newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

అంగారక గ్రహంపై భారీ ప్రకంపనలు.. స్పష్టం చేసిన నాసా..

25-09-202125-09-2021 20:04:23 IST
2021-09-25T14:34:23.077Z25-09-2021 2021-09-25T14:34:13.324Z - - 05-12-2021

అంగారక గ్రహంపై భారీ ప్రకంపనలు.. స్పష్టం చేసిన నాసా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అంతరిక్షం లోని అంగారక గ్రహంపై సుమారు 90 నిమిషాల పాటు భారీ ప్రకంపనలు సంభవించాయని నాసా వెల్లడించింది. ఈ నెల 18 న  నాసాకు చెందిన ఇన్‌సైట్‌ ల్యాండర్‌ అంగారక గ్రహంపై నమోదైన భారీ ప్రకంపనలను నాసా రికార్డు చేసింది. రిక్టర్‌ స్కేల్‌పై 4.2 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. అయితే నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ప్రకంపనలు సంభవించడం ఇది మూడోసారని నాసా తెలిపింది. 2019లో వచ్చిన 3.7 తీవ్రతతో పోలిస్తే.. తాజాగా కనిపించిన 4.2 తీవ్రత ప్రకంపనల ప్రభావం ఐదు రెట్లు అధికమని నాసా పేర్కొంది.

అయితే గత కొన్ని రోజులుగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా భూమికి అత్యంత సమీపంలోని అంగారక గ్రహం మానవులకు నివాసయోగ్యంగా ఉండవచ్చే అనే భావనతో నాసా ఇప్పటికే మార్క్‌పైకి క్యూరియాసిటీ, పర్సివరెన్స్‌ అనే రోవర్‌లను ప్రయోగించింది. ఈ రోవర్స్‌ సహాయంతో నాసా అనేక విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే అంగారక గ్రహంపై ఈ ప్రకంపనలని గుర్తించింది. ఇన్‌సైట్‌ ల్యాండర్‌ ఇప్పటివరకు అంగారకపై సుమారు 700 ప్రకంపనలను గుర్తించింది.  భూగ్రహంతో పోలిస్తే అంగారకపై ప్రకంపనలు ఎక్కువ సమయం పాటు రావడానికి కారణం అంగారక క్రస్ట్‌ అత్యంత పలుచగా ఉండడమే కారణమని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా ఇన్‌సైట్‌ ల్యాండర్‌ పగటి సమయంలో ప్రకంపనలను రికార్డు చేయడం ఇదే తొలిసారని నాసా స్పష్టం చేసింది. 

వరద బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశం

వరద బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశం

   30-11-2021

తెలంగాణలో కరోనాతో ఒకరు మృతి, కొత్తగా160 కేసులు

తెలంగాణలో కరోనాతో ఒకరు మృతి, కొత్తగా160 కేసులు

   27-11-2021

ఆంధ్ర ప్రదేశ్ నర్సరీ నుండి కోట్లు పెట్టి 200 ఏళ్ల నాటి ఆలివ్ చెట్లను కొన్న అంబానీ

ఆంధ్ర ప్రదేశ్ నర్సరీ నుండి కోట్లు పెట్టి 200 ఏళ్ల నాటి ఆలివ్ చెట్లను కొన్న అంబానీ

   27-11-2021

దక్షిణ కోస్తాకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

దక్షిణ కోస్తాకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

   26-11-2021

15 ఏళ్ల కూతురిపై కన్నేసిన కన్నతండ్రి..  బెదిరించి పలుమార్లు..

15 ఏళ్ల కూతురిపై కన్నేసిన కన్నతండ్రి.. బెదిరించి పలుమార్లు..

   25-11-2021

బెంగళూరు, చెన్నై పరిసర ప్రాంతాలు వర్షం కారణంగా జలమయం

బెంగళూరు, చెన్నై పరిసర ప్రాంతాలు వర్షం కారణంగా జలమయం

   22-11-2021

అమెరికాలో క్రిస్మస్ పరేడ్‌లో జనం మీదకు దూసుకొచ్చిన కారు..

అమెరికాలో క్రిస్మస్ పరేడ్‌లో జనం మీదకు దూసుకొచ్చిన కారు..

   22-11-2021

అనంతపురంలో భారీ వర్షాల కారణంగా భవనం కూలి 4 మంది మృతి

అనంతపురంలో భారీ వర్షాల కారణంగా భవనం కూలి 4 మంది మృతి

   20-11-2021

నెల్లూరులో అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన వరద

నెల్లూరులో అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన వరద

   20-11-2021

బీహార్ కోర్టులో న్యాయమూర్తిపై ఇద్దరు పోలీసులు తుపాకీతో దాడి..

బీహార్ కోర్టులో న్యాయమూర్తిపై ఇద్దరు పోలీసులు తుపాకీతో దాడి..

   19-11-2021

ఇంకా

Newssting

 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle