newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

తెలంగాణలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌

27-09-202127-09-2021 09:52:32 IST
2021-09-27T04:22:32.728Z27-09-2021 2021-09-27T04:22:19.989Z - - 05-12-2021

తెలంగాణలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను ప్రభావంతో పాటు, ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వరుసగా రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రం లోని అదిలాబాద్, మంచిర్యాల, కుమ్రుంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా రెండురోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని జోనల్‌ కమిషనర్లందరికీ సూచించింది. 

ఇక పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, కామారెడ్డి తదితర జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా ప్రజలు అత్యవసర పరిస్తితిలోనే తప్ప ఇళ్ళల్లో నుండి బయటికి రాకూడదని, విద్యుత్తు స్తంభాలకి దూరంగా ఉండాలని, వాగులు ప్రవహించే ప్రాంతాలకి దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపధ్యంలో మళ్ళీ కురిసే వర్షాలకి ప్రమాద స్థాయిలలో ప్రవాహాలు పొంగి పొరలే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

వరద బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశం

వరద బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశం

   30-11-2021


తెలంగాణలో కరోనాతో ఒకరు మృతి, కొత్తగా160 కేసులు

తెలంగాణలో కరోనాతో ఒకరు మృతి, కొత్తగా160 కేసులు

   27-11-2021


ఆంధ్ర ప్రదేశ్ నర్సరీ నుండి కోట్లు పెట్టి 200 ఏళ్ల నాటి ఆలివ్ చెట్లను కొన్న అంబానీ

ఆంధ్ర ప్రదేశ్ నర్సరీ నుండి కోట్లు పెట్టి 200 ఏళ్ల నాటి ఆలివ్ చెట్లను కొన్న అంబానీ

   27-11-2021


దక్షిణ కోస్తాకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

దక్షిణ కోస్తాకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

   26-11-2021


15 ఏళ్ల కూతురిపై కన్నేసిన కన్నతండ్రి..  బెదిరించి పలుమార్లు..

15 ఏళ్ల కూతురిపై కన్నేసిన కన్నతండ్రి.. బెదిరించి పలుమార్లు..

   25-11-2021


బెంగళూరు, చెన్నై పరిసర ప్రాంతాలు వర్షం కారణంగా జలమయం

బెంగళూరు, చెన్నై పరిసర ప్రాంతాలు వర్షం కారణంగా జలమయం

   22-11-2021


అమెరికాలో క్రిస్మస్ పరేడ్‌లో జనం మీదకు దూసుకొచ్చిన కారు..

అమెరికాలో క్రిస్మస్ పరేడ్‌లో జనం మీదకు దూసుకొచ్చిన కారు..

   22-11-2021


అనంతపురంలో భారీ వర్షాల కారణంగా భవనం కూలి 4 మంది మృతి

అనంతపురంలో భారీ వర్షాల కారణంగా భవనం కూలి 4 మంది మృతి

   20-11-2021


నెల్లూరులో అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన వరద

నెల్లూరులో అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన వరద

   20-11-2021


బీహార్ కోర్టులో న్యాయమూర్తిపై ఇద్దరు పోలీసులు తుపాకీతో దాడి..

బీహార్ కోర్టులో న్యాయమూర్తిపై ఇద్దరు పోలీసులు తుపాకీతో దాడి..

   19-11-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle