newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

సినిమా ని తలపించే విధంగా ఢిల్లీ కోర్టు ఆవరణలో గ్యాంగ్ వార్

25-09-202125-09-2021 09:34:11 IST
2021-09-25T04:04:11.307Z25-09-2021 2021-09-25T04:04:08.302Z - - 05-12-2021

 సినిమా ని తలపించే విధంగా ఢిల్లీ కోర్టు ఆవరణలో గ్యాంగ్ వార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో జరిగిన గ్యాంగ్ వార్ తో రాజధాని ఒక్క సారిగా ఉలిక్కి పడింది. సినిమాని తలపించే విధంగా లాయర్ల దుస్తుల్లో వచ్చిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మోస్ట్‌ వాండెటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ గోగిని కోర్టు ప్రాంగణంలోనే పట్టపగలు ప్రత్యర్థులు కాల్చి చంపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు మృతి చెందారు. దుండగులు టిల్లు తాజ్‌పూరియా గ్యాంగ్‌కు చెందిన వారని అనుమానిస్తున్నారు.

గ్యాంగ్‌స్టర్‌ జితేంద్ర మన్‌ అలియాన్‌ గోగి.. ఢిల్లీ-హరియాణా సరిహద్దులోని అలీపూర్‌ ప్రాంతానికి చెందినవాడు. పోలీసులు టాప్‌ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో అతడి పేరే ముందుంది. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తను తీహార్‌ జైలు నుంచి బెదిరించడంతో మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కాడు. కారాగారం లోపల నుంచే హంతక దందా నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మూడుసార్లు జైలు నుంచి పారిపోయాడు. 2016, జూలై 30న బహదూర్‌గఢ్‌లో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. గతేడాది మార్చి 3న గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 82లో జితేంద్రను పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు రోహిణి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యేందుకు వెళుతుండగా ప్రత్యర్థుల దాడిలో హతమయ్యాడు. ఈ ఘటనపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని, రోహిణి కోర్టు కి మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఆయన అన్నారు. గతంలో ఈ కోర్టు ఆవరణలో మూడు, నాలుగు కాల్పులు జరిగిన సంఘటనలు కూడా జరిగినట్లు తెలుస్తోంది.

 

వరద బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశం

వరద బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశం

   30-11-2021


తెలంగాణలో కరోనాతో ఒకరు మృతి, కొత్తగా160 కేసులు

తెలంగాణలో కరోనాతో ఒకరు మృతి, కొత్తగా160 కేసులు

   27-11-2021


ఆంధ్ర ప్రదేశ్ నర్సరీ నుండి కోట్లు పెట్టి 200 ఏళ్ల నాటి ఆలివ్ చెట్లను కొన్న అంబానీ

ఆంధ్ర ప్రదేశ్ నర్సరీ నుండి కోట్లు పెట్టి 200 ఏళ్ల నాటి ఆలివ్ చెట్లను కొన్న అంబానీ

   27-11-2021


దక్షిణ కోస్తాకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

దక్షిణ కోస్తాకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

   26-11-2021


15 ఏళ్ల కూతురిపై కన్నేసిన కన్నతండ్రి..  బెదిరించి పలుమార్లు..

15 ఏళ్ల కూతురిపై కన్నేసిన కన్నతండ్రి.. బెదిరించి పలుమార్లు..

   25-11-2021


బెంగళూరు, చెన్నై పరిసర ప్రాంతాలు వర్షం కారణంగా జలమయం

బెంగళూరు, చెన్నై పరిసర ప్రాంతాలు వర్షం కారణంగా జలమయం

   22-11-2021


అమెరికాలో క్రిస్మస్ పరేడ్‌లో జనం మీదకు దూసుకొచ్చిన కారు..

అమెరికాలో క్రిస్మస్ పరేడ్‌లో జనం మీదకు దూసుకొచ్చిన కారు..

   22-11-2021


అనంతపురంలో భారీ వర్షాల కారణంగా భవనం కూలి 4 మంది మృతి

అనంతపురంలో భారీ వర్షాల కారణంగా భవనం కూలి 4 మంది మృతి

   20-11-2021


నెల్లూరులో అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన వరద

నెల్లూరులో అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన వరద

   20-11-2021


బీహార్ కోర్టులో న్యాయమూర్తిపై ఇద్దరు పోలీసులు తుపాకీతో దాడి..

బీహార్ కోర్టులో న్యాయమూర్తిపై ఇద్దరు పోలీసులు తుపాకీతో దాడి..

   19-11-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle