newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

అరుదైన రికార్డ్ సాధించిన ప్రియాంక మోహితే

09-05-202209-05-2022 21:01:59 IST
2022-05-09T15:31:59.944Z09-05-2022 2022-05-09T15:31:57.532Z - - 27-05-2022

అరుదైన రికార్డ్ సాధించిన ప్రియాంక మోహితే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా 8000 మీటర్ల ఎత్తులో ఉండే ఐదు శిఖరాలను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా ప్రియాంక మోహితే గుర్తింపు పొందింది. కాంచన్‌జంగా పర్వతాన్ని అధిరోహించిన తర్వాత ఈమె ఈ రికార్డ్ సాధించింది. మోహితే ఇప్పటివరకు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ (8849 మీ), మౌంట్ లోట్సే (8516 మీ), మౌంట్ మకాలు( 8485 మీ),  అన్నపూర్ణ(8,091 మీ), కాంచన్‌జంగా(8586 మీ) పర్వతలను అధిరోహించింది. 

 

మహారాష్ట్ర లోని సతారా జిల్లాకు చెందిన మోహితేకు చిన్నప్పటి నుండి పర్వతారోహణ అంటే మక్కువ. తన యుక్తవయస్సులో మహారాష్ట్రలోని సహ్యాద్రి శ్రేణిలో పర్వతాలను అధిరోహణ చేయడం ప్రారంభించింది.2012లో, తొలిసారిగా ఉత్తరాఖండ్‌లోని హిమాలయాలలోని గర్వాల్ డివిజన్‌లోని పర్వత మాసిఫ్‌లో ఉన్న బందర్‌పంచ్‌ను అధిరోహించింది. 2020లో ప్రతిష్టాత్మక టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డు  అందుకుంది.


Aravind


NewsSting Team
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle