newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్.. ఒకేసారి 35 మందితో డేటింగ్

24-04-202124-04-2021 16:40:08 IST
Updated On 24-04-2021 18:05:57 ISTUpdated On 24-04-20212021-04-24T11:10:08.271Z24-04-2021 2021-04-24T11:10:01.347Z - 2021-04-24T12:35:57.547Z - 24-04-2021

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్.. ఒకేసారి 35 మందితో డేటింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జింగ్ జింగ్ అమేజింగ్. అమేజింగా వాడి బొందా.  ఒకేసారి 35 మందితో డేటింగ్ ఏంట్రా నాయ‌నా. ఉంటానికా పోటానికా.. నారీ నారీ న‌డుమ మురారీ అంటేనే.. పిచ్చి పీక్స్ కి వెళ్తుంది. ఇద్ద‌రు ముగ్గురు గ‌ర్ల్ ఫ్రెండ్స్ ని మేన్ టేన్ చేసే వారికే మెంట‌లెక్కుతుంది. అలాంటిది.. ఒకేసారి.. 35  మందితో డేటింగ్ అంటే మామూలు విష‌య‌మా చెప్పండి. ఏడాది పొడువునా బ‌ర్త్ డేలే జ‌రుపుకుంటాడ‌ట ఆ కిలాడీ గాడు. 

అయితే.. ఆ అప్డేటెడ్ లేటెస్ట్ వ‌ర్ష‌న్ ల‌వ‌ర్ బాయ్ క‌మ్ ప్లే బాయ్ ది ఇండియా కాదులే. ఇక్క‌డ అలాంటి ఎవ్వారాల్లో వెంట‌నే తేడాలు వ‌స్త‌య్ క‌దా. ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. మ‌న శివంగులు చీల్చి చెండాడేస్తారు. అయితే.. జ‌పాన్ లో ఓ సేల్స్ బాయ్ చేసిన ఎవ్వారం ఇది. ఆర్డ‌ర్ వ‌చ్చిందంటే  చాలు.. అమ్మాయా ఆంటీనా అని చూస్తాడ‌ట‌. ఇంటికెళ్లేటైంలో పులిహోర పొట్లాలు రెడీ చేసుకుని వెళ్తాడ‌ట‌. వాళ్లు ఏం ఆర్డ‌ర్ ఇచ్చినా స‌రే.. దానికి తోడుగా పులిహోర క్రీమ్ బిస్కెట్లు అన్నీ తీసుకుపోతాడ‌ట‌. ఒంట‌రి మ‌హిళ‌లు అని తెలిస్తే చాలు.. అయ్య‌య్యో.. పులిహోర క్రీమ్ బిస్కెట్లు లేకుండా ఎలా బ‌తికేస్తున్నారు.. అంటూ మ్యూజిక్ స్టార్ట్ చేస్తాడ‌ట‌. అలా అలా మొత్తం 35 మందితో రొమాంటిక్ ల‌వ్ స్టోరీ న‌డుపుతూ.. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ అవ్వాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేసేవాడ‌ట‌.

కాటి కాపరికి 9 మంది భార్య‌లు.. ఆస్తి కోసం కాప‌రిపై హ‌త్యాయ‌త్నం

ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రిని మేన్ టేన్ చేస్తూ.. వారిని కల‌వ‌డానికి.. త‌ను ప‌ని చేసే డెలివ‌రీ కంపెనీ నుంచి ఆర్డ‌ర్ లు తీసుకుంటూ.. ఆర్డ‌ర్ల‌తో పాటు.. వారి అవ‌స‌రాలు కూడా తీర్చి వ‌చ్చేవాడ‌ట మియాగావా అనే ప్లే బోయ్. మ‌రి ఇక వారి నుంచి గిఫ్ట్ లు రావాలి అంటే.. బ‌ర్త్ డే అనే సాకు ఉండాలి క‌దా. అలా అలా కాస్ట్ లీ గిఫ్ట్ లు తీసుకోవ‌డం.. అవి కూడా త‌మ కంపెనీ నుంచే ఆర్డ‌ర్ పెట్టించ‌డం.. అది ఇవ్వ‌డానికి వెళ్లి కూడా క‌లిసి రావ‌డం...ఇలా ఇలా న‌డిచిపోయింది. కొన్నాళ్లకి సారు వారి మీద ఒక‌రిద్ద‌రికి డౌట్ వ‌చ్చిందంట‌.  అలా అలా వాళ్లు కొంత‌మంది ఏకం అయ్యార‌ట‌. పోలీస్ స్టేష‌న్ లో కంప్లైంట్స్ చేశార‌ట‌. ఇంకేముంది.. చిట్టా మొత్తం బ‌య‌టప‌డుతుంది క‌దా. మొత్తం 35 మందిని చూస్తే.. అంద‌రూ మిడ్ ఏజ్ దాటిన వాళ్లే ఉన్నార‌ట‌. అదీ సారు వారి మిడ్ ఏజ్ ప్రేమ క‌థా చిత్ర‌మ్.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle