newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కరోనా భ‌యంతో సిటీ స్కాన్.. ఎంత ప్రాబ్ల‌మో తెలుసా

04-05-202104-05-2021 22:11:57 IST
2021-05-04T16:41:57.504Z04-05-2021 2021-05-04T15:25:06.975Z - - 14-05-2021

కరోనా భ‌యంతో సిటీ స్కాన్.. ఎంత ప్రాబ్ల‌మో తెలుసా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏమ‌న్నా అంటే చాలు.. డాక్ట‌ర్ చెప్ప‌క‌ముందే పేషెంట్లే అనేస్తుంటారు. సార్.. సిటీ స్కాన్ చేయించుకుని ర‌మ్మంటారా. మేడ‌మ్ ఎందుకైనా మంచిది.. సిటీ స్కాన్ ఓ సారి రాయండి. వెళ్లొస్తా. నాక్కూడా కాస్త రిలీఫ్ గా ఉంటుంది క‌దా అంటుంటారు. ఆరోగ్యం అంటే ఆ మాత్రం భ‌యం ఉన్న‌ప్పుడు మాస్కులు పెట్టుకుని.. జ‌నంలోకి, గుంపులోకి వెళ్ల‌కుంటే క‌రోనా టెన్ష‌న్ ఉండ‌దు క‌దా అని మ‌నం జ‌నాన్ని అన‌కూడ‌దు. ఎందుకంటే.. అన్నా వారు విన‌రు క‌దా. ఇక డాక్ట‌ర్ చెబితే మాత్రం.. అఫ్ కోర్స్ వీళ్లే డాక్ట‌ర్ కి చెప్పి మ‌రీ చేయించుకుంటున్నారు సిటీస్కాన్. ఈ మ‌ధ్య సిటీ స్కాన్ మామూలు డిమాండ్ లేదు. ఎందుకంటే.. సిటీ స్కాన్ లో క‌రోనా కూడా తేలుతుంది క‌దా. ఆ గుంపులోకి వెళ్లి.. ముక్కుల్లో దూదులు పెట్టించుకుని.. టెస్ట్ కి ఇచ్చి.. ఆ రిపోర్ట్ వ‌చ్చిందాకా చూసి.. ఆ రిపోర్ట్ మ‌న‌దో కాదో అనే డౌట్ తో చ‌చ్చీ.. ఇలా ఎన్నో.. అనుమానాలూ ఉంటున్న‌య్ క‌దా.  సిటీ స్కానింగ్ అయితే.. ఏం చ‌క్కా వేల‌కి వేలు క‌ట్టొచ్చు.. ప్ర‌శాంతంగా చెక్ చేయించుకుని రావ‌చ్చు అనుకుంటున్నారు జ‌నాలు.

అందుకే.. సిటీ స్కానింగ్ కి రేట్లు కూడా పెంచేస్తుంటే.. ప్ర‌భుత్వం కంట్రోల్ చేస్తోంది. అఫ్ కోర్స్.. అన‌ఫిషియ‌ల్ గా మాత్రం అది అలాగే న‌డుస్తూ ఉంటుంది అది వేరే విష‌యం. కానీ.. క‌రోనా విష‌యంలో మాత్రం ఇప్పుడు జ‌నాలు సిటీ స్కానింగ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పోతే పోయిన‌య్ లే డ‌బ్బులేగా పోయేట‌ప్పుడు ప‌ట్టుకు పోతామా ఏంటి. ఆ క‌రోనా టెస్టింగ్ సెంట‌ర్ కి వెళ్లి.. కరోనా లేకున్నా త‌గిలించుకుని రావ‌డం కంటే.. ఇక్క‌డ సిటీ స్కానింగ్ తీసుకోవ‌డ‌మే బెట‌ర్ అనుకుంటున్నారు. బిలో మిడిల్ క్లాస్ వాళ్లు కూడా సిటీ స్కానింగ్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

అయితే.. సిటీ స్కానింగ్ లో వ‌చ్చే క‌రోనా రిజ‌ల్ట్ ని హండ్ర‌డ్ ప‌ర్సంట్ న‌మ్మ‌డానికి వీళ్లేద‌ట‌. సిటీ స్కానింగ్ లో క‌రోనా చెక్ చేయించుకోవ‌డం కంటే.. ఎక్స్ రే తీయించుకోవ‌డం బెట‌ర్ అంటున్నారు. అలాగే.. సిటీ స్కానింగ్ లో క‌రోనా ల‌క్ష‌ణాలు చూపించిన వారికి ఎలాంటి ట్రీట్మెంట్ అవ‌స‌రం లేకుండానే న‌యం అవుతోందంట‌. సిటీ స్కానింగ్ లో స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌నిపించిన వారు టెన్ష‌న్ ప‌డాల్సిన ప‌నిలేద‌ట‌. హ‌డావిడి అయిపోయి.. గాబ‌రా ప‌డిపోయి.. బీపీలు పెంచుకుని.. డ‌బ్బులు ఖ‌ర్చు చేసుకోవ‌ద్దు అంటున్నారు డాక్ట‌ర్లు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న వారు.. సిటీ స్కానింగ్ దాకా వెళ్ల‌కుండానే ఐసోలేష‌న్ కి వెళ్లిపోయి.. క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తే.. అంతా ప్ర‌శాంతం అంటున్నారు. అలాగే.. ఎక్కువ సార్లు సిటీ స్కానింగ్ చేయించుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం ఉందంట‌. ఇప్పుడు అవ‌స‌రం లేకున్నా చేయించుకుని.. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు త‌ప్ప‌ని స‌రిగా చేయించుకుంటే ఎఫెక్ట్ ఉంటుంది క‌దా. అలాగే.. సిటీ స్కానింగ్ ఒక్క‌సారి తీస్తే.. 400 సార్లు చెస్ట్ స్కానింగ్ తీసినంత ఎఫెక్ట్ ప‌డుతుందంట‌. ఒక్క‌సారి ఆలోచించండి అంటున్నారు డాక్టర్లు. కొంత‌మంది డాక్ట‌ర్లు.. హ‌డావిడి చేసినా.. మీరు కాస్త నిమ్మ‌లంగా ఆలోచించుకోండి అంటున్నారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle