newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జాడ‌లేని 3 వేల మంది క‌రోనా పేషెంట్లు

29-04-202129-04-2021 10:34:25 IST
Updated On 29-04-2021 09:09:21 ISTUpdated On 29-04-20212021-04-29T05:04:25.619Z29-04-2021 2021-04-29T03:26:48.376Z - 2021-04-29T03:39:21.674Z - 29-04-2021

జాడ‌లేని 3 వేల మంది క‌రోనా పేషెంట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌రోనా కాలం ఏంటో కానీ.. జ‌నాలు ఎట్టెట్ట‌నో బిహేవ్ చేస్తున్నారు. ఎవ‌రికీ మైండ్ లో ఏ విష‌యం పైనా క్లారిటీ ఉండ‌డం లేదు. ఇక పేషంట్ల గురించి చెప్పేదేముంది చెప్పండి. రోజూ శ్మ‌శానాలు చూస్తున్నం క‌దా. పాడె ప‌క్క‌న పాడె పెట్టి.. స్పేస్ లేకుండా కాల్చేస్తున్నారు. ఇక క‌రోనా వ‌చ్చిందంటే ప్రాణం నేల‌పై ఆగుతుందా చెప్పండి. అర‌చేతిలో ప‌ట్టుకుని బ‌తుకుతారాయే. టెన్ష‌న్ తో వ‌ణికిపోతారాయే. తాము టెన్ష‌న్ ప‌డి డాక్ట‌ర్ల‌ని టెన్ష‌న్ పెడ‌తారు. ఇంట్లో వాళ్లు కూడా అదే పొజిష‌న్ లో ఉండిపోతారు.

అయితే.. క‌ర్ణాట‌క‌లో మాత్రం దీనికి వ్య‌తిరేకంగా జ‌రుగుతోంది. క‌ర్ణాట‌క‌లో క‌రోనా ఎవ్వారం ఎలా ఉందో తెలిసిందే క‌దా. సెకండ్ ఫేజ్ ని సీర‌యిస్ గా ఫేస్ చేస్తున్న స్టేట్ క‌ర్ణాట‌క స్టేటే క‌దా. అంద‌రి కంటే ముందే లాక్ డౌన్ పెట్టుకున్నారు. ఎన్నో ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. హాస్పిట‌ల్స్ తో పాటు.. ఇళ్ల‌ల్లో కూడా సీరియ‌స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ.. క‌ర్ణాట‌క క‌రోనా పేషెంట్లు మాత్రం రివ‌ర్స్ గా బిహేవ్ చేస్తున్నార‌ట. అస‌లు డాక్ట‌ర్ల‌కి ఫోన్లు కూడా చేయ‌డం లేదట‌. స‌రే వాళ్లు చేయ‌డం లేదు. వారి ఆరోగ్యం ఎలా ఉందో మ‌నం అయినా క‌నుక్కుందాం అంటే.. ఫోన్లు ఎత్త‌డం లేద‌ట‌. ఫోన్లు ఎత్త‌డ‌మే కాదు. అస‌లు రింగ్ కూడా కావ‌డం లేద‌ట‌. రింగ్ కాదు.. స్విచ్ ఆఫ్ చేసి పెడుతున్నార‌ట‌.

అర్రే.. క‌రోన వ‌స్తే టెన్ష‌న్ ప‌డాలి. డాక్ట‌ర్ల‌కి మాటి మాటికీ ఫోన్ చేయాలి. ఆరోగ్య ప‌రిస్థితి వివ‌రించి.. కొత్త ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకోవాలి. ఇంట్లోనే ఉండాలా.. హాస్పిట‌ల్ కి రావాలా అంటూ క్లారిటీస్ అడ‌గాలి. కానీ.. క‌ర్ణాట‌క‌లో మాత్రం 3 వేల మంది పేషెంట్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నార‌ట‌. అడ్ర‌స్ లు కూడా స‌రిగా ఇవ్వ‌కుండా వెళ్లిపోయార‌ట‌. పోనీ అడ్ర‌స్ లు ఇస్తే మాత్రం.. ఇప్పుడు వెతుక్కుని వెళ్లేంత టైం ఉంటుందా చెప్పండి.

ఆల్రెడీ క‌రోనా వ‌చ్చింది అని తెలిసిన పేషంట్ల‌ను ట్రేస్ చేయాలి అంటే ఎంత ప‌ని భారం. అయినా సరే.. క‌ర్ణాట‌క స‌ర్కార్ మాత్రం త‌గ్గేదే లేదు అంటోంది. అంద‌రినీ ట్రేస్ చేయండి అంటోంది. 3 వేల మంది జాడ క‌నుక్కోండి.. వారి ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉందో చెక్ చేయండి. హెల్త్ కండిష‌న్ బాగోకుంటే.. హాస్పిట‌ల్ కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయండి అంటూ.. అధికారులకు చెప్పింది క‌ర్ణాట‌క స‌ర్కార్.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle