newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

క‌రోనా మ‌రో 20 రోజుల్లో త‌గ్గుతుందంట‌లే

09-05-202109-05-2021 09:22:28 IST
2021-05-09T03:52:28.274Z09-05-2021 2021-05-09T03:52:24.070Z - - 22-06-2021

క‌రోనా మ‌రో 20 రోజుల్లో త‌గ్గుతుందంట‌లే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏందేంది. క‌రోనా.... త‌గ్గుతుందా... అదీ 20 రోజుల్లోనే. అబ్బ‌బ్బ‌.. ఏం చెబుతున్నార్ సామే. ఈ 20 రోజుల్లో ఎంత  మంది చ‌స్తారో లెక్కెట్ట‌డ‌మే క‌ష్టం. చావులు ఎంత‌లా పెరుగుతాయో లెక్కెట్ట‌డ‌మే క‌ష్టం. అలాంటిది.. క‌రోనా 20 రోజుల్లో త‌గ్గుతుంది అని ఏ లెక్క‌న చెబుతున్నారు సామే. బ‌య‌ట ఎవరైనా మాస్కులు వాడుతున్నారు. మాస్కులు ఉన్న వాళ్లు కూడా గ‌డ్డాల‌కి పెట్టుకుని తిరుగుతున్నారే త‌ప్ప‌.. ముక్కుకీ మూతికీ మాస్కు పెట్టుకుంటున్నారా. అహా.. ఏం చెబుతున్నారు. మే లో క‌రోనా త‌గ్గుతుందంట త‌గ్గుతుంది. అదేలెండి... మే చివ‌రిలోగా అందిన  కాడికి జ‌నాల్ని చంపేసి.. మిగ‌తా వాళ్లంద‌రినీ చుట్టేసి.. ఓసారి వ‌చ్చి పోతే.. ఇంకెవ‌రూ కొత్త‌గా లేకుంటే త‌గ్గుతుందేమో త‌ప్ప‌.. క‌రోనా త‌గ్గుతుంది అనే మాట న‌మ్మ‌డానికి ఎవ‌రూ రెడీగా లేరు. ఇదీ జ‌నం మాట‌.

మ‌రి క‌రోనా మ‌రో 20 రోజుల్లో త‌గ్గుతుంది అని ఎవ‌రు చెప్పారు అనుకుంటున్నారా. ఓ ప్ర‌ముఖ వ్యాక్సినాల‌జిస్ట్ చెప్పారు. ఇప్ప‌టికే దేశంలో రోజూ వారి క‌రోనా సంఖ్య 4 ల‌క్ష‌లు దాటింది. రోజూ వారి సంఖ్య ఈ నెల్లోనే 5 ల‌క్ష‌లు  దాటుతుంది అని అంచ‌నాలు కూడా ఉన్నాయి. అస‌లు బెడ్స్ దొర‌క‌వు.. శ్మ‌శానాలు ఖాళీ ఉండ‌వు అని వేరే వారు చెప్పాల్సిన ప‌నిలేదు. అది మ‌న క‌ళ్ల‌కి క‌ట్టిన‌ట్లు క‌నిపిస్తోంది కూడా. కానీ.. ఆ వ్యాక్సినాల‌జిస్ట్ మాత్రం  త‌గ్గుతుంది ఏం కంగారు ప‌డ‌కండి. మే 31లోగా.. క‌రోనా తగ్గ‌డం స్టార్ట్ అవుతుంది అంటున్నారు. గ‌గ‌న్ దీప్ అనే వైరాల‌జిస్ట్ మాట ఇది. గ‌గ‌న్ దీప్ అనే వైరాల‌జిస్ట్ కి దేశ వ్యాప్తంగా  పేరుంది. ఆమె ఆల్రెడీ.. పిల్ల‌ల్లో సోకే రోగాల‌కి సంబంధించి  వ్యాక్సిన్ లు కూడా క‌నిపెట్టారు. బ్రిట‌న్ కూడా ఆమె ప్ర‌తిభ‌ను గుర్తించింది. ఆమె ఇప్పుడు ఇదే మాట చెబుతున్నారు. ఇక దేశంలోని మ‌రికొంద‌రు వైర‌స్ గురించి తెలిసిన పెద్ద‌లు కూడా గ‌తంలో ఇదే మాట అన్నారు. మే చివ‌రి దాకా.. వైర‌స్ గ్రాఫ్ ఉవ్వెత్తున లేస్తుంది. త‌ర్వాత ప‌డిపోతుంది అన్నారు. స‌రెలే.. ఎవ‌రు చెబితే ఏంటి. వాళ్ల నోటి చ‌లువ‌న ఈ క‌రోనా త‌గ్గితే అంత‌కు మించి ఇంకేం కావాలి చెప్పండి.

ICAI CA పరీక్ష అడ్మిట్ కార్డు విడుదల - డౌన్‌లోడ్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

ICAI CA పరీక్ష అడ్మిట్ కార్డు విడుదల - డౌన్‌లోడ్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

   21-06-2021


World Music Day 2021: వరల్డ్ మ్యూజిక్ డే - జూన్ 21

World Music Day 2021: వరల్డ్ మ్యూజిక్ డే - జూన్ 21

   21-06-2021


బ్రిటన్ లో 10 మిలియన్ సంవత్సరాల క్రితం చివరి డైనోసార్ల పాదముద్రలు

బ్రిటన్ లో 10 మిలియన్ సంవత్సరాల క్రితం చివరి డైనోసార్ల పాదముద్రలు

   20-06-2021


ఏపీ లో కర్ఫ్యూ సడలింపు.. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు

ఏపీ లో కర్ఫ్యూ సడలింపు.. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు

   18-06-2021


యూట్యూబ్ లో ఇక ఆ ప్రకటనలు కనిపించవు..

యూట్యూబ్ లో ఇక ఆ ప్రకటనలు కనిపించవు..

   18-06-2021


ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం బోట్స్వానాలో వెలికితీసిన

ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం బోట్స్వానాలో వెలికితీసిన

   18-06-2021


బెంగాల్‌లో భారీ వర్షాలు, రాబోయే మూడు రోజుల్లో కూడా బెంగాల్‌లో భారీ వర్షాలు

బెంగాల్‌లో భారీ వర్షాలు, రాబోయే మూడు రోజుల్లో కూడా బెంగాల్‌లో భారీ వర్షాలు

   17-06-2021


వంట నూనె త్వరలో చౌకగా మారవచ్చు

వంట నూనె త్వరలో చౌకగా మారవచ్చు

   15-06-2021


Crime News: రోజు రోజుకీ నేర ప్రవృత్తి మనుషుల్లో పెరిగిపోతుందా?

Crime News: రోజు రోజుకీ నేర ప్రవృత్తి మనుషుల్లో పెరిగిపోతుందా?

   15-06-2021


జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

   14-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle