newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తిన‌కుంటే క‌రోనా రాదు.. ఒక వేళ వ‌స్తే తినాలి.. ఏమిట‌ది..?

27-04-202127-04-2021 09:59:58 IST
2021-04-27T04:29:58.621Z27-04-2021 2021-04-27T02:30:58.077Z - - 14-05-2021

తిన‌కుంటే క‌రోనా రాదు.. ఒక వేళ వ‌స్తే తినాలి.. ఏమిట‌ది..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కొన్ని కొన్ని ఎవ్వారాలు భ‌లే ఉంట‌య్. రెగ్యుల‌ర్ గా అప్డేట్స్ చూస్తుంటే కొన్ని న‌మ్మేలా ఉన్నా.. కొన్ని మాత్రం విచిత్రంగానే అనిపిస్త‌య్. కానీ.. క్లారిటీస్ చూస్తే మాత్రం నమ్మాలి అనిపిస్తుంది. న‌మ్మేస్తాం కూడా. మ‌రి క‌రోనా ఎవ్వారంలో ఎన్నో చూస్తున్నాం క‌దా. అస‌లు ట్వంటీ ట్వంటీ అంటేనే అద్భుతాల‌కి అడ్డా అయిపోయే. మ‌రి క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఎన్ని విడ్డూరాలు చూస్తున్నామో ఎవ‌రికి మాత్రం తెలీదు చెప్పండి.

మామూలుగా నిజాలా కావా అనేవి వ‌దిలేస్తే.. కరోనా విష‌యంలో చాలా విష‌యాలు బ‌య‌టికి వ‌స్తుంట‌య్. ఆ మ‌ధ్య చికెన్ తింటే క‌రోనా వ‌స్తుంది అనుకున్నారు. కోళ్ల ఫారాలు క్లోజ్ చేశారు. త‌ర్వాత చికెనే కాపాడుతుంది అన్నారు.. మ‌ళ్లీ డిమాండ్ పెంచేశారు. ఇప్పుడు కూడా ఇలాంటివే కొన్ని కొన్ని విష‌యాలు బ‌య‌టికి వ‌స్తున్న‌య్. ఇన్నాళ్ల ప్ర‌యోగాల త‌ర్వాత వ‌స్తున్న వార్త‌లు కాబ‌ట్టి.. న‌మ్మాల్సిందే అనిపించేలా ఉంది ఎవ్వారం. ఏంద‌య్యా అంటే.. క‌రోనా అనే దానికి రోగ నిరోధ‌క శ‌క్తి చాలా అవ‌స‌రం క‌దా. అయితే.. ఈ విష‌యంలో శాఖా హారులు  సేఫ్ అంట‌. శాఖా హారుల‌కి క‌రోనా చాలా త‌క్కువ‌గా వ‌స్తుందంట‌. శాఖా హారుల్లో రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ ఉండ‌డం  వ‌ల్ల‌.. బాడీలోకి క‌రోనా ఎంట‌ర్ కాలేద‌ట‌.  ఎంట‌ర్ అయినా.. శాఖా హారుల బాడీలో ఉన్న యాంటీ బాడీస్ గేట్ ద‌గ్గ‌రే నుంచి.. బ‌య‌టికి త‌రిమేస్తాయంట  క‌రోనాని. అయినా క‌రోనా చేధించుకుని లోప‌లికి వ‌స్తే.. ఎంట‌ర్ కాగానే ఏసేస్తాయ‌ట‌. సో.. శాఖాహారుల‌కి క‌రోనా రాదు. మ‌రి వ‌స్తే ఏం చేయాలి. తెలిసిందే క‌దా. గుడ్లు తినాలి. మాంసం తినాలి. చికెన్ మ‌ట‌న్ అని తేడా లేకుండా అన్నీ లాగించేయాలి. అలా అయితేనే రోగ నిరోధ‌క శ‌క్తి ఇమీడియ‌ట్ గా పెరుగుతుంది.. క‌రోనా చ‌స్తుంది. అంతే క‌దా.

ఇక పోతే.. సిగ‌రెట్ తాగేవారికి కూడా క‌రోనా ఎఫెక్ట్ త‌క్కువ‌గా ఉంటుంది అంట‌. అయితే.. క‌రోనా రాక‌ముందు సిగ‌రెట్ తాగే వారికి మంచిదేన‌ట‌. ఎందుకంటే.. గొంతులో ఏదో స‌న్న‌ని పొర ఏర్ప‌డి.. క‌రోనా లోప‌లికి ఎంట‌ర్ కాలేద‌ట‌. ఒక వేళ వ‌చ్చిందో.. అంతే ఇక. తెలిసిందే క‌దా. ఊపిరి తిత్తులు ఉష్కాకీ అంట‌య్. ఆక్సిజ‌న్ స‌రైన టైంలో అంద‌క పోతే.. య‌మ‌పురికి టిక్కెట్ కొనుక్కోవాల్సిందే. అక్క‌డికైతే మాస్క్ అక్క‌ర్లేదు కావ‌చ్చు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle