newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భార్య‌కి క‌రోనా.. త‌ల న‌రికిన భ‌ర్త‌

27-04-202127-04-2021 07:48:00 IST
2021-04-27T02:18:00.782Z27-04-2021 2021-04-27T02:17:53.678Z - - 14-05-2021

భార్య‌కి క‌రోనా.. త‌ల న‌రికిన భ‌ర్త‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఇంత‌కు మించిన దారుణం ఉంటుందా చెప్పండి. అవును మ‌న‌కి దారుణం లాగే అనిపిస్తుంది. కానీ.. ఆ భ‌ర్త ఏ పొజిష‌న్ లో ఉన్నాడో అని ఓసారి ఆలోచించాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. ఆయ‌న ఆమె త‌ల న‌ర‌క‌డానికి త‌న ఆవేశ‌మో బాధో కార‌ణం కాదు. మ‌నం స‌రైన ఎడ్యుకేష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డ‌మే రీజ‌న్. మ‌నం స‌రైన ఇన్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డ‌మే రీజ‌న్. మ‌నం ఓవ‌ర్ హైప్ ఇవ్వ‌డ‌మే రీజ‌న్. మ‌నం ఎక్కువ చేసి చెప్ప‌డ‌మే రీజ‌న్. ఇలా చుట్టూ ఉన్న స‌మాజం.. భ‌య‌పెడుతున్న జ‌నాలే రీజ‌న్.

క‌రోనా డేంజ‌రే. కానీ.. అదేదో ఏలియ‌న్ కాదు ఎత్తుకుని పోవ‌డానికి. డ్రాకులా కాదు మింగేయ‌డానికి.. భూతం కాదు మాయం చేయ‌డానికి. క‌రోనా అనేది అంటు వ్యాధి. అంటించుకుంటే అంటే వ్యాధి. దూరంగా ఉంటే..  ద‌గ్గ‌రికి రాని వ్యాధి. కానీ.. ఈ విష‌యాల్లో చాలా మందికి క్లారిటీస్ లేవు. జ‌నం టెన్ష‌న్ ప‌డుతున్నారు. అంత‌మంది చ‌స్తున్నారు.. ఇంత మంది చ‌స్తున్నారు.. కాల్చ‌డానికి శ్మ‌శానాల్లో ఖాళీలు కూడా దొర‌క‌డం లేదు అంటూ.. ఇలా ఎన్నో వింటుంటాం క‌దా. వాట‌న్నిటి వ‌ల్లే... త‌ను అత‌ని భార్య త‌ల న‌రికాడు అన‌డంలో ఎలాంటి అనుమాన‌మూ అక్క‌ర్లేదు.

ఇక ఇలాంటి దారుణ ఘ‌ట‌న జ‌రిగిన ప్లేస్ ని కూడా ఆలోచించాలి.  జ‌రిగిందో ఎక్క‌డో తెలుసా. బీహార్ లోని ప‌త్రాక‌ర్ న‌గ‌ర్ లో జ‌రిగింది. అయితే.. ఓ రైల్వే ఉద్యోగి ఈ దారుణం చేశాడు. భార్య‌కి క‌రోనా అని తెలియ‌గానే ఏం చేయాలో అర్దం కాక‌.. ఇక చావు త‌ప్ప‌దు అనుకున్నాడు. టీవీల్లో చూస్తున్న క‌ష్టాల‌న్నీ ప‌డక త‌ప్ప‌దూ అనుకున్నాడు కావ‌చ్చు. వెంట‌నే భార్య త‌ల న‌రికేశాడు. త‌ర్వాత మ‌రో భ‌యం ప‌ట్టుకుంటుంది క‌దా. ఇప్పుడు త‌న ప‌రిస్థితి ఏంటి. ఏదో ఆవేశంలో టెన్ష‌న్ తో భార్య‌ని న‌రికేశాడు. ఇప్పుడు త‌న‌కి జైలు శిక్ష త‌ప్ప‌దు అనుకుంటాడు క‌దా. ఇక ఆ జైలుకి ఏం పోతాం లే అనుకున్నాడో.. త‌న భార్య‌కి క‌రోనా ఉంటే త‌న‌కీ ఉండే ఉండొచ్చు అనుకున్నాడో ఏమో.. త‌ను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle