newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

రోజువారీ వేతన కార్మికులు శ్రమ శక్తి నుండి తప్పుకునే అవకాశం ఉందా ? కోవిడ్ - 19 సెకండ్ వేవ్ తర్వాత భారత ఆర్ధిక వ్యవస్థ

11-06-202111-06-2021 16:19:21 IST
Updated On 11-06-2021 17:08:43 ISTUpdated On 11-06-20212021-06-11T10:49:21.875Z11-06-2021 2021-06-11T10:49:18.802Z - 2021-06-11T11:38:43.055Z - 11-06-2021

రోజువారీ వేతన కార్మికులు శ్రమ శక్తి నుండి తప్పుకునే అవకాశం ఉందా ? కోవిడ్ - 19 సెకండ్ వేవ్ తర్వాత భారత ఆర్ధిక వ్యవస్థ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్ - 19 మహమ్మారి సెకండ్ వేవ్ భారతదేశ ఆరోగ్యంపై తీవ్ర నష్టాన్ని చూపింది. ఆర్ధిక సంఖ్య కూడా భారీగానే ఉంది. స్వాతంత్రం వచ్చిన తరవాత మొట్టమొదటి సారి పోయిన సంవత్సరం మొదటి క్వార్టర్ లో కేంద్ర ప్రభుత్వం నోటీసు ఇవ్వకుండా లాక్ డౌన్ ని ప్రకటించటం వలన జీడీపీ వృద్ధి 23.9 శాతానికి కుప్పకూలిపోయింది. 2020 - 2021 లో జీడీపీ రేటు 7.3 శాతానికి తగ్గిపోయింది. ( వాస్తవానికి ద్రవ్యోల్భణానికి ఇది సర్దుబాటు చేయబడింది).  

దాదాపు అన్ని రంగాలు చాలా దెబ్బతిన్నాయి. కొన్ని మినహాయింపులతో డిమాండ్ మరియు ఎగుమతుల ఆదాయం క్షీణించింది. సెకండ్ వేవ్ ఎక్కువగా దెబ్బ తీసిన విషయం ఏమిటని గమనిస్తే భారత దేశంలో కోవిడ్ గ్రామాలలోకి, మారు మూల ప్రాంతాలలోకి వ్యాపించింది. చిన్న గ్రామాలు మరియు చిన్న నగరాల్లో వినాశనాన్ని కలిగిస్తుంది.  

లాక్ డౌన్ ప్రయోగం కేవలం అది వ్యాపించటాన్ని విచ్చిన్నం చేయటానికి ఉపయోగపడుతుంది. దాని వలన మరొక వేవ్ ని వాయిదా వేయగలము. కానీ ఈ లొక్డౌన్ సమయంలో ప్రజలందరికీ టీకాలు వేయటం పూర్తి చేయకపోతే దాని వలన పెద్ద ప్రయోజనం లేని పరిస్థితి రావొచ్చు. ఇప్పటికే దేశ జీడీపీ ముందుగా అనుకున్న ప్రణాళిక పట్టికలో పెట్టుకున్న 10 శాతం కంటే చాలా తక్కువగా ఉంటుంది. 

హోల్ సేల్ ధరలకు సంబందించిన ద్రవ్యోల్భణం 10.49 శాతానికి పెరిగింది. ఆహార పదార్ధాలు, క్రూడ్ ఆయిల్ మరియు మ్యానుఫ్యాక్చ రింగ్ గూడ్స్ లో పెరుగుతున్న ధరలు ద్రవ్యోల్బణాన్ని 10.49 శాతానికంటే ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. మార్చ్ నెలలో 7.39 శాతం ఉన్న హోల్ సేల్ ఆధారిత ధరల ఇండెక్స్ వరసగా నాలుగో నెలలో కూడా  పెరుగుతూనే ఉంది. 

అన్నింటికంటే గమనించవలసిందేమిటంటే కేంద్రం యొక్క ప్రధాన సంక్షేమ పథకాలు మందగమనం ఉన్నప్పటికీ వేగవంతం అయ్యాయి. MGNREGA, Ujjwala, NSAP మరియు PM Awas Yojana వంటి పథకాలు FY21 లో భౌతిక మరియు ఆర్ధిక విజయాలలో పెద్ద ఎత్తున దూసుకుపోయాయి, ఎందుకంటే కోవిడ్ -19 బాధిత ప్రజలకు కేంద్రం అదనపు సహాయం అందించింది. 

గత ఏడాది ఏప్రిల్‌లో కోవిడ్ ప్రేరిత లాక్‌డౌన్‌ను దేశం చూసినందున మర్చండైస్ ఎగుమతులు ఏప్రిల్‌లో సంవత్సరానికి 196 శాతం పెరిగాయి. ఏది ఏమయినప్పటికీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఏప్రిల్‌లో ఎగుమతులు 30.6 బిలియన్ డాలర్లు, ఇది 2019 లో ఇదే నెలతో పోలిస్తే దాదాపు 18 శాతం పెరిగింది. 

సామాన్యుల బాధలను మాటల్లో వర్ణించలేము. ద్రవ్యోల్బణం రెండు అంకెలకు పెరిగింది. ఎడిబుల్ ఆయిల్ మరియు పప్పుధాన్యాల ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. గత కొన్ని వారాలలో, రిటైల్ మార్కెట్లలో కంది పప్పు ధరలు క్వింటాల్‌కు 7,000 రూపాయలకు పైగా ఉన్నాయి, ఇది 2020-21 MSP కన్నా దాదాపు 1,000 రూపాయలు ఎక్కువ. మినప్పప్పు ధరలు క్వింటాల్‌కు రూ .8,000 చొప్పున మరింత ఎక్కువగా ఉన్నాయి. పెసరపప్పు మార్కెట్ ధర క్వింటాల్‌కు 7,196 రూపాయల ఎంఎస్‌పి దగ్గర ఉంది. రిటైల్ ధరలు మరింత పెరగకుండా ఉండటానికి, కేంద్ర ప్రభుత్వం శనివారం కంది పప్పు, మినపపప్పు మరియు పెసరపప్పు ఉచితంగా దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. అయినప్పటికీ అవి సామాన్యులకి తక్కువ ధరలతో చేరతాయా అన్న విషయాన్ని వేచి చూడాల్సిందే. 

పెట్రోల్ మరియు డీసెల్ ధరలు 100 రూపాయలకి చేరుకోబోతున్నాయి. కొన్ని ప్రదేశాలలో మూడు అంకెలను చేరింది కూడా. డీజిల్ ధరల పెరుగుదల రావాణా సంస్థలు వారి రేట్లను పెంచటానికి దారి తీస్తుంది. అధిక రవాణా ధరలు ద్రవ్యోల్భణానికి దారి తీస్తాయి. అధిక రవాణా ధరలు కేవలం ప్రజల మీదే కాకుండా ఆటోమోటివ్ సెక్టార్ పైన కూడా అవి ప్రభావం చూపుతాయి. దేశంలో అతి పెద్ద ఉపాధి వనరులులలో ఒకటి వాహనాలు ఆ  వాహనాల అమ్మకాలు గణనీయంగా తగ్గుతాయి. వాహనాలు డిమాండ్‌  తగ్గితే ఈ రంగానికి వస్తువులను సరఫరా చేసే లక్షలాది ఎంఎస్‌ఎంఇ లపై ఇది  ప్రభావితం చేస్తుంది. పెరుగుతున్న ఆపరేషనల్ కాస్ట్ దృష్ట్యా పబ్లిక్ రవాణా రంగం ఇప్పటికే రేట్లను పెంచటం మొదలుపెట్టింది.

అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్  రేట్లు ఇంధనంపై విధించే అధిక పన్నులు దేశంలో తాజాగా పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు. దేశంలో ఇంధన ధరలు పెరగడానికి అతిపెద్ద కారణం మన కేంద్ర, రాష్ట్ర పన్నుల రేటు. డిమాండ్ తగ్గడం వల్ల 2020 లో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు క్షీణించినప్పటికీ, మనము వివిధ పన్నులు విధించడం వలన భారతీయులు పెట్రోల్, డీజిల్ కోసం అధిక ధరలు చెల్లిస్తూనే ఉన్నారు. నిజానికి ఇప్పటి లెక్కలు తీసుకుంటే భారతీయులే ప్రపంచంలో అన్ని దేశాలకంటే ఇంధనంపై అత్యధిక పన్నులు చెల్లిస్తున్నారు.

ఈ కోవిడ్ - 19 మనకి మన ఆర్ధిక సాంఘిక పరిస్థితులని మేనేజ్ చేసే విషయంలో చాలా పెద్ద పాఠాలని నేర్పించిందనే చెప్పాలి. మనకి ఏంతో కావలసిన వాళ్ళ ఆరోగ్యం బాగోలేక పోయినా, వారి ఆర్ధిక పరిస్థితి దెబ్బ తిన్నా, వారికి ఉత్తమమైన వైద్య సదుపాయాలు లభించక పోయినా అది మనల్ని విపరీతంగా బాధిస్తుంది. అటువంటిది ఇప్పడు అది ఒకేసారి అతి పెద్ద సెక్షన్ అయిన శ్రామిక జనాభాలో అతి ఎక్కువగా దెబ్బతీసింది. వేతనాల కోత, ఉద్యోగ నష్టాలు లాంటి ఒత్తిడులని వారు ఎదుర్కుంటున్నారు. అంతే కాకుండా ఇంటి నుండి పనిచేయటం అనే పద్దతి పరిశుభ్రత మరియు సంరక్షణపై దృష్టి పెట్టడం వలన ఒకేసారి చాలా కుటుంబాలకు నెలవారీ ఖర్చులని పెంచింది.

ఎన్నో పెద్ద భారత కార్పొరేట్ కంపెనీల అంచనాల ప్రకారం రాబోయే 3 సంవత్సరాలలో ఈ మహమ్మారి ప్రభావం వ్యాపారుల కొత్త స్ట్రాటెజిలానీ ప్రభావితం చేస్తుంది. సంపూర్ణ లాక్ డౌన్ సమయాలలో నిరుద్యోగులని, వారి ఉద్యోగాలలో అస్థిరతని కాపాడుతుంది. కానీ కార్మిక వ్యవస్థలోనే ఒక నిరుత్సాహ పరిచే అవకాశం ఉంది. అసలు కార్మిక మార్కెట్ లోకి ప్రవేశించాలా వద్దా అనే ఒక ఆలోచనని రేకెత్తిస్తుంది. ప్రజలు ముందుకంటే చాలా వేగంగా శ్రమ శక్తి నుండి తప్పుకోవచ్చు. అలా చేయటం కార్మికుల ఆదాయానికి భంగం కలిగిస్తుంది. తద్వారా వాళ్ళు చిన్న చిన్న ఆస్తులని తనికీ పెట్టటం, అప్పులు చేయటం, వాటికి వడ్డీ కట్టలేని పరిస్థితులని ఎదురుకోవటం జరగొచ్చు. ఉద్యోగ నష్టాల మూలంగా అనధికారిక రంగాలు ప్రభావితమవడంతో, సమాజంలోని దిగువ శ్రేణి మరియు రోజువారీ వేతన కార్మికులు సామాజిక దూరం మరియు గృహ ఆదాయం తగ్గడం వల్ల ఎక్కువ ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. 

ప్రస్తుతం ఉన్న సాధారణ ఫార్ములాతో పోల్చితే ప్రస్తుత వడ్డీ రేట్లలో భారీ అంతరం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్ రేటు నాలుగు శాతం వద్ద ఉంది, అయితే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సి), కిసాన్ వికాస్ పత్రా (కెవిపి), టర్మ్ డిపాజిట్లు మొదలైన అనేక చిన్న పొదుపు పరికరాలపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సమీక్ష జూన్ 30 న. రేట్లు క్రిందికి సవరించబడితే, జూన్ 30 నాటికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న రేట్ల వద్ద, వర్తించే చోట లాక్ చేయడం మంచిది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కార్యకలాపాల తొందరపాటు గురించి మనందరికీ తెలుసు: పోస్ట్ ఆఫీస్ లాంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు మార్చి 31 న ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా గణనీయంగా తగ్గించబడ్డాయి. అదే రోజు, ఆర్డర్ ఉపసంహరించబడి పూర్వపు రేట్లు కొనసాగించాలన్నారు. 

ప్రస్తుతం ఉన్న సాధారణ ఫార్ములాతో పోల్చితే ప్రస్తుత వడ్డీ రేట్లలో భారీ గ్యాప్ ఉంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్ రేటు నాలుగు శాతం వద్ద ఉంది, అయితే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సి), కిసాన్ వికాస్ పత్రా (కెవిపి), టర్మ్ డిపాజిట్లు మొదలైన అనేక చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. రేట్లు క్రిందికి సవరించబడితే, జూన్ 30 నాటికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న రేట్ల వద్ద, వర్తించే చోట లాక్ చేయడం మంచిది.

ఆర్‌బిఐ తన వార్షిక నివేదికలో సెకండ్ వేవ్ తో మన ఆర్ధిక సంస్థ కుదేలయినప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం, రబీ పంట యొక్క అవకాశాల మద్దతుతో, మార్చి వరకు ఆర్థిక వ్యవస్థ యొక్క అనేక రంగాలలో సేకరణ వేగం పెంచటం ద్వారా స్తిమితంగానే ఉంది అన్నారు. ముఖ్యంగా గృహనిర్మాణం, రహదారి నిర్మాణం మరియు నిర్మాణంలోని సర్వీసులు, సరుకు రవాణా మరియు సమాచార, సాంకేతిక పరిజ్ఞానం (ఐటి) సేవల కార్యకలాపాలు వంటి వాటితో అన్నారు.

 

 

బీజేపీ యేతర వేదిక సిద్దమవుతుంది, ఈ రోజు ప్రతిపక్ష పార్టీల సమావేశానికి శరద్ పవార్ పిలుపునిచ్చారు

బీజేపీ యేతర వేదిక సిద్దమవుతుంది, ఈ రోజు ప్రతిపక్ష పార్టీల సమావేశానికి శరద్ పవార్ పిలుపునిచ్చారు

   7 hours ago


భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కోవిద్-19 కేసులు.. 91 రోజుల్లో అతి తక్కువ కేసులు

భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కోవిద్-19 కేసులు.. 91 రోజుల్లో అతి తక్కువ కేసులు

   8 hours ago


మహారాష్ట్రలో కొత్త డెల్టా - ప్లస్ కోవిడ్ వేరియంట్ 21 కేసులు నమోదు: మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే

మహారాష్ట్రలో కొత్త డెల్టా - ప్లస్ కోవిడ్ వేరియంట్ 21 కేసులు నమోదు: మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే

   11 hours ago


ప్రధాని నరేంద్ర మోడీ పై సుప్రీం కోర్టు ఆగ్రహం

ప్రధాని నరేంద్ర మోడీ పై సుప్రీం కోర్టు ఆగ్రహం

   12 hours ago


ఈ రోజు ఉత్తర అర్ధగోళంలో పొడవైన రోజు, ఢిల్లీ 14 గంటల సుదీర్ఘ పగటిపూట అనుభవిస్తుంది

ఈ రోజు ఉత్తర అర్ధగోళంలో పొడవైన రోజు, ఢిల్లీ 14 గంటల సుదీర్ఘ పగటిపూట అనుభవిస్తుంది

   a day ago


 దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్ ఈ రోజు నుంచే.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీ

దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్ ఈ రోజు నుంచే.. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్రీ

   21-06-2021


అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021

   21-06-2021


కోవిడ్ ఉద్భవించినప్పుడు, ఏ దేశమూ సిద్ధం కాలేదు; యోగా సహాయపడింది: మోడీ

కోవిడ్ ఉద్భవించినప్పుడు, ఏ దేశమూ సిద్ధం కాలేదు; యోగా సహాయపడింది: మోడీ

   21-06-2021


జూన్ 23 నుండి భారతదేశం నుండి దుబాయ్ వెళ్లే విమానాలను ప్రారంభం

జూన్ 23 నుండి భారతదేశం నుండి దుబాయ్ వెళ్లే విమానాలను ప్రారంభం

   20-06-2021


కొత్తగా ఎన్నికైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని ప్రధాని మోదీ అభినందించారు

కొత్తగా ఎన్నికైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని ప్రధాని మోదీ అభినందించారు

   20-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle