newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

చిన్నారి కుటుంబసభ్యులను పరామర్శించిన పవన్ కల్యాణ్

15-09-202115-09-2021 20:42:01 IST
2021-09-15T15:12:01.730Z15-09-2021 2021-09-15T15:11:57.988Z - - 22-09-2021

చిన్నారి కుటుంబసభ్యులను పరామర్శించిన పవన్ కల్యాణ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్‏ లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నప్పటికీ ఇంత వరకు నిందితుడిని అదుపులోకి తీసుకోకపోవడంతో హైదరాబాద్ పోలీసుల పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా ఈ ఘటనకు పాల్పిడిన నిందుతుడిని ఎన్‏ కౌంటర్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ వినిపిస్తుండడం, ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోలీసుల అసమర్ధతని ఎత్తి చూపుతూ పోస్ట్ లు పెడుతున్డడంతో అభం శుభం తెలియని చిన్నారిని అత్యంత దారుణంగా హతమార్చిన మానవ మృగం కోసం పోలీసులు వేట ప్రారంభించారు. అంతే కాదు అతడి ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. 

ఈ నేపధ్యంలో ఆ చిన్నారి కుటుంబాన్ని బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించి చిన్నారి కుటుంబ సభ్యులని ఓదార్చి తన ప్రగాఢ సానుభూతని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చిన్నారి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తంచేసినప్పుడే పోలీసులు స్పందించాల్సి ఉండేదని, పోలీసులు సకాలంలో చర్యలు తీసుకుంటే ఇంతటి దారుణం జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో పార్టీలకతీతంగా అందరూ ఈ ఘటనను ఖండించాలన్నారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి సహాయం అందించాలన్నారు. ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుందో వెంటనే ఆలోచించి అమలు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. దోషికి కఠిన శిక్ష పడే వరకూ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే మీడియా కూడా ఈ విషయాన్ని ఎక్కువ మందికి తెలిసేలా కృషి చేయాలని కోరారు. 

ఆఫ్గనిస్తాన్ లో ఏమి జరుగుతుంది..? అఖుండ్‌జాదా బ్రతికే ఉన్నాడా..?

ఆఫ్గనిస్తాన్ లో ఏమి జరుగుతుంది..? అఖుండ్‌జాదా బ్రతికే ఉన్నాడా..?

   11 hours ago


అత్యున్నత మత సంస్థ అధిపతి నరేంద్ర గిరి ఆత్మహత్య

అత్యున్నత మత సంస్థ అధిపతి నరేంద్ర గిరి ఆత్మహత్య

   21-09-2021


ఇమ్మ్యూనిటిని పెంచే కొబ్బరి పాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

ఇమ్మ్యూనిటిని పెంచే కొబ్బరి పాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

   20-09-2021


హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు..

హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు..

   18-09-2021


సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

   17-09-2021


సైదాబాద్‌ చిన్నారి హత్య కేసు నిందితుడు రాజు ఆత్మహత్య

సైదాబాద్‌ చిన్నారి హత్య కేసు నిందితుడు రాజు ఆత్మహత్య

   16-09-2021


ఆ మానవ మృగం బయటెక్కడో ఉంది.. ఉండకూడదు

ఆ మానవ మృగం బయటెక్కడో ఉంది.. ఉండకూడదు

   16-09-2021


ముంబై బైకుల్లా జూ లో 2 పెంగ్విన్ పిల్లలు జన్మించారు

ముంబై బైకుల్లా జూ లో 2 పెంగ్విన్ పిల్లలు జన్మించారు

   15-09-2021


చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడి ఆచూకీ చెబితే పది లక్షల నజరానా..

చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడి ఆచూకీ చెబితే పది లక్షల నజరానా..

   14-09-2021


సుప్రీం కోర్టు మెట్లెక్కిన హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనోత్సవ వివాదం..

సుప్రీం కోర్టు మెట్లెక్కిన హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనోత్సవ వివాదం..

   14-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle