newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చంద్రుడిపై శృంగారం.. నాసా ట్రైనీకి జైలు

25-04-202125-04-2021 11:53:38 IST
Updated On 25-04-2021 09:38:50 ISTUpdated On 25-04-20212021-04-25T06:23:38.971Z25-04-2021 2021-04-25T04:05:25.638Z - 2021-04-25T04:08:50.676Z - 25-04-2021

చంద్రుడిపై శృంగారం.. నాసా ట్రైనీకి జైలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పిచ్చి బాబు పిచ్చి. పిచ్చి పీక్స్ అంటారు క‌దా. అంతకు మించి ఇంకేం ఉంటుంది చెప్పండి. అయినా చంద్రుడిపై  శృంగారం చేయ‌డం వీల‌య్యే ప‌నే కాదు. ఎందుకంటే ఇంకా అక్క‌డ అన్ని ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడిప్పుడే రావు కూడా. కానీ.. నాసా ట్రైనీకి మాత్రం ఆ పాడు ఆలోచ‌న‌... పాడు ఆలోచ‌న ఏముందిలే క్రేజీ ఆలోచ‌న మైండ్ నుంచి బ‌య‌టికి రావ‌డం లేదు. త‌ను కూడా చంద్రుడిపైకి  వెళ్లాల్సిన మ‌నిషే. నాసా నుంచి చంద్రుడిపైకి పంపిద్దాం అనుకుంటున్న వారిలో.. థాడ్ ఆ వ్యోమ‌గామి పేరు కూడా ఫైన‌ల్ లిస్ట్ లో ఉంది. ట్రైనింగ్ లు గ‌ట్రా ఇస్తున్నార‌ట‌. ఎలాగైనా చంద్రుడిపైకి వెళ్లాలి.. అక్క‌డ రొమాన్స్ చేసుకోవాలి. నా గ‌ర్ల్ ఫ్రెండ్ తో శృంగారంలో పాల్గొనాలి అంటూ.. ఇలా చాలా కోరిక‌లు ఉన్న‌యంట‌. 

వాటిని తీర్చుకోవ‌డం వీలు కాదు అనుకున్న వ్యోమ‌గామి థాడ్.. ఓ తుంట‌రి ఐడియా వేశాడు. చంద్రుడిపై నుంచి రాళ్లు ర‌ప్ప‌లు.. అవీ ఇవీ సేక‌రిస్తుంటారు క‌దా. వాటిని దొంగ త‌నం చేశాడ‌ట‌. అర్జంట్ గా త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ ని బెడ్ రూమ్ కి పిలిపించుకుని.. ఆ రాళ్ల‌ని బెడ్ పై వేసుకుని.. చంద్రుడి మీద ఉన్న రాళ్ల మ‌ధ్య‌లో ఇద్ద‌రూ ఎంజాయ్ చేశార‌ట‌. ఇక అయిపోయింది. చంద్రుడిపై రాళ్లు బెడ్ పై ఉన్న‌యంటే మ‌నం చంద్రుడిపై ఉన్న‌ట్లు.. వీటి మ‌ధ్య‌లో శృంగారం చేసినం అంటే.. చంద్రుడిపై శృంగారం చేసిన‌ట్లే అనుకున్నాడు. ఇదేదో బ‌తికున్న కోడినే తాడుకి వేలాడ గ‌ట్టి.. చూస్తూ ఒట్టి అన్నం తింటూ.. చికెన్ తిన్న‌ట్లే ఫీల్ అయిన‌ట్లు ఉంది క‌దా. అవును.. అలాంటిదే. పోనీలో అదో తుత్తి అనుకుందాం. 

అయితే.. ఆ వ్యోమ‌గామి అంత‌టితో ఆగ‌లేదు. శృంగారం కోసం తెచ్చిన రాళ్ల‌ని త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ కి బంగారం కొనిచ్చేందుకు వాడాలి అనుకున్నాడ‌ట‌. అంతే.. ఆ రాళ్ల‌ని ఇంట‌ర్నేష‌న‌ల్ గా సీక్రెట్ బేరం పెట్టాడ‌ట‌. మ‌రి నాసా వాళ్లు చంద్రుడిపై నుంచి తెచ్చిన రాళ్ల‌కి క్రేజ్ ఉంటుంది క‌దా. అందులో ఏం బంగారం ఉందో అని కొనాలి అనుకుంటారు క‌దా. అలా ఈ వ్యోమ‌గామి బేరం పెడితే.. కొంటా అన్న వాళ్లు.. నాసా వాళ్ల‌కి ఎఫ్ బీ ఐ వాళ్ల‌కి కంప్లైంట్ ఇచ్చార‌ట‌.  అంతే.. అంతా అడ్డం తిరిగింది ఎవ్వారం. ఇప్పుడు చంద్రుడిపై శృంగారం కాదు.. అస‌లు శృంగారం గ‌తిలేకుండా.. త‌న బంగారానికి బంగారం కొనే  ప‌రిస్థితి లేకుండా.. జైల్లో ప‌డ్డాడ‌ట అయ్య‌వారు. అందుకే అంటారు.. దురాశ దుఃఖానికి చేటు అని.. అయినా తెలుగు సామెత ఆయ‌న‌కి ఎలా తెలుస్తుందిలే. ట్రాన్స్ లేట్ అయిందో లేదో మ‌రి.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle