newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

అఫ్గాన్‌ను ఉగ్ర అడ్డాగా మార్చే ప్రమాదం ఉంది..

10-09-202110-09-2021 08:48:46 IST
Updated On 10-09-2021 10:28:51 ISTUpdated On 10-09-20212021-09-10T03:18:46.189Z10-09-2021 2021-09-10T03:18:40.782Z - 2021-09-10T04:58:51.776Z - 10-09-2021

అఫ్గాన్‌ను ఉగ్ర అడ్డాగా మార్చే ప్రమాదం ఉంది..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆఫ్గనిస్తాన్ ని తాలిబన్లు ఉగ్ర దేశంగా మార్చే ప్రమాదం ఉందని, ఇతరదేశాలపై ఉగ్రదాడులు చేసేందుకు అఫ్గాన్‌ భూభాగం ఉపయోగపడకుండా నిరోధించాలని బ్రిక్స్‌ దేశాలు ఆందోళన చెందాయి. ఆన్‌లైన్‌లో భారత ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 13వ బ్రిక్స్‌ సమావేశం జరిగింది. అఫ్గాన్‌లో పరిస్థితులతో పాటు ఇతర కీలక పరిణామాలపై సభ్యదేశాలు విస్తృత చర్చలు జరిపాయి. ఈ సమావేశంలో రష్యా అధిపతి పుతిన్, చైనా ప్రెసిడెంట్‌ జింగ్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సైరిల్‌ రమఫోసా, బ్రెజిల్‌ అధినేత బోల్సనారో ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. సీమాంతర ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాలపై పోరాడాలని పిలుపునిచ్చాయి. 

సదస్సు చివరలో అన్ని దేశాలు కలిసి ఉమ్మడి డిక్లరేషన్‌ విడుదల చేశాయి. అఫ్గాన్‌లో పరిస్థితులు శాంతియుతంగా ముగియాలని డిక్లరేషన్‌లో కోరాయి. అఫ్గాన్‌లోని అన్ని వర్గాల మధ్య సామరస్య చర్చలు సాగాలని, తద్వారా దేశంలో శాంతి, స్థిరత్వం రావాలని ఆకాక్షించాయి. ఇటీవల కాబూల్‌ ఎయిర్‌పోర్టు వద్ద జరిగిన దాడులను బ్రిక్స్‌ దేశాలు ఖండించాయి. ఏవిధమైన ఉగ్రకార్యకలాపాలకు అఫ్గాన్‌ స్థావరంగా మారకూడదని కోరాయి. బ్రిక్స్‌ దేశాలు రూపొందించుకున్న కౌంటర్‌ టెర్రరిజం యాక్షన్‌ ప్లాన్‌కు ఆమోదం లభించిందని ప్రధాని మోదీ చెప్పారు.  బ్రిక్స్‌ చైర్మన్‌గా భారత్‌ ప్రస్తుతం వ్యవహరిస్తోంది. తమ పాలనా కాలంలో ఇతర నాలుగు దేశాలు మంచి సహకారం అందించాయని ప్రధాని ప్రశంసించారు.  ‘ప్రపంచంలోని వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు ప్రభావశీల గళంగా మారాము. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలకు ప్రాధాన్యమివ్వడానికి బ్రిక్స్‌ ఉపయోగపడుతోంది’’అని మోదీ చెప్పారు. బ్రిక్స్‌ సాధించిన పలు విజయాలను ఆయన వివరించారు.

ఈ సంవత్సరం బ్రిక్స్‌ థీమ్‌  ‘ఇంట్రా బ్రిక్స్‌ కోఆపరేషన్‌ ఫర్‌ కంటిన్యుటీ, కన్సాలిడేషన్, కన్సెస్‌’. ఇక బ్రిక్స్ విశేషాల విషయానికి వస్తే.. ప్రపంచ జనాభాలో 41 శాతం వాటా, ప్రపంచ జీడీపీలో 24 శాతం భాగస్వామ్యం, అంతర్జాతీయ వాణిజ్యంలో 16 శాతం వాటా బ్రిక్స్‌ దేశాలదే. 2006లో తొలిసారి బ్రిక్‌(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) ఏర్పడింది. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారింది. 2009లో తొలి బ్రిక్‌ సమావేశం రష్యాలో జరిగింది. బ్రిక్‌ అనే పదం రూపకల్పన రూపా పురుషోత్తమన్‌ చేశారు. కానీ క్రెడిట్‌ మాత్రం జిమ్‌ ఓ నీల్‌కు వచ్చింది. బ్రిక్స్‌ ప్రధాన కార్యాలయం చైనాలోని షాంగైలో ఉంది. 14వ బ్రిక్స్‌ సదస్సుకు చైనా అధ్యక్షత వహించనుంది. ఏటా ఒక దేశం బ్రిక్స్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తుంది. 2016లో మోదీ బ్రిక్స్‌ సదస్సుకు అధ్యక్షత వహించారు.

రాష్ట్రాలు ప్రతి కోవిడ్ మరణానికి ₹ 50,000 పరిహారం అందిస్తాయి.. షరతులు ఇవే: కేంద్రం

రాష్ట్రాలు ప్రతి కోవిడ్ మరణానికి ₹ 50,000 పరిహారం అందిస్తాయి.. షరతులు ఇవే: కేంద్రం

   27 minutes ago


ఇండియా కరోనా టీకా సర్టిఫికేట్ పై మాకు నమ్మకం లేదు: బ్రిటన్

ఇండియా కరోనా టీకా సర్టిఫికేట్ పై మాకు నమ్మకం లేదు: బ్రిటన్

   5 hours ago


కోవిషీల్డ్ మాత్రమే WHO ఆమోదించింది..  కోవాక్సిన్, స్పుత్నిక్ WHO ఆమోదం లేదు

కోవిషీల్డ్ మాత్రమే WHO ఆమోదించింది.. కోవాక్సిన్, స్పుత్నిక్ WHO ఆమోదం లేదు

   21-09-2021


NDA మహిళా క్యాడెట్‌ల కోసం సన్నద్ధమవుతోంది, మే నుండి పరీక్షలు: కేంద్రం

NDA మహిళా క్యాడెట్‌ల కోసం సన్నద్ధమవుతోంది, మే నుండి పరీక్షలు: కేంద్రం

   21-09-2021


అవినీతి ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న అమెజాన్ సంస్థ.. దర్యాప్తు ప్రారంభం

అవినీతి ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న అమెజాన్ సంస్థ.. దర్యాప్తు ప్రారంభం

   21-09-2021


రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించాను..

రెండు పార్టీలు రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేసినా తిరస్కరించాను..

   21-09-2021


ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నెలకు ₹ 1,000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది: నితిన్ గడ్కరీ

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నెలకు ₹ 1,000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది: నితిన్ గడ్కరీ

   19-09-2021


సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసారా..?

సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేసారా..?

   18-09-2021


గత 24 గంటల్లో దేశంలో 35,662 కొత్త కోవిడ్ కేసులు, నిన్నటి కంటే 3.65% ఎక్కువ

గత 24 గంటల్లో దేశంలో 35,662 కొత్త కోవిడ్ కేసులు, నిన్నటి కంటే 3.65% ఎక్కువ

   18-09-2021


ప్రధాన మంత్రి పుట్టినరోజు నాడు రికార్డు వాక్సినేషన్... ఒక్క రోజులో 2.5 కోట్ల కోవిడ్ టీకాలు

ప్రధాన మంత్రి పుట్టినరోజు నాడు రికార్డు వాక్సినేషన్... ఒక్క రోజులో 2.5 కోట్ల కోవిడ్ టీకాలు

   18-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle