newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క‌రోనా వ‌చ్చాక‌.. ఏ స్థాయి ల‌క్ష‌ణాలు ఉంటే డేంజ‌ర్

26-04-202126-04-2021 10:39:00 IST
Updated On 26-04-2021 10:55:43 ISTUpdated On 26-04-20212021-04-26T05:09:00.838Z26-04-2021 2021-04-26T05:04:41.679Z - 2021-04-26T05:25:43.413Z - 26-04-2021

క‌రోనా వ‌చ్చాక‌.. ఏ స్థాయి ల‌క్ష‌ణాలు ఉంటే డేంజ‌ర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌రోనా వ‌చ్చింది అంటే చాలు.. ఒక్క సారి గుండె ఆగిపోతుంది. బ్రెయిన్ ప‌ని చేయ‌డం మానేస్తుంది. ఎమోష‌నల్ గా వీక్ అవుతాం. ఇవ‌న్నీ కామన్. అయితే.. క‌రోనా వ‌చ్చినంత మాత్రాన టెన్ష‌న్ ప‌డాల్సిన ప‌నిలేదు అంటున్నారు డాక్ట‌ర్లు. కాస్త కామ‌న్ విష‌యాల‌పై కాన్సంట్రేట్ చేయండి.. మ‌రీ టెన్ష‌న్ తీసుకోకుండా.. కేర్ తీసుకుంటే హాస్పిట‌ల్ కి వెళ్లాల్సిన ప‌ని లేకుండా న‌యం చేసుకోవ‌చ్చు అంటున్నారు.

1, టెస్ట్ లో చిన్న చిన్న‌ ల‌క్ష‌ణాలే అని తేలితే ఇంట్లోనే ఉండొచ్చు. ఎలాంటి ప్రాబ్ల‌మ్ ఉండ‌దు.

2, క‌రోనా ఉన్నా స‌రే.. చిన్న పాటి జ్వ‌ర‌మే అయితే.. పారా సిట‌మాల్ టాబ్లెట్స్ స‌రిపోత‌య్.

3, జ్వ‌రం, ఆక్సిజ‌న్ లెవల్స్ ని మాత్రం రోజూ చెక్ చేసుకోవాలి. ప‌ది ప‌దిహేను సార్లు చెక్ చేసుకోవాలి కాబ‌ట్టి.. దానికి కావాల్సిన ఎక్విప్ మెంట్ అరేంజ్ చేసుకోవాలి.

4, ఆక్సిజ‌న్ లెవ‌ల్ 94 నుంచి 100 మ‌ధ్య‌లో ఉంటే.. ఏ మాత్రం టెన్ష‌న్ ప‌డాల్సిన ప‌న్లేదు.

5, ఇంట్లో రెస్ట్ తీసుకునే టైంలో.. ఎక్కువ‌గా ద్ర‌వ ప‌దార్ధాలే తీసుకోవాలి.  జ్యూస్ లు గ‌ట్రా తాగితేనే మంచిది. ఏదైనా తిన్నా.. వెంట‌నే అరిగేది తిన‌డం బెట‌ర్.

6, రోజుకి 10 గ్లాసుల నీరు తీసుకోవ‌డం కంప‌ల్స‌రీ.

7, జ్వ‌రం ఐదు నుంచి ఆరు రోజులు, ఏడు రోజుల దాకా త‌గ్గకుంటే మాత్రమే కాస్త భ‌య‌ప‌డాలి త‌ప్ప‌. వ‌చ్చి పోతుంటే టెన్ష‌న్ అక్క‌ర్లేదు.

8, ఆక్సిజ‌న్ లెవ‌లో 94 పాయింట్స్ నుంచి త‌గ్గుతూ ఉంటే మాత్రం డేంజ‌ర్ జోన్ లోకి ఎంట‌ర్ అవుతున్న‌ట్లే.. సో.. హాస్పిట‌ల్ కి వెళ్ల‌డం బెట‌ర్.

9, ఇంట్లో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ ఉన్నా స‌రే.. ఆక్సిజ‌న్ లెవ‌ల్ త‌గ్గుతుందంటే మాత్రం.. సొంత ప్ర‌యోగాలు చేయ‌కుండా హాస్పిట‌ల్ కి వెళ్ల‌డం బెట‌ర్.

10, 7 రోజులు త‌గ్గ‌ని జ్వ‌రం, ఊపిరి అంద‌క పోవ‌డం, విరేచ‌నాలు, ఆక్సిజ‌న్ లెవ‌ల్ 94 కంటే త‌క్కువ‌గా ఉంటే మాత్రం.. ఎవ్వ‌రి స‌ల‌హాలూ తీసుకోకుండా నేరుగా డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లి.. హాస్పిట‌ల్ లో ట్రీట్మెంట్ తీసుకోవ‌డ‌మే ప్రాణాల‌కి ర‌క్ష‌ణ‌.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle