ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని మంత్రి కేటిఆర్ కు యువ రైతు లేఖ
22-01-202222-01-2022 10:18:03 IST
Updated On 22-01-2022 13:35:32 ISTUpdated On 22-01-20222022-01-22T04:48:03.922Z22-01-2022 2022-01-22T04:48:00.653Z - 2022-01-22T08:05:32.719Z - 22-01-2022

తాను ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ ఒక యువ రైతు మంత్రి కేటిఆర్ కి లేఖ రాయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని ఎడవెల్లి గ్రామానికి చెందిన చొప్పరి శ్రీను అనే రైతు శుక్రవారం మంత్రి కేటీఆర్‌కు, జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశాడు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నానని, అయితే పల్లె ప్రకృతి వనానికి తన భూమి తీసుకున్నారని పేర్కొన్నాడు. గతంలో కొంత భూమిని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) కోసం సేకరించారని తెలిపాడు. ఇంజనీరింగ్ చదివిన తనకు ఎలాంటి ఉద్యోగమూ లేకపోవడం తో వ్యవసాయమే జీవనాధారంగా బతుకు సాగిస్తున్నట్లు శ్రీను లేఖలో వివరించాడు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్‌కు, ఎమ్మెల్యేకు, కనగల్ తహశీల్దార్‌కు మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తాను రోడ్డున పడ్డానని, జీవనం దుర్భరంగా మారిందని, అందువల్ల చావుకు అనుమతించాల ని కోరాడు. శ్రీను రాసిన ఈ లేఖపై మంత్రి ఎలా స్పందిస్తారో అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

రాయవరం మునుసుబు వుండవిల్లి సత్యనారాయణ మూర్తి
14-05-2022

సగం డైరీ వ్యవస్థాపకుడు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి
14-05-2022

ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో మార్పులు
12-05-2022

తెలంగాణలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు
12-05-2022

AP PGECET 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది
11-05-2022

ఈరోజు బంగారం, వెండి ధరలు
11-05-2022

మార్కెట్లో టాటా నెక్సాన్ EV మ్యాక్స్
11-05-2022

IIM-K : మహిళా పారిశ్రామికవేత్తల కోసం కొత్త కోర్సులు
11-05-2022

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ GDS రిక్రూట్మెంట్ 2022
10-05-2022

కర్ణాటక బ్యాంక్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2022
10-05-2022
ఇంకా