రాయవరం మునుసుబు వుండవిల్లి సత్యనారాయణ మూర్తి
14-05-202214-05-2022 21:14:39 IST
2022-05-14T15:44:39.510Z14-05-2022 2022-05-14T15:44:36.496Z - - 27-05-2022

పదవుల నలంకరించి పెద్దలవుతారు కొందరు , పెద్దవారిని ఆశ్రయించి పేరులో కొస్తారు కొందరు , చెక్కభజనలు చేసి చవకబారు పేరు తెచ్చుకొంటారు మరికొందరు, ప్రజా నాయకులుగా ప్రజలను దిగ మ్రింగుతారు ఎందరో సామాన్య ప్రజల శ్రేయస్సే తమ శ్రేయస్సుగా భావించి , అహోరాత్రులు వారికై శ్రమచేసి , ప్రజల్లో శాశ్వత ముద్ర వేసుకుంటారు కొద్దిమంది అటువంటి వారిలో ముఖ్యులు రాయవరం మునుసుబు గా ప్రసిద్ధులైన వుండవిల్లి సత్యనారాయణ మూర్తి.
వుండవిల్లి సత్యనారాయణ మూర్తి ఒకప్పటి ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని ఉమ్మడి గోదావరి జిల్లా లోని రామచంద్రపురం తాలూకా రాయవరం గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు.చిన్నతనంలోనే తన తల్లి తండ్రి గారైన వుండవిల్లి రామయ్య , చెల్లాయమ్మ దంపతులకు దత్తతగా వెళ్లడంతో వీరిని రాయవరం దత్తుడు, రాజ అని కూడా ఆ ప్రాంత ప్రజానీకం పిలుచుకుంటుంది.
చిన్నతనం నుంచే దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీ మరియు ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని మునుసుబు ఏంతో అభిమానించే వారు, ఆ అభిమానంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరి తన చివర శ్వాస విడిచిపెట్టె వరకు మార్గ మధ్యలో ఎన్ని ప్రలోభాలు ఎదురైనా ఆ పార్టీతోనే కొనసాగారు.తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా ఎదుగుతూ కాంగ్రెస్ తరపున ఉమ్మడి గోదావరి జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అడ్డుపెట్టారు.
రాష్ట్ర రాజకీయాల్లో అనతి కాలంలోనే తన కార్యశీలత , అంకుటిత దీక్ష , పట్టుదల , క్రమశిక్షణలతో జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఏదిగారు. గోదావరి జిల్లాల్లో ఉన్న జమీందారి వర్గాలకు, ఇతర రాజకీయ కుటుంబాలకు సైతం దక్కని అశేష ప్రజాభిమానం వీరి సొంతం. 1967, 1971, 1978 లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోదావరి జిల్లాల నుండి అత్యధిక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నికవ్వడం లో కీలకమైన పాత్ర పోషించారు. ఒకప్పటి బలమైన ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి కి అత్యంత సన్నిహితులు మరియు ప్రియమైన వారు.
మునుసుబు సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారిని రాజకీయంగా ప్రోత్సహించడమే కాకుండా వారిని రాజకీయాల్లో పైకి తీసుకువచ్చారు. అటువంటి వారిలో ప్రముఖులు మాజీ మంత్రి సంగీత వెంకట రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి , రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి వారు ముఖ్యులు.ఈనాడు ఎమ్మెల్యే , మంత్రి పదవులు ఉంటేనే ప్రజలకు ఏదో చేయొచ్చు అనే అపోహలతో బ్రతుకుతున్న రాజకీయ నాయకులకు భిన్నంగా మునుసుబు గారి రాజకీయ ప్రయాణం సాగింది.
ఎటువంటి ఉన్నత పదవులు నిర్వహించకుండానే ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ, నిరుపేద, బడుగు బలహీన వర్గాలకు పక్కా గృహాల నిర్మాణం, వ్యవసాయం చేసుకునేందుకు బంజరు భూములు పంపిణీ మరియు సాంఘిక సంక్షేమ పథకాల ఫలాలు అందించడంతో పాటుగా విద్యాభివృద్ధికి కృషి చేశారు.రాజకీయాల్లో చివరి వరకు అవినీతికి, బంధుప్రీతికి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉంటూ వచ్చారు .

సగం డైరీ వ్యవస్థాపకుడు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి
14-05-2022

ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో మార్పులు
12-05-2022

తెలంగాణలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు
12-05-2022

AP PGECET 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది
11-05-2022

ఈరోజు బంగారం, వెండి ధరలు
11-05-2022

మార్కెట్లో టాటా నెక్సాన్ EV మ్యాక్స్
11-05-2022

IIM-K : మహిళా పారిశ్రామికవేత్తల కోసం కొత్త కోర్సులు
11-05-2022

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ GDS రిక్రూట్మెంట్ 2022
10-05-2022

కర్ణాటక బ్యాంక్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2022
10-05-2022

పాలపుంత మధ్యలో బ్లాక్ హోల్...!
10-05-2022
ఇంకా