newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ

03-05-202103-05-2021 10:45:44 IST
2021-05-03T05:15:44.591Z03-05-2021 2021-05-03T04:57:39.620Z - - 14-05-2021

తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తిరుమలలో ఆదివారం నాడు భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. ఆదివారం నాడు స్వామిని 10,824 మంది దర్శించుకున్నారని, 5,503 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం కూడా భారీగా తగ్గిపోయింది. నిన్న రూ. 78 లక్షల హుండీ ఆదాయం లభించిందని టీటీడీ పేర్కొంది. కరోనా కారణంగా తిరుమలకు వచ్చేందుకు భక్తులు సంకోచిస్తున్నారని, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన వారిలో సైతం పలువురు రావడం లేదని అధికారులు తెలిపారు.

కరోనా ప్రభావంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం భారీగా పడిపోయింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిన క్రమంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయిందని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు 9,703 మంది శ్రీవారిని దర్శించుకోగా, హుండీ కానుకలు రూ.46 లక్షలు వచ్చినట్టు టీటీడీ ఆదివారం ప్రకటించింది. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) ట్రస్టుకు ఆదివారం రూ.కోటి విరాళంగా అందింది. చెన్నైకి చెందిన జీస్క్వేర్‌ రియాల్స్ట్‌ సంస్థ ప్రతినిధులు ఈ విరాళాన్ని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం.. చిత్తూరు జిల్లాలోనూ ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతూ ఉండడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. ఆన్‌లైన్‌లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకుని కరోనా కారణంగా రాలేకపోయిన భక్తులు 90 రోజుల్లో ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని టీటీడీ తెలిపింది.  దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. కరోనా పెరుగుతూ ఉండడంతో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తగ్గించింది. మే నెలకు సంబంధించి టికెట్ల కోటాను రోజుకు 25 వేల నుంచి 15 వేలకు తగ్గించారు. అయినప్పటికీ భక్తులు తిరుమల దర్శనానికి రావడానికి సంశయిస్తూ ఉన్నారు. ఇంకొద్ది రోజులు ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. దేశంలోని ఎన్నో ప్రముఖుల ఆలయాలు కూడా భక్తుల సందర్శనను నిలిపివేశాయి.  

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle