newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

ఏకంగా బ‌స్టాప్ నే ఎత్తుకెళ్లారు

22-10-202022-10-2020 12:26:29 IST
Updated On 22-10-2020 12:41:00 ISTUpdated On 22-10-20202020-10-22T06:56:29.783Z22-10-2020 2020-10-22T06:56:16.391Z - 2020-10-22T07:11:00.951Z - 22-10-2020

ఏకంగా బ‌స్టాప్ నే ఎత్తుకెళ్లారు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఇది మామూలు విడ్డూరం కాదు. పాతినిము సామాన్ల‌కి అమ్ముకుంటాడో ఏమో కానీ.. ఓ వెధ‌వ ఏకంగా బ‌స్టాప్ నే ఎత్తుకెళ్లాడు. మ‌రి ఎత్తుకెళ్ల‌డం ఈజీ అనుకున్నాడో.. ఎలాంటి సెక్యూరిటీ ఉండ‌దు.. సైలెంట్ గా ప‌ని కానియ్యొచ్చు అనుకున్నాడో ఏమో కానీ.. మొత్తానికి రాడ్ల‌తో స‌హా.. బోల్టుల‌తో స‌హా ఊడ‌బీక్కుని ఎత్తుకెళ్లారు దొంగ‌లు. 

ఈ విడ్డూర‌పు దొంగ‌తనం జ‌రిగింది ఎక్క‌డో కాదు. మ‌న ముంబైలోనే. రాత్రికి రాత్రే.. బ‌స్టాపులో కుర్చీలు ఎత్తుకెళ్లారంటే ఏం చ‌చ్చిందోలే.. అలా త‌యార‌య్యారు దొంగ‌లు అనుకుంటం. అయినా ఆ కుర్చీలు ఎక్క‌డా వాడ‌డానికి కూడా వీలు కాదు. గ‌‌వ‌ర్న‌మెంట్ కుర్చీలు వేరే ఉంట‌య్ క‌దా. ఇక ఈ గ్యాంగ్ ఏంటో కానీ.. ఏకంగా బ‌స్టాప్ నీ.. దానికి ఉన్న రేకుని.. ఇనుప సామాన్ల‌ని మొత్తం ఎత్తుకెళ్లారు. పూణేలోని దేవాకి ప్యాలెస్ ముందు ఉన్న లోక‌ల్ బ‌స్టాప్ ని మొత్తంగా మాయం చేశారు.

దీంతో అంద‌రూ ఫ‌క్కున న‌వ్వుతున్న‌రు. పాపం ఏం చేస్త‌రు చెప్పండి. సొంత డ‌బ్బాలు ఎత్తుకెళ్లితే న‌వ్వుతారో లేదో కానీ.. ఇలా గ‌వ‌ర్న‌మెంట్ వి ఎత్తుకెళ్తే న‌వ్వ‌క ఏం చేస్త‌రు చెప్పండి. మ‌రీ అంత క‌రువు ప‌ట్టిన దొంగ, మ‌రీ అంత ప‌నికిమాలిన దొంగ ఎవ‌డ్రా బాబూ అనుకుంటున్నారు లోక‌ల్ గా. దీన్ని కాస్తా ఆఫీస‌ర్లు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది. అంతా ట‌మ్ము ట‌మ్ము అయింది ఎవ్వారం. యూపీలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

ఇక ఇలా కాదు అని.. బ‌స్టాప్ ఎత్తుకెళ్లిన వాళ్ల‌ని ఎలాగైనా ప‌ట్టి తీరాల్సిందే అని డిసైడ్ అయ్యారు. అందుకే.. ఆచూకీ ఇచ్చినా.. ఏదైనా ఇన్ఫ‌ర్మేష‌న్ ఇచ్చినా.. 5 వేలు బ‌హుమ‌తిగా ఇస్తామ‌ని అనౌన్స్ చేశారు. దీంతో.. ఇంకాస్త వైర‌ల్ అవుతుంది. ఆ దొంగ ఎవ‌డో కానీ.. దొరికితే మాత్రం ఇత్త‌డి చేస్తారు. కానీ.. ఇప్పుడైతే ఈ వార్త‌లు చూసి ఫుల్లు ఖుషీ అవుతున్నాల‌.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle