newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

గాలి ద్వారా క‌రోనా వ‌స్తుందా.. అమెరికా ఇచ్చిన క్లారిటీ

10-05-202110-05-2021 08:37:44 IST
2021-05-10T03:07:44.852Z10-05-2021 2021-05-10T03:07:41.574Z - - 22-06-2021

గాలి ద్వారా క‌రోనా వ‌స్తుందా.. అమెరికా ఇచ్చిన క్లారిటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏం ప‌ర్లేదు ఏం ప‌ర్లేదు. గాలి ద్వారా క‌రోనా రాదు ఏం రాదు అనుకున్నాం. ఎందుకంటే ఆ మ‌ధ్య గాలి ద్వారా క‌రోనా వ‌స్తుంది అన్న వార్త‌ల‌కి డాక్ట‌ర్లు సైంటిస్టులు కొంద‌రు. గాలి ద్వారా క‌రోనా రాదు.. నీటి ద్వారా క‌రోనా రాదు అంటే ఏంటేంటో చెప్పారు. పాపం వాళ్లు మాత్రం ఎన్న‌ని చెబుతారు చెప్పండి. కొన్ని కొన్ని త‌ప్పులు అవుతూనే ఉంట‌య్ క‌దా. ఇప్పుడు గాలి ద్వారా క‌రోనా వ‌చ్చే విష‌యంలో కూడా.. రాదు అని చెప్పిన వారి మాట‌లు రాంగ్ అని తేలిపోతున్నాయి. ఇప్ప‌టికే గాలి ద్వారా క‌రోనా వ‌స్తుంది అని సైంటిఫిక్ ప్రూఫ్స్ చూపిన వారు ఉన్నారు కదా. కానీ.. మ‌నం ఏమో.. రాదంట అనే మాట‌లే న‌మ్మాం. ఎందుకంటే ఎంతక‌ని భ‌య‌ప‌డ‌తాం చెప్పండి. రాదు అనే మాట కాస్త విన‌డానికి హ్యాప్పీగా ఉంటే ఆ మాట‌నే న‌మ్మాం. కానీ.. ఇకపై ఆ మాట‌ని న‌మ్మితే.. న‌మ్మిన వారి డెడ్ బాడీ కూడా శ్మ‌శానం ద‌గ్గ‌ర క్యూ లో నిల‌బ‌డే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గాలి ద్వారా వ‌చ్చిన క‌రోనాకి కాస్త స్పీడ్ ఎక్కువ అంట. బండికి సీసీ ప‌వ‌ర్ ఎక్కువ అయిన కొద్దీ స్పీడ్ ఎక్కువ ఉంటుంది క‌దా. పికప్ లో డిఫ‌రెన్స్ ఉంటుంది క‌దా. అలాగే.. గాలి ద్వారా వ‌చ్చిన క‌రోనా బాడీలోకి ఇమీడియ‌ట్ గా  వెళ్లిపోతుందంట‌.

అమెరికా సైంటిస్టులు ఇదే మాట చెబుతున్నారు. మ‌నిషి  ఊపిరి వ‌దిలిన టైంలో.. శ్వాస కోశ క‌ణాల‌తో పాటు.. ఎరోసాల్ క‌ణాలు కూడా గాలిలో ఉండిపోతాయి. ఈ బింధువుల ద్వారానే.. క‌రోనా ఒక‌రి నుంచి ఒక‌రికి ట్రాన్స్ఫ‌ర్ అవుతుందంట‌. క‌రోనా పేషెంట్ ఎక్స‌ర్ సైజ్ చేసే టైంలో.. మాట్లాడే టైంలో.. స్పీచ్ ఇచ్చే టైంలో.. పాట పాడే టైంలో.. ఇవి ఎక్కువ‌గా బ‌య‌టికి వ‌స్తాయి అంట‌. అలాగే అవి ఎక్కువ శాతం చ‌నిపోవ‌డం లేద‌ట‌. మామూలు కరోనా కంటే.. ఈ బింధువుల్లో ఉండే క‌రోనా ఎక్కువ కాలం బ‌తుకుతుందంట‌. మామూలు వారు అక్క‌డికి వెళ్లి.. ఊపిరి పీల్చితే.. అంతే ఇక‌. ఆ బింధువుల‌తో క‌లిసి.. లోప‌లికి ఇమీడియ‌ట్ గా వెళ్లిపోతాయట‌. ఇలా వెళ్లిపోయే క‌రోనా వైర‌స్.. మ‌ధ్య‌లో ఎక్క‌డా ఆగ‌కుండా నేరుగా ఊపిరి తిత్తుల ద‌గ్గ‌ర తిష్ట వేస్తాయ‌ట‌. ఇక త‌ర్వాత ఏం జ‌రుగుతుందో డాక్ట‌ర్ల‌కంటే మ‌నుషుల‌కే ఎక్కువ తెలుసు క‌దా. అద్దీ మేట‌ర్. ప్రాణం పోవ‌డానికి నూటొక్క దారులున్న‌య్ అన‌మాట‌. అందులో క‌రోనా దారి ర‌హ‌దారి. కేర్ తీసుకోకుంటే అంతే ఇక‌.

ICAI CA పరీక్ష అడ్మిట్ కార్డు విడుదల - డౌన్‌లోడ్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

ICAI CA పరీక్ష అడ్మిట్ కార్డు విడుదల - డౌన్‌లోడ్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

   21-06-2021


World Music Day 2021: వరల్డ్ మ్యూజిక్ డే - జూన్ 21

World Music Day 2021: వరల్డ్ మ్యూజిక్ డే - జూన్ 21

   21-06-2021


బ్రిటన్ లో 10 మిలియన్ సంవత్సరాల క్రితం చివరి డైనోసార్ల పాదముద్రలు

బ్రిటన్ లో 10 మిలియన్ సంవత్సరాల క్రితం చివరి డైనోసార్ల పాదముద్రలు

   20-06-2021


ఏపీ లో కర్ఫ్యూ సడలింపు.. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు

ఏపీ లో కర్ఫ్యూ సడలింపు.. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు

   18-06-2021


యూట్యూబ్ లో ఇక ఆ ప్రకటనలు కనిపించవు..

యూట్యూబ్ లో ఇక ఆ ప్రకటనలు కనిపించవు..

   18-06-2021


ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం బోట్స్వానాలో వెలికితీసిన

ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం బోట్స్వానాలో వెలికితీసిన

   18-06-2021


బెంగాల్‌లో భారీ వర్షాలు, రాబోయే మూడు రోజుల్లో కూడా బెంగాల్‌లో భారీ వర్షాలు

బెంగాల్‌లో భారీ వర్షాలు, రాబోయే మూడు రోజుల్లో కూడా బెంగాల్‌లో భారీ వర్షాలు

   17-06-2021


వంట నూనె త్వరలో చౌకగా మారవచ్చు

వంట నూనె త్వరలో చౌకగా మారవచ్చు

   15-06-2021


Crime News: రోజు రోజుకీ నేర ప్రవృత్తి మనుషుల్లో పెరిగిపోతుందా?

Crime News: రోజు రోజుకీ నేర ప్రవృత్తి మనుషుల్లో పెరిగిపోతుందా?

   15-06-2021


జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై హైదరాబాద్ లో పిర్యాదు

   14-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle