newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇంట్లో ఉన్న మాస్క్ తప్పదు.!

27-04-202127-04-2021 15:49:29 IST
2021-04-27T10:19:29.632Z26-04-2021 2021-04-26T16:59:43.600Z - - 14-05-2021

ఇంట్లో ఉన్న మాస్క్ తప్పదు.!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వికృత రూపం దాలుస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజలు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ వైరస్ రెండవ దశ మరింత తీవ్రమైనది కావడంతో ప్రజలు బయటకు వెళ్ళినప్పుడే కాకుండా ఇళ్ళల్లోను తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని స్పష్టం చేసింది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తే ఈ వైరస్ వ్యాప్తిని ఎవరి స్థాయిలో వారు అరికట్టగలుగుతారని తెలిపింది. ఇళ్లల్లోను మాస్కులు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం తప్పనిసరి అని వెల్లడించింది.

కేవలం బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం అలాగే సామాజిక దూరాన్ని పాటించడం వంటివి చేస్తే సరిపోతుందని అనుకోవడం పొరపాటని, ఇంట్లో ఉన్న ఎవరి జాగ్రత్తలో వారు ఉండడం మంచిదని వెల్లడించింది. ఈ వైరస్ సోకిన వారికి అన్ని విధాలుగా చికిత్సను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇంట్లో ఉన్నవారు సైతం కోవిడ్ నిబంధనలను నిర్లక్ష్యం చేయకూడదని నీతిఆయోగ్ సభ్యుడు వి.కె. పాల్ తెలిపారు. ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోవడం వల్ల ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. ఫలితంగా ఆక్సిజన్ కొరత ఏర్పడి రోగులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆక్సిజన్ ను సహేతుకంగా వాడాల్సిన అవసరం ఎంతో ఉందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. చిన్నచిన్న సమస్యలతోనే ప్రజలు భయపడి ఆసుపత్రులకు పరుగులు తీయవద్దని, ఇళ్ళల్లోనే ఉండి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. తగిన భౌతిక దూరాన్ని పాటించక పోవడం వల్ల కూడా ఇళ్ళల్లోనూ ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది అని వి.కె.పాల్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ నిబంధనలు విస్మరించడం వల్ల ఒకే వ్యక్తి కారణంగా నెల రోజుల వ్యవధిలో 400మందికి పైగా ఈ వైరస్ కు గురయ్యారని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటివాల్లని ఇళల్లోకి రానివ్వకూడదని, కుటుంబ సభ్యుల మధ్యనే ఉన్న మాస్కులు ధరించడం సురక్షితం అని అన్నారు.

మరోపక్క రెండు మాస్కులు ధరించడం కూడా ఎంతో అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సోమవారం కూడా 3లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదు కావడంతో వైరస్ వ్యాప్తి నిరోధించడానికి ప్రభుత్వాలు తాజా మార్గదర్శకాలు జారీ చేశాయి. మొదటి దశలో కంటే కూడా ఈ వైరస్ రెండవ దశ తీవ్రమైనదికావడం వల్లే కేసుల వ్యాప్తి పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే డబుల్ మాస్కులు, ఇంట్లో ఉన్న సామాజిక దూరం పాటించాలన్న హెచ్చరికలు వస్తున్నాయి.

కోవిడ్ మామూలు వ్యాధే.. ఎయిమ్స్ వైద్యుడు


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle