newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

తాలిబన్ల అరాచకం.. శవాన్ని క్రేన్ కి వేలాడదీసి ప్రదర్శన

27-09-202127-09-2021 09:35:56 IST
Updated On 27-09-2021 09:40:47 ISTUpdated On 27-09-20212021-09-27T04:05:56.923Z27-09-2021 2021-09-27T04:05:45.090Z - 2021-09-27T04:10:47.693Z - 27-09-2021

తాలిబన్ల అరాచకం.. శవాన్ని క్రేన్ కి వేలాడదీసి ప్రదర్శన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అఫ్గనిస్తాన్‌ లో తాలిబన్లు చేసే రాక్షస పాలనలో చేస్తున్న అరాచకాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హెరాత్ నగరంలోని ప్రధాన కూడలిలో క్రేన్‌కు ఒక మృతదేహాన్ని వేలాడదీసి బహిరంగంగా ప్రదర్శించారు. అక్కడి పౌరుడు ఇచ్చిన సమాచారం ప్రకారం తాలిబన్లు నాలుగు మృతదేహాలను ప్రధాన కూడలికి తీసుకువచ్చి ఒక మృతదేహాన్ని వేలాడిదీసారని, మిగిలిన మూడు మృతదేహాలను మరో కూడళ్లలో ఈ రకంగానే వేలాడ దీసేందుకు తీసుకెళ్లారని తెలిపాడు.

అయితే ఆ నలుగురు కిడ్నాప్‌ యత్నించడంతో పోలీసుల చేతిలో హతమయ్యారని తాలిబాన్లు ఆ కూడలి వద్ద ప్రకటించారని చెప్పాడు. ఆగష్టు 15 న తాలిబాన్లు ఆప్గన్‌ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడి ప్రజలు చీకటి పాలన మళ్లీ మొదలుకానుందని భయభ్రాంతులకు గురవుతున్నారు.  ఇప్పటికే మహిళలని ఇంటికే పరిమితం చేయడం, జర్నలిస్టులకి సైతం ఆంక్షలు విధించడం, విదేశీయ సైనుకులకి సహకరించిన వారి వివరాలని సేకరించి వారిని హతం చేసేందుకు సిద్దం కావడం లాంటి తాలిబాన్ల నిర్ణయాల తో అంతర్జాతీయంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్న ఈ తరుణంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ముందు ముందు వారి పాలన ఇంకెంత రాక్షసంగా ఉండబోతుందో అర్ధమవుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. 

 

వరద బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశం

వరద బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశం

   30-11-2021


తెలంగాణలో కరోనాతో ఒకరు మృతి, కొత్తగా160 కేసులు

తెలంగాణలో కరోనాతో ఒకరు మృతి, కొత్తగా160 కేసులు

   27-11-2021


ఆంధ్ర ప్రదేశ్ నర్సరీ నుండి కోట్లు పెట్టి 200 ఏళ్ల నాటి ఆలివ్ చెట్లను కొన్న అంబానీ

ఆంధ్ర ప్రదేశ్ నర్సరీ నుండి కోట్లు పెట్టి 200 ఏళ్ల నాటి ఆలివ్ చెట్లను కొన్న అంబానీ

   27-11-2021


దక్షిణ కోస్తాకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

దక్షిణ కోస్తాకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

   26-11-2021


15 ఏళ్ల కూతురిపై కన్నేసిన కన్నతండ్రి..  బెదిరించి పలుమార్లు..

15 ఏళ్ల కూతురిపై కన్నేసిన కన్నతండ్రి.. బెదిరించి పలుమార్లు..

   25-11-2021


బెంగళూరు, చెన్నై పరిసర ప్రాంతాలు వర్షం కారణంగా జలమయం

బెంగళూరు, చెన్నై పరిసర ప్రాంతాలు వర్షం కారణంగా జలమయం

   22-11-2021


అమెరికాలో క్రిస్మస్ పరేడ్‌లో జనం మీదకు దూసుకొచ్చిన కారు..

అమెరికాలో క్రిస్మస్ పరేడ్‌లో జనం మీదకు దూసుకొచ్చిన కారు..

   22-11-2021


అనంతపురంలో భారీ వర్షాల కారణంగా భవనం కూలి 4 మంది మృతి

అనంతపురంలో భారీ వర్షాల కారణంగా భవనం కూలి 4 మంది మృతి

   20-11-2021


నెల్లూరులో అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన వరద

నెల్లూరులో అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన వరద

   20-11-2021


బీహార్ కోర్టులో న్యాయమూర్తిపై ఇద్దరు పోలీసులు తుపాకీతో దాడి..

బీహార్ కోర్టులో న్యాయమూర్తిపై ఇద్దరు పోలీసులు తుపాకీతో దాడి..

   19-11-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle