newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం.. తాలిబన్లకి షాకిచ్చిన అమృల్లా సలేహ్

30-09-202130-09-2021 10:31:06 IST
Updated On 30-09-2021 10:35:06 ISTUpdated On 30-09-20212021-09-30T05:01:06.266Z30-09-2021 2021-09-30T05:01:00.688Z - 2021-09-30T05:05:06.247Z - 30-09-2021

ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం.. తాలిబన్లకి షాకిచ్చిన అమృల్లా సలేహ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆఫ్ఘనిస్తాన్ గత ప్రభుత్వం లో ఉపాధ్యక్షుడిగా ఉన్న అమృల్లా సలేహ్ ప్రస్తుతం ఆప్గాన్ లో కొలువుదీరిన తాలిబన్లకి గట్టి షాక్ ఇచ్చారు.

ఆఫ్గన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కొనసాగించబోతున్నట్లు ఆష్రఫ్ ఘనీ సారథ్యంలోని ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న అమృల్లా సలేహ్ నాయకత్వంలో ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించబోతున్నట్లు గత ప్రభుత్వానికి చెందిన అధికారులు,నేతలు ప్రకటించారు. ప్రవాసం నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని ఆఫ్గనిస్తాన్ ఎంబసీ నుంచి ప్రకటన విడుదలైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌ను బయటి శక్తులు ఆక్రమించారని పేర్కొన్నారు. ఆఫ్గన్ పెద్దలతో సంప్రదింపుల తర్వాత ప్రవాసం నుంచే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు వారు ప్రకటించారు. 

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్గనిస్తాన్‌కు మాత్రమే దేశాన్ని పాలించే చట్టబద్దత ఉన్నదని, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ఇతర ప్రభుత్వాలేవీ భర్తీ చేయలేవని వారు విడుదల చేసిన ఒక లేఖలో తెలిపారు. గత ప్రభుత్వానికి చెందిన అధికారులు,నేతలు కలిసి ఈ లేఖను విడుదల చేసినట్లు చెబుతున్నారు.అయితే ఈ లేఖలో మాత్రం ఎవరి పేర్లు వెల్లడించలేదు. గత ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ఆఫ్గనిస్తాన్‌లో మున్ముందు పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న చర్చ జరుగుతోంది.

అయితే తాలిబన్ల ని తోసిరాజని కొత్తగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని ఇప్పటికే ఆప్గాన్ ని తన వశం చేసుకుని పరిపాలన సాగిస్తున్న టాలిబన్లకి ఎదుర్కొని ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి వారికి లేదని అంతర్జాతీయ మీడియా అంటోంది. అయితే వీరికి ఏదైన పెద్ద దేశం మద్దతు పలికితే సాధ్య అవకాశం ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ అంశం తో మరొక్కసారి ఆప్గాన్ అంతర్జాతీయంగా వార్తలలో నిలిచింది.

విజయదశమి శుభాకాంక్షలు..

విజయదశమి శుభాకాంక్షలు..

   15-10-2021


ఉల్లాసంగా.. ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు

ఉల్లాసంగా.. ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు

   13-10-2021


బెజవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన వైఎస్ జగన్

బెజవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన వైఎస్ జగన్

   12-10-2021


పిల్లలకు వ్యాక్సిన్ వచ్చేసింది.. ట్రయల్స్‌ విజయవంతం

పిల్లలకు వ్యాక్సిన్ వచ్చేసింది.. ట్రయల్స్‌ విజయవంతం

   12-10-2021


తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

   12-10-2021


యుఎస్ లో ఇళ్ల మీద విమానం కూలి ఇద్దరు దుర్మరణం

యుఎస్ లో ఇళ్ల మీద విమానం కూలి ఇద్దరు దుర్మరణం

   12-10-2021


అమ్మవారి అలంకరణకు ఐదు కోట్ల రూపాయల కొత్త కరెన్సీ నోట్లు, ఏడు కోట్ల విలువ చేసే బంగారు, వెండి బిస్కట్లు

అమ్మవారి అలంకరణకు ఐదు కోట్ల రూపాయల కొత్త కరెన్సీ నోట్లు, ఏడు కోట్ల విలువ చేసే బంగారు, వెండి బిస్కట్లు

   11-10-2021


రామానుజ సహస్రాబ్ది ఉత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్

రామానుజ సహస్రాబ్ది ఉత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్

   11-10-2021


హైదరాబాద్ భారీ వర్షం.. రెస్టారెంట్ లోకి వరద నీరు

హైదరాబాద్ భారీ వర్షం.. రెస్టారెంట్ లోకి వరద నీరు

   09-10-2021


షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కి బెయిల్ ఇస్తారా.. ఇవ్వరా?

షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కి బెయిల్ ఇస్తారా.. ఇవ్వరా?

   07-10-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle