్ ఉద్భవించినప్పుడు, ఏ దేశమూ సిద్ధం కాలేదు; యోగా సహాయపడింది: మోడీ

   21-06-2021


జూన్ 23 నుండి భారతదేశం నుండి దుబాయ్ వెళ్లే విమానాలను ప్రారంభం

జూన్ 23 నుండి భారతదేశం నుండి దుబాయ్ వెళ్లే విమానాలను ప్రారంభం

   20-06-2021


కొత్తగా ఎన్నికైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని ప్రధాని మోదీ అభినందించారు

కొత్తగా ఎన్నికైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని ప్రధాని మోదీ అభినందించారు

   20-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle