newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో మార్పులు

12-05-202212-05-2022 10:13:01 IST
2022-05-12T04:43:01.275Z12-05-2022 2022-05-12T04:42:53.448Z - - 27-05-2022

ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో మార్పులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) వెబ్‌సైట్ టిక్కెట్ బుకింగ్ ప్రక్రియను సవరించింది. ఐఆర్‌సీటీసీ వినియోగదారులు తమ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకునే ముందు వారి ఫోన్ నంబర్‌లు మరియు ఈ-మెయిల్ ఐడీలను ధృవీకరించడం తప్పనిసరి చేసింది.  ఈ యాప్‌ అప్లికేషన్ గూగుల్‌ ప్లే స్టోర్‌తో పాటు యాపిల్‌ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుందన్నది తెలిసిందే. ఇక మీదట.. వెరిఫికేషన్ లేకుండా కస్టమర్లు టిక్కెట్లు బుక్ చేసుకోలేరని IRCTC స్పష్టం చేసింది.

ముందుగా ఐఆర్‌సీటీసీ యాప్‌ లేదంటే వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ వెరిఫికేషన్‌ విండో కనిపిస్తుంది. అందులో మొబైల్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడీని ఎంటర్‌ చేయాలి. కుడి వైపు వెరిఫికేషన్‌.. ఎడమ వైపు ఎడిట్‌ బటన్‌ కనిపిస్తాయి. వివరాలను పొందుపరిచాక.. వన్‌ టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ) మొబైల్‌ నెంబర్‌ లేదంటే మెయిల్‌ ఐడీకి వస్తుంది. ఆపై వెరిఫై ద్వారా ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని  ఐఆర్‌సీటీసీ ప్రకటన విడుదల చేసింది.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle