newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడి ఆచూకీ చెబితే పది లక్షల నజరానా..

14-09-202114-09-2021 21:52:34 IST
2021-09-14T16:22:34.048Z14-09-2021 2021-09-14T16:22:23.922Z - - 22-09-2021

చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడి ఆచూకీ చెబితే పది లక్షల నజరానా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సైదాబాద్‌ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో ఎంతవరకూ నిందితుడిని పట్టుకోక పోవడంతో హైదరాబాద్ పోలీసుల పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభం శుభం తెలియని ఆరేళ్ళ పసిపాప పై అఘాయిత్యం చేసిన మానవ మృగాన్ని ఈ ఘటన జరిగి ఆరు రోజులు గడిచినా ఇంకా నిందితుడిని ఎందుకు పట్టుకోలేదని పోలీసులపై ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌  కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రివార్డు అందిస్తామని ఆయన ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపను రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితుడి కోసం రాష్ట్ర పోలీసు యంత్రాంగం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో నిందితుడి ఆనవాళ్లను సైతం పోలీసులు విడుదల చేశారు. నిందితుడి ఎత్తు సుమారు 5.9 అడుగులు ఉంటుందని, పెద్ద జుట్టుకు రబ్బర్‌ బ్యాండ్‌ వేసుకొని తిరుగుతాడని తెలిపారు. నిందితుడి వయసు సుమారు 30 ఏళ్లు ఉంటుందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే అతని రెండు చేతులపై మౌనిక అనే టాటూ కూడా ఉంటుందని తెలిపారు. రాజు ఆచూకీ తెలిస్తే 9490616366, 9490616627 నెంబర్లకు కాల్‌ చేయాలని పోలీసులు సూచించారు. 

మరోవైపు చిన్నారి కుటుంబ సభ్యులను సినీ నటుడు మంచు మనోజ్ పరామర్శించారు. వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. ఆరేళ్ల బాలికపై ఇలాంటి దారుణానికి పాల్పడడం క్రూరమైన చర్య అని, సభ్య సమాజంలో బతుకుతున్న మనమంతా బాధ్యతాయుతంగా నడుచుకోవాలన్నారు. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు గురువులు నేర్పించాలని చెప్పారు. ఇక దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ ఈ నిందితుడిని శిక్షించాలంటే మరో సారి సజ్జన్నార్ సార హైదరాబాద్ పోలీస్ కమీషనర్ గా రావాలని అన్నారు.

ఆఫ్గనిస్తాన్ లో ఏమి జరుగుతుంది..? అఖుండ్‌జాదా బ్రతికే ఉన్నాడా..?

ఆఫ్గనిస్తాన్ లో ఏమి జరుగుతుంది..? అఖుండ్‌జాదా బ్రతికే ఉన్నాడా..?

   12 hours ago


అత్యున్నత మత సంస్థ అధిపతి నరేంద్ర గిరి ఆత్మహత్య

అత్యున్నత మత సంస్థ అధిపతి నరేంద్ర గిరి ఆత్మహత్య

   21-09-2021


ఇమ్మ్యూనిటిని పెంచే కొబ్బరి పాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

ఇమ్మ్యూనిటిని పెంచే కొబ్బరి పాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

   20-09-2021


హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు..

హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు..

   18-09-2021


సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

   17-09-2021


సైదాబాద్‌ చిన్నారి హత్య కేసు నిందితుడు రాజు ఆత్మహత్య

సైదాబాద్‌ చిన్నారి హత్య కేసు నిందితుడు రాజు ఆత్మహత్య

   16-09-2021


ఆ మానవ మృగం బయటెక్కడో ఉంది.. ఉండకూడదు

ఆ మానవ మృగం బయటెక్కడో ఉంది.. ఉండకూడదు

   16-09-2021


చిన్నారి కుటుంబసభ్యులను పరామర్శించిన పవన్ కల్యాణ్

చిన్నారి కుటుంబసభ్యులను పరామర్శించిన పవన్ కల్యాణ్

   15-09-2021


ముంబై బైకుల్లా జూ లో 2 పెంగ్విన్ పిల్లలు జన్మించారు

ముంబై బైకుల్లా జూ లో 2 పెంగ్విన్ పిల్లలు జన్మించారు

   15-09-2021


సుప్రీం కోర్టు మెట్లెక్కిన హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనోత్సవ వివాదం..

సుప్రీం కోర్టు మెట్లెక్కిన హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనోత్సవ వివాదం..

   14-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle