newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

క‌రోనా వ్యాక్సిన్ రెండో డోస్ లేట్ అయితే ప‌రిస్థితి ఏంటి..?

13-05-202113-05-2021 10:03:39 IST
Updated On 13-05-2021 10:21:49 ISTUpdated On 13-05-20212021-05-13T04:33:39.907Z13-05-2021 2021-05-13T04:23:30.905Z - 2021-05-13T04:51:49.598Z - 13-05-2021

క‌రోనా వ్యాక్సిన్ రెండో డోస్ లేట్ అయితే ప‌రిస్థితి ఏంటి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌రోనా క‌రోనా క‌రోనా. రోజులు వంద సార్లు క‌రోనా గుర్తు రాకుండా నిద్ర పోవ‌డం లేదు జ‌నాలు. క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తుంది. సంజీవ‌ని వ‌స్తుంది అనుకున్నారు. వ‌చ్చింది కానీ.. అది పెద్ద సంజీవ‌ని ఏం కాదు అనుకున్నారు. అయినా స‌రే.. కొంత‌లో కొంత ప్రాణాలు కాపాడుతోంది వ్యాక్సిన్. వ్యాక్సిన్ తీసుకున్న వారికి క‌రోనా వ‌చ్చినా కానీ.. ప్రాణాపాయం లేక‌పోవ‌డంతో.. కూల్ అనుకుంటున్నారు. క‌రోనా వ‌చ్చినా.. ఓ జ్వ‌రంలా వ‌చ్చి.. నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే మాయం అయిపోతోంది. సో.. వ్యాక్సిన్ తో సేఫే. 

అయితే.. క‌రోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూసే వారు ఎదురు చూస్తుంటే.. వ్యాక్సిన్ రెండో డోస్ కోసం ఎదురు చూసే వారిలో కొత్త భ‌యం త‌ప్ప‌డం లేదు. ఆల్రడీ వ్యాక్సిన్ తీసుకున్నారు. హమ్మ‌య్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఊపిరి పీల్చుకుందాం అంటే మాస్కు త‌ప్ప‌ట్లేదు క‌దా. అయితే.. వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకున్న వారికి మాత్రం.. రెండో డోస్ లేట్ అయితే ప‌రిస్థితి ఏంటి అనే భ‌యంతో ఊపిరి ఆడ‌డం లేద‌ట‌.

నిజ‌మే క‌దా. ఒక డోస్ వేశారు. టైం చెప్పి.. రెండో డోస్ కోసం ర‌మ్మ‌న్నారు. కానీ.. రెండో డోస్ తీసుకునే ప‌రిస్థితి లేదు. అస‌లు వ్యాక్సిన్ స్టాకే లేదు. వ్యాక్సిన్ ఫ‌స్ట్ డోస్ తీసుకుని.. మూన్నాలుగు వారాలు అవుతోంది. వారాల మీద వారాలు గ‌డిచిపోతోంది. ఇప్పుడు రెండో డోస్ తీసుకోక‌పోతే.. బాడీ తట్టుకుంటుందా.. ఇంకేమైనా ప్రాబ్ల‌మ్ వ‌స్తుంది. ఒక్క డోస్ తీసుకోవ‌డం వ‌ల్ల‌నే వ‌చ్చే కొత్త స‌మ‌స్య‌లు ఏమైనా ఉన్నాయా. నీర‌సం వచ్చి ప‌డిపోతామా అంటూ భ‌యం త‌ప్ప‌డం లేదు.

ఫ‌స్ట్ డోస్ తీసుకున్నాం క‌దా.. కొంత‌లో కొంత సేఫ్ అని ఫీల్ అవ్వాలా. సెకండ్ డోస్ తీసుకోలేదు అని భ‌య‌ప‌డాలా అర్దం కాని ప‌రిస్థితిలో ఉండిపోయారు. అయితే.. నిపుణులు మాత్రం.. అలాంటి కంగారేం లేదు అంటున్నారు. ఫ‌స్ట్ డోస్ తీసుకుంటే సేఫ్.. ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కండి అంటున్నారు. ఫ‌స్ట్ డోస్ తో క‌రోనాని త‌ట్టుకునే శ‌క్తి కొంత వ‌స్తుంది. సెకండ్ డోస్ తీసుకుంటే ఇంకొంత వ‌స్తుంది.

సో.. ఫ‌స్ట్ డోస్ తీసుకోవ‌డం వ‌ల్ల‌.. మీ బాడీలో క‌రోనాని త‌ట్టుకునే శ‌క్తి ఎంతో కొంత పెరుగుతుందే త‌ప్ప‌.. న‌ష్టం ఏమీ లేదు అంటున్నారు. అలాగే రెండో డోస్ కి రెండు మూడు నెల‌లు లేట్ అయినా కంగారు ఏం లేదు అని క్లారిటీ ఇస్తున్నారు. సెకండ్ డోస్ తీసుకుంటే.. ఇంకాస్త ప‌వ‌ర్ పెరుగుతుంది.. అంతే త‌ప్ప‌.. సెకండ్ డోస్ తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల‌.. ప్ర‌త్యేకంగా వ‌చ్చే న‌ష్టం ఏమీ లేదు. కాబ‌ట్టి.. కంగారేం లేకుండా ఇంట్లో ఉండండి.. జాగ్ర‌త్త‌గా ఉండండి అంత‌కు మించిన ఆయుధ‌మే లేదు అంటున్నారు.

ICAI CA పరీక్ష అడ్మిట్ కార్డు విడుదల - డౌన్‌లోడ్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

ICAI CA పరీక్ష అడ్మిట్ కార్డు విడుదల - డౌన్‌లోడ్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

   21-06-2021


World Music Day 2021: వరల్డ్ మ్యూజిక్ డే - జూన్ 21

World Music Day 2021: వరల్డ్ మ్యూజిక్ డే - జూన్ 21

   21-06-2021


బ్రిటన్ లో 10 మిలియన్ సంవత్సరాల క్రితం చివరి డైనోసార్ల పాదముద్రలు

బ్రిటన్ లో 10 మిలియన్ సంవత్సరాల క్రితం చివరి డైనోసార్ల పాదముద్రలు

   20-06-2021


ఏపీ లో కర్ఫ్యూ సడలింపు.. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు

ఏపీ లో కర్ఫ్యూ సడలింపు.. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు

   18-06-2021


యూట్యూబ్ లో ఇక ఆ ప్రకటనలు కనిపించవు..

యూట్యూబ్ లో ఇక ఆ ప్రకటనలు కనిపించవు..

   18-06-2021


ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం బోట్స్వానాలో వెలికితీసిన

ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం బోట్స్వానాలో వెలికితీసిన

   18-06-2021


బెంగాల్‌లో భారీ వర్షాలు, రాబోయే మూడు రోజుల్లో కూడా బెంగాల్‌లో భారీ వర్షాలు

బెంగాల్‌లో భారీ వర్షాలు, రాబోయే మూడు రోజుల్లో కూడా బెంగాల్‌లో భారీ వర్షాలు

   17-06-2021


వంట నూనె త్వరలో చౌకగా మారవచ్చు

వంట నూనె త్వరలో చౌకగా మారవచ్చు

   15-06-2021


Crime News: రోజు రోజుకీ నేర ప్రవృత్తి మనుషుల్లో పెరిగిపోతుందా?

Crime News: రోజు రోజుకీ నేర ప్రవృత్తి మనుషుల్లో పెరిగిపోతుందా?

   15-06-2021


జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

   14-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle