newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అంబానీ సన్నిహితుడు.. 70కోట్ల జీతం వద్దనుకుని సన్యాసిగా మారాడు

01-05-202101-05-2021 15:03:32 IST
2021-05-01T09:33:32.442Z01-05-2021 2021-05-01T02:25:01.864Z - - 14-05-2021

అంబానీ సన్నిహితుడు.. 70కోట్ల జీతం వద్దనుకుని సన్యాసిగా మారాడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సన్యాసులుగా మారాలి అంటే.. త్యజించాల్సినవి చాలానే ఉంటాయి. కుటుంబాన్ని, వృత్తిని త్యజించేస్తూ ఉంటారు కొందరు. ఇప్పుడు ముఖేశ్ అంబానీ సన్నహితుడు.. కాదు.. కాదు.. అత్యంత సన్నిహితుడు కోట్ల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని మరీ సన్యాసిగా మారడం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇంతకూ ఈ నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా..? ప్రకాష్ షా. రిలయన్స్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ప్రకాష్ షా సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసిగా మారిపోయారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. ముఖేశ్ అంబానీకి అత్యంత సన్నిహితుడు ప్రకాష్ షా అని చెబుతూ ఉంటారు. ఏడాదికి రూ.70 కోట్ల జీతం తీసుకునే స్థాయిని కూడా వదులుకుని సన్యాసం తీసుకున్నారు.  ప్రకాశ్ షా ముఖేశ్ అంబానీ బాల్యమిత్రులు. ప్రకాశ్ షా కెమికల్ ఇంజినీరింగ్ లో పట్టా అందుకున్నాడు. ఆపై బాంబే ఐఐటీలో పీజీ పూర్తిచేశారు. 

రిలయన్స్ గ్రూపులో ప్రకాశ్ షా ఎంతో కీలకవ్యక్తిగా ఎదిగారు. ఆయనకు భార్య నయనా బెన్, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు ఇంతకుముందే సన్యాసం తీసుకున్నాడు. ప్రకాశ్ షా కూడా ఏప్రిల్ 25న జైన మతాచారాల ప్రకారం సన్యాస దీక్ష స్వీకరించారు. భర్త బాటలోనే భార్య నయన కూడా సన్యాసినిగా మారిపోయారు. ఎంతో సంపద, హోదాను వదులుకుని ఆయన ఆధ్యాత్మికపంథాను ఎంచుకున్నారు. 

40 సంవత్సరాల కిందట ప్రకాష్ ఐఐటీ బాంబేలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. రిలయన్స్ సంస్థలో సుదీర్ఘ కెరీర్ ఉంది. గత ఏడాది రిలయన్స్ వైస్ ప్రెసిడెంట్ గా రిటైర్ అయ్యారు. రిలయన్స్ కు చెందిన జాంనగర్ పెట్ కోక్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ విషయంలో కీలక పాత్ర పోషించారు ప్రకాష్. ఆయన భార్య నైనా కూడా కామర్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. రిటైర్మెంట్ తర్వాత తాను సన్యాసిగా మారబోతున్నానని చాలా మందికి చెప్పారట ప్రకాష్. అయితే కోవిద్-19 పరిస్థితుల కారణంగా ఆయన దీక్ష తీసుకోవడం కాస్తా ఆలస్యంగా జరిగింది. దాదాపు ఏడాది పాటూ ఆయన దీక్ష వాయిదా పడింది. దీక్ష తీసుకున్న తర్వాత వాళ్లు కేవలం కాలినడకన నడచాల్సి ఉంటుంది. ఎవరైనా.. ఏదైనా భిక్షగా ఇస్తే దాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ప్రకాష్ కు ఇద్దరు కొడుకులు.. ఒక కొడుకు ఏడు సంవత్సరాల కిందటే దీక్ష స్వీకరించగా.. ఇంకొక కుమారుడు పెళ్లి చేసుకున్నాడు. 

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle