newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సింహాలకూ వైరస్... శ్యాంపిల్ పరీక్షలలో నిర్ధారణ

04-05-202104-05-2021 20:25:47 IST
2021-05-04T14:55:47.338Z04-05-2021 2021-05-04T13:18:08.433Z - - 14-05-2021

సింహాలకూ వైరస్... శ్యాంపిల్ పరీక్షలలో నిర్ధారణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మనుష్యుల నుంచే వ్యాపించిందా?    

హైదరాబాద్: మానవ జాతిని కబళిస్తున్న కరోనా వైరస్ జంతు జాతులను సైతం కలవరపెడుతోంది. ఈ అతి సూక్ష్మ జీవి అనంతమైన విలయాన్ని సర్వత్రా రేకెత్తిస్తోంది. ఈ వైరస్ ఎక్కడ పుట్టిందో ఎలా మానవ జాతికి సోకిందో ఇంత విలయం జరుగుతున్నా లక్షలాది మంది బలవవుతున్నా అంతుబట్టడం లేదు.  తాజాగా ఈ వైరస్ మనుషుల నుంచి జంతువులకు వ్యాపిస్తోందన్న కథనాలు కూడా నివ్వెరపరుస్తున్నాయి. హైదరాబాద్ లోని నెహ్రు జూలాజికల్ పార్క్ లో  8 సింహాలకు ఈ వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది. సింహాలలో వైరస్ లక్షణాలు ఉన్నాయని గుర్తించిన అధికారులు వాటి శ్యాంపుల్స్ ను సి సి ఎం బి కి పంపి వైరస్ సోకిన విషయాన్ని నిర్ధారించారు. అధికారికంగా ఇందుకు సంబంధించి ధ్రువీకరణ లేకపోయినా ఈ సింహాలలో వైరస్ లక్షణాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. సింహాలలో ఈ వైరస్ రావడానికి కారణమేమిటి? మనుష్యుల నుంచే ఇది వ్యాపించిందా అని నిర్ధారించుకోవడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు కూడా చేస్తున్నట్లుగా సమాచారం.  ఈ ఎనిమిది సింహాలలో 4 అడ్డు సింహాలు కూడా ఉన్నాయి. వీటిలో ముక్కు కారడం, దగ్గు, ఏం పెట్టినా తినని లక్షణాలను గమనించిన జూ సిబ్బంది వాటి శ్యాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు.

ప్రస్తుతం ఈ జూలో 12 సింహాలు ఉన్నాయి. మానవాళిని అనూహ్య రీతిలో కబళిస్తున్న ఇతర జంతువులకు వ్యాపించకుండా అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితమే జూ పార్క్ మూసివేశారు. మనుష్యుల నుంచి జంతువులకు ఈ వైరస్ వ్యాపించకుండా నిరోధించేందుకు అన్ని జాతీయ పార్కులు, వన్య సంరక్షణ కేంద్రాలు, పులుల అభయారణ్యాలను మూసి వేయాలని జాతీయ జూ అథారిటీ నిర్ణయించింది. జూ పార్క్లో ఉన్న అన్ని జంతువులు ముఖ్యంగా పులులు సింహాల వంటివాటి ఆరోగ్య పరిస్థితిని సిబ్బంది ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి థర్మల్ స్కానింగ్ కూడా జరిపారు. గత ఏడాది మార్చి నుంచి కూడా జంతు సంరక్షణ విషయంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. ఎనిమిది నెలల పాటు మూసివేసిన తరువాత గత ఇది అక్టోబర్ లోనే ఈ జూను తెరిచారు. దాదాపు 300 ఎకరాలలో విస్తరించిన నెహ్రూ  జూలాజికల్ పార్క్ అరుదైన జంతుజాలానికి అద్భుతమైన జీవజాతులకు, పక్షులు, జలచరాలకు పెట్టని కోట. ఆసియాలోనే ఓ అద్భుతాన్ని తలపింపజేసే ఈ జూను వార్షికంగా 30 లక్షల మంది సందర్శించారని అంచనా.

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   2 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   10 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   11 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   21 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle