newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

Telangana Weather: ఎండలు.. అకాల వర్షాలు.. తెలంగాణలో వింత వాతావరణం!

30-04-202130-04-2021 11:30:36 IST
2021-04-30T06:00:36.968Z30-04-2021 2021-04-30T05:28:00.119Z - - 14-05-2021

Telangana Weather: ఎండలు.. అకాల వర్షాలు.. తెలంగాణలో వింత వాతావరణం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

Telangana Weather: ఒకవైపు తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని పలుప్రాంతాలలో పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఎండలు మండిపోతున్నాయి. కానీ ఇదే సమయంలో పలుచోట్ల అకాల వర్షాలు కురుస్తున్నాయి. సహజంగానే ప్రతి ఏడాది వేసవి కాలం ముగిసి వర్షాకాలం మొదలయ్యే సమయంలో ఇలాంటి వాతావరణం నెలకొంటుంది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మండు వేసవిలో ఈ తరహా వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు ఎండలు దంచికొడుతూనే మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి.

గురువారం వాతావరణ పరిస్థితినే తీసుకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 37.6 డిగ్రీల నుంచి 43.9 డిగ్రీల వరకు నమో‌ద‌య్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. జగిత్యాల, మంచి‌ర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీ‌ల‌పైనే నమో‌దై‌నట్టు టీఎ‌స్‌‌డీ‌పీ‌ఎస్‌ పేర్కొంది. 43 డిగ్రీల ఉష్ణోగ్రతనుంటే సామాన్యమైన విషయమేమీ కాదు. అదే సమయంలో గాలిలో తేమ శాతం కూడా తగ్గు‌తుంది. ఆది‌లా‌బాద్‌, నిజా‌మా‌బా‌ద్‌లో గాలిలో తేమ 16 శాతం చొప్పున, జగి‌త్యా‌లలో 17 శాతం నమో‌దైంది.

ఇక ఇదే సమయంలో గడి‌చిన 24 గంటల్లో నాగ‌ర్‌‌క‌ర్నూల్‌ జిల్లా తిమ్మా‌జి‌పే‌టలో 20.3 మిల్లీ‌మీ‌టర్ల వర్షం కురి‌సింది. రాష్ట్రంలో పలుచోట్ల చిరు జల్లులు కూడా కురిశాయి. దీనికి కారణం బుధవారం ఏర్పడిన ఉత్తర దక్షిణ ఉపరితల ఆవర్తనంగా వాతావరణ నిపుణులు చెప్తున్నారు. గురువారం పశ్చిమ విదర్భ నుంచి ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా తమిళనాడు దాకా కొనసాగుతున్న ఆవర్తనంతో శుక్ర, శని‌వా‌రాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరు‌పులు, వడ‌గం‌డ్లతో కూడిన ఓ మోస్తరు వర్షం, గంటకు 30 నుంచి 40 కిలో‌మీ‌టర్ల వేగంతో ఈదు‌రు‌గా‌లులకు అవ‌కాశం ఉందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle