newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

సుప్రీం కోర్టు మెట్లెక్కిన హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనోత్సవ వివాదం..

14-09-202114-09-2021 07:27:04 IST
2021-09-14T01:57:04.967Z14-09-2021 2021-09-14T01:56:54.537Z - - 22-09-2021

సుప్రీం కోర్టు మెట్లెక్కిన హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనోత్సవ వివాదం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం చేయరాదని హైకోర్టు మరో మారు స్పష్టం చేయడంతో ప్రభుత్వం ఈ విషయంపై సుప్రీం కోర్టు కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గణేశ్‌ నిమజ్జనం ట్యాంక్‌ బండ్‌ వైపు చేపట్టరాదని, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చెరువుల్లో నిమజ్జనం చేయరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గణేష్ విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేస్తున్న కారణంగా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేటపుడు ఆ నీరంతా కలుషితం అయిపోతోందని పర్యావరణ వేత్తలు ఎప్పటినుండో మొత్తుకుంటున్నారు. 

గణేష్ విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు లేదని కోర్టు ఎప్పటినుండో చెబుతున్నది. ప్రతీ సంవత్సరం ఈ తంతు జరుగుతూనే ఉంది. కానీ ఈ సారి మటుకు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా నీటి గుంటలను ఏర్పాటు చేసుకోవాల్సింది అని నాలుగు రోజుల క్రితమే కోర్టు చెప్పింది. అయితే ఇప్పటికప్పుడు ప్రత్యేకంగా నీటిగుంటలను ఏర్పాటు చేసుకోవటం కష్టమనేది ప్రభుత్వ వాదన. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం సాధ్యం కాదని చెప్పిన తర్వాత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి కదా అని కోర్టు నిలదీస్తోంది. దీంతో ఇపుడు నిమజ్జనం అంశం ఇటు హై కోర్టు అటు ప్రభుత్వం మధ్య తెగటం లేదు. దీంతో హైకోర్టు ప్రభుత్వం చేసిన విన్నపాన్ని తోసిపుచ్చుతూ కావాలంటే ఈ విషయంపై సుప్రీం కోర్టుని ఆశ్రయించాలని సూచించింది. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేసీఆర్ ని కలిసి చివరికి సుప్రీం కోర్టుకి వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి అక్కడైనా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందా లేక సుప్రీం కోర్టు కూడా ప్రభుత్వానికి అక్షింతలు వేస్తుందా అన్నది చూడాలని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 

ఆఫ్గనిస్తాన్ లో ఏమి జరుగుతుంది..? అఖుండ్‌జాదా బ్రతికే ఉన్నాడా..?

ఆఫ్గనిస్తాన్ లో ఏమి జరుగుతుంది..? అఖుండ్‌జాదా బ్రతికే ఉన్నాడా..?

   12 hours ago


అత్యున్నత మత సంస్థ అధిపతి నరేంద్ర గిరి ఆత్మహత్య

అత్యున్నత మత సంస్థ అధిపతి నరేంద్ర గిరి ఆత్మహత్య

   21-09-2021


ఇమ్మ్యూనిటిని పెంచే కొబ్బరి పాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

ఇమ్మ్యూనిటిని పెంచే కొబ్బరి పాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

   20-09-2021


హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు..

హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు..

   18-09-2021


సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

   17-09-2021


సైదాబాద్‌ చిన్నారి హత్య కేసు నిందితుడు రాజు ఆత్మహత్య

సైదాబాద్‌ చిన్నారి హత్య కేసు నిందితుడు రాజు ఆత్మహత్య

   16-09-2021


ఆ మానవ మృగం బయటెక్కడో ఉంది.. ఉండకూడదు

ఆ మానవ మృగం బయటెక్కడో ఉంది.. ఉండకూడదు

   16-09-2021


చిన్నారి కుటుంబసభ్యులను పరామర్శించిన పవన్ కల్యాణ్

చిన్నారి కుటుంబసభ్యులను పరామర్శించిన పవన్ కల్యాణ్

   15-09-2021


ముంబై బైకుల్లా జూ లో 2 పెంగ్విన్ పిల్లలు జన్మించారు

ముంబై బైకుల్లా జూ లో 2 పెంగ్విన్ పిల్లలు జన్మించారు

   15-09-2021


చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడి ఆచూకీ చెబితే పది లక్షల నజరానా..

చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడి ఆచూకీ చెబితే పది లక్షల నజరానా..

   14-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle