newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

బీజేపీ నయా ఎన్నికల స్టంట్.. ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా కోవిద్ టీకా

22-10-202022-10-2020 13:05:36 IST
Updated On 22-10-2020 13:24:03 ISTUpdated On 22-10-20202020-10-22T07:35:36.486Z22-10-2020 2020-10-22T07:32:12.202Z - 2020-10-22T07:54:03.449Z - 22-10-2020

బీజేపీ నయా ఎన్నికల స్టంట్.. ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా కోవిద్ టీకా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే..! ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తూ ఉన్నాయి. పలు అంశాలను ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి పలు పార్టీలు. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అందులో ఉన్న ఓ వాగ్దానం అందరినీ షాక్ కు గురిచేసింది. అదేమిటంటే ప్రతి ఒక్కరికీ ఉచితంగా కోవిద్ టీకా. ప్రపంచాన్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్న కరోనా మహమ్మారికి టీకా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి.. ఇలాంటి సమయంలో బీహార్ లో బీజేపీ ప్రభుత్వం తాము అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికీ ఉచితంగా కోవిద్ టీకా ఇస్తామనడం సంచలమైంది. 

కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బీజేపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. బీహార్‌లో ప్ర‌తి ఒక పౌరుడికి ఉచితంగా టీకా ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ చెప్పారు.  మా ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో మేం చేసిన తొలి వాగ్ధానం ఇదే అని మంత్రి అన్నారు.  పాట్నాలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో నిర్మలా సీతారామన్ బీహార్ ఎన్నిక‌ల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఎన్డీఏకు ఓటేయాలని.. మ‌రో అయిదేళ్ల పాటు నితీశ్ కుమార్ సీఎంగా ఉంటార‌న్నారు.  ఆయ‌న పాల‌న‌లోనే బీహార్ ఉత్త‌మ రాష్ట్రంగా  అభివృద్ధి చెందుతుంద‌ని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. 

బీహార్ రాష్ట్ర ప్ర‌జ‌లు రాజ‌కీయంగా చాలా సున్నితంగా ఉంటార‌ని, వారికి రాజ‌కీయ ప‌రిజ్ఞానం కూడా ఎక్కువేనని అన్నారు.  పార్టీలు చేసే వాగ్ధాల‌ను బీహార్ ఓటర్లు అర్థం చేసుకుంటార‌ని అన్నారు. ఎన్‌డీఏ ప్ర‌భుత్వం హ‌యంలో.. బీహార్‌లో జీడీపీ బాగా పెరిగింద‌న్నారు. 3 శాతం నుంచి 11.3 శాతానికి 15 ఏళ్ల ఎన్డీఏ పాల‌న‌లో పెరిగిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌డం వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌న్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle