newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

సగం డైరీ వ్యవస్థాపకుడు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి

14-05-202214-05-2022 17:04:42 IST
Updated On 14-05-2022 17:20:00 ISTUpdated On 14-05-20222022-05-14T11:34:42.608Z14-05-2022 2022-05-14T11:34:40.223Z - 2022-05-14T11:50:00.026Z - 14-05-2022

  సగం డైరీ వ్యవస్థాపకుడు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గుంటూరు జిల్లా పొన్నూరు తాలూక చింతలపూడి గ్రామంలో రైతు కుటుంబంలో వీరయ్య చౌదరి జన్మించారు. వీరి తల్లిదండ్రులు రత్తయ్య ,తులసమ్మ. చిన్నతనం నుంచే నీరు పేదల కోసం పాటుపడే స్వభావం కలిగి ఉండటంతో పాటుగా నిరంతరం ప్రజా సేవలో తరించాలని భావించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1968 లో చింతలపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వీరయ్య చౌదరి రాజకీయాల్లో వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది సర్పంచ్ గా 1981 వరకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.చింతలపూడి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దారు. 

 

 

 

ఏ ఆధారం లేకపోయిన పాడి మీద బ్రతకవచ్చు అని భావించి గుంటూరు జిల్లా గ్రామీణ ప్రాంతంలో రైతాంగానికి ఆసరాగా నిలిచేందుకు క్షీర విప్లవంలో భాగస్వామ్యం కావాలని భావించారు.గుంటూరు జిల్లా రైతుల కల్పవృక్షం గా భావించే సంగం సహకార పాల డైరీని స్థాపించేందుకు ఆయన చేసిన కృషి రాష్ట్ర పాడి పరిశ్రమ రంగ చరిత్రలో మరువలేనిది. ప్రైవేట్ దళారులు చేతిలో మోసపోతున్న జిల్లా గ్రామీణ పాడి రైతాంగాన్ని సంగం డెయిరీ ద్వారా ఆదుకొని వారికి అండగా నిలిచారు. 

 

 

1977లో తెనాలి సమీపంలో వెలిసిన సంగం జాగర్లమూడి గ్రామంలో స్వయంభూసిన సంగమేశ్వర స్వామి పేరు మీద సంగం సహకార పాల డైరీ. ప్రారంభోత్సవానికి నాటి కేంద్ర మంత్రి రఘురామయ్య గారితో పాటుగా దేశ క్షీర విప్లవ పితామహుడు కురియన్ గారు స్వయంగా సంగం జాగర్లమూడి గ్రామానికి రావడం జాతీయ స్థాయిలో సంగం డైరీ పేరు మారుమోగింది. 1977-79 వరకు సంగం పాల డైరీ కార్యవర్గ సభ్యులుగా వ్యవహరించిన వీరయ్య చౌదరి గారు అప్పటి డైరీ ఛైర్మన్ యడ్లపాటి వెంకట్రావు మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో వారి వారసుడిగా ప్రజల ఆమోదంతో 1979లో సంగం డైరీ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్య బాధ్యతలు చేపట్టారు.  

 

 

మనిషి పుట్టిన తర్వాత తొలి ఆహారం పాలు. అటువంటి పాలు లభ్యత నాడు తక్కువగా ఉండటం ద్వారా గ్రహించిన వీరయ్య చౌదరి సంగం డైరీ ఛైర్మన్ గా బాధ్యత స్వీకరించిన వెంటనే పాల ఉత్పత్తిని పెంచేందుకు ,పాల సేకరణ ,పాల శుద్ధి , విక్రయాల అభివృద్ధికి కృషి చేయడం. వారి తీసుకున్న చర్యల ద్వారా గుంటూరు జిల్లా వ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచి సైతం విజయవంతంగా పాల సేకరణ జరిగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాడి పరిశ్రమలో ప్రైవేట్ దళారుల హావా కు అడ్డుకట్ట వేసిన ఘనత కూడా సంగం డెయిరీ కి దక్కడంలో వీరయ్య ఆవిరాళమైన కృషి మరువలేనిది. తన పాలన దక్షతలతో జాతీయ స్థాయిలో పాల విప్లవ పితామహుడు కురియన్ గారిని సైతం మెప్పించిన వ్యక్తి వీరు. 

 

 

 

 

సంగం పాల డైరీని గుంటూరు జిల్లాకు తలమానికంగా నిలబెట్టడంలో వీరయ్య చౌదరి పాత్ర మరువలేనిది. 1979- 1985 వరకు మరియు 1992 - 1994 వరకు డైరీ ఛైర్మన్‌గా పని చేసిన వీరు ఆ సంస్థకి సుదీర్ఘ కాలం ఏకగ్రీవ ఛైర్మన్‌గా ఎన్నికైన వ్యక్తి కూడా ఆయనే.తన దీక్ష దక్షతలతో డైరీని లాభాల బాటలో పయనించడమే కాకుండా జాతీయ స్థాయిలో డైరీకి మంచి గుర్తింపు తెచ్చారు. పాడి పరిశ్రమ ద్వారా గుంటూరు జిల్లా గ్రామీణ రైతాంగం ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించడానికి ఏంతో కృషి చేశారు.సంగం డైరీ గ్రామీణ ప్రాంతాల రైతులకు చేరువయ్యేలా అనేక చర్యలు చేపట్టారు.అందుకే ఆయన్ని " పాల వీరయ్య"గా గుంటూరు జిల్లా గ్రామీణ రైతాంగం పిలుచుకునేది. 

 

 

సంగం డెయిరీ లో వీరయ్య చౌదరి నిర్వహించిన కార్యక్రమాలు గురించి విన్న నందమూరి తారక రామారావు తాను స్థాపించిన తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి గుంటూరు జిల్లాలో పార్టీకి బలమైన పూనాదులు ఏర్పడటంలో కీలకంగా వ్యవహరించారు.ఎన్టీఆర్ కు అత్యంత ఆత్మీయుల్లో ఒకరిగా ఉంటూ గుంటూరు జిల్లాలో పార్టీని బలోపేతానికి తీవ్రంగా కృషి చేశారు. పార్టీ ఘనంగా నిర్వహించుకునే మహానాడులో తొలి సారిగా భారీ ఎత్తున ఎద్దుల పోటీలు నిర్వహించిన ఘనత సైతం వీరికే దక్కుతుంది. 

 

 

ఎన్టీఆర్ కు వీరయ్య చౌదరి అంటే ఏంతో అభిమానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సహకార పాడి పరిశ్రమ వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు ఎన్టీఆర్ ను ఒప్పించి మరి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య సంస్థ కు వీరయ్య చౌదరి గారినే వ్యవస్థాపక అధ్యక్షుడు గా నియమించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ది సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు గా బాధ్యతలు స్వీకరించిన వీరయ్య చౌదరి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార పాల డైరీల బలోపేతానికి మరియు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది పాడి రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వీరి హయాంలో తీసుకున్న అనేక నిర్ణయాలు తర్వాత కాలంలో ఆ సంస్థ బలోపేతం కావడానికి దోహదపడింది. 

 

 

 

1983, 1985లలో పొన్నూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే గా వీరయ్య  పొన్నూరు, తెనాలి, బాపట్ల ప్రాంతాల అభివృద్ధి కి కీలకంగా కృషి చేశారు. రైతులకు సకాలంలో పంట రుణాలను మంజూరు చేయించడంతో పాటుగా, పంట కాల్వల అభివృద్ధి వంటి పలు కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. 1989లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గుంటూరు జిల్లాకు వచ్చిన ఆయనకు స్వచ్ఛందంగా జిల్లా ప్రజలు నిర్వహించిన బ్రహ్మాండమైన సన్మాన సభ గురించి ఇప్పటికి మాట్లాడుకుంటారు. 

 

 

 

రాజకీయాల్లో వీరయ్య చౌదరి గారిది అరుదైన వ్యక్తిత్వం ,రాజకీయ ఉద్ధండుల పురిటి గడ్డ గుంటూరు జిల్లాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజానీకంలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఏర్పరచుకొని రాజకీయాల్లో అజాత శత్రువుగా నిలిచారు. అసెంబ్లీలో రాష్ట్ర రైతాంగ సమస్యల పరిష్కారం కోసం తన గళాన్ని విప్పేవారు. అవినీతి , బంధుప్రీతి , పదవుల కోసం వెంపర్లాడటం వంటి వాటికి చివరి వరకు ఆమడ దూరంగా నిలుస్తూ వచ్చారు. 

 

 

 

వీరయ్య చౌదరి ఆది నుండి గ్రామీణ ప్రాంతాల రైతాంగ సంక్షేమం, సహకార వ్యవస్థల బలోపేతమే లక్ష్యంగా చివరి వరకు చేసిన నిర్విరామంగా కృషి చేయడం జరిగింది. ఆయన కృషికి కీలక సాక్ష్యం నేటి సంగం పాల డైరీ .సహకార రంగంలో వీరి కృషిని గుర్తిస్తూ స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ బాసెల్ ఆచార్యుడు డాక్టర్ నికోలాయ్ కామినోవ్ గారు తన అంతర్జాతీయ సహకార రంగ పరిశోధనాత్మక పత్రికల్లో పేర్కొన్నారు. 

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వీరయ్య చౌదరి  1994 జనవరి 24వ తేదీన గుంటూరు జిల్లా నారా కోడూరు లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరణించి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా  గ్రామీణాభివృద్ధికి , సహకార పాడి పరిశ్రమ రంగానికి చేసిన ఆయన చేసిన కృషిని గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు.


Aravind


NewsSting Team
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle