newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈ 3 ల‌క్ష‌ణాలుంటే..క‌రోనా టెస్ట్ కి వెళ్లండి..చెవిలో కూడా ల‌క్ష‌ణం

25-04-202125-04-2021 09:02:31 IST
Updated On 25-04-2021 08:59:31 ISTUpdated On 25-04-20212021-04-25T03:32:31.658Z25-04-2021 2021-04-25T03:14:59.021Z - 2021-04-25T03:29:31.301Z - 25-04-2021

ఈ 3 ల‌క్ష‌ణాలుంటే..క‌రోనా టెస్ట్ కి వెళ్లండి..చెవిలో కూడా ల‌క్ష‌ణం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ దిక్కు మాలిన క‌రోనాకి సిగ్గూ శ‌రం లేదు. ఎంత‌మంది తిట్టి పోస్తున్నా.. వ‌దిలి పెట్ట‌డం లేదు. క‌రోనా గురించి అంద‌రికీ ఓ ఐడియా ఉంది క‌దా. జ్వ‌రం వ‌స్తే క‌రోనా.. ద‌గ్గు వ‌స్తే క‌రోనా.. తుమ్ములు వ‌స్తే క‌రోనా అనుకుంటాం. భ‌య‌ప‌డ‌తాం.. ఎదుటి వారిలో ఈ ల‌క్షణాలు ఉన్నా టెన్ష‌న్ ప‌డ‌తాం. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌నాలు ఈ ల‌క్ష‌ణాల‌నే మెయిన్ గా అబ్జ‌ర్వ్ చేస్తున్నారు. కానీ.. మ‌రో ప్ర‌ధాన మూడు ల‌క్ష‌ణాలు డేంజ‌ర్ గా ఉన్నాయి అంటున్నారు డాక్ట‌ర్లు సైంటిస్టులు. ఈ మూడు ల‌క్ష‌ణాలు ఉంటే.. ముందుగా టెస్టుకి వెళ్లి రండి. త‌ర్వాత‌నే రిలాక్స్ అవ్వండి అంటున్నారు. ఫ‌స్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఇంకా క్రూయ‌ల్ గా ఉంది కాబ‌ట్టి.. ప్రాణాలు ఊరికే రాలి పోతున్నాయి కాబ‌ట్టి.. కాస్త కేర్ తీసుకోండి అంటున్నారు.

1, క‌ళ్లు గులాబీ రంగు లోకి మారితే ఆ ఏముందిలే దుమ్ము ప‌డింది అనుకోకండి. స‌బ్బులో ప్రాబ్ల‌మ్ ఉంది అనుకోకండి. ఎండ‌కి వెళ్లొచ్చాం క‌దా అనుకోకండి. షాంపూతో త‌ల స్నానం చేశాం క‌దా అనుకోకండి. ఏదో వేడికి అలా రంగు మారాయిలే అనుకోకండి. కూల్ గా ఓ కొబ్బ‌రి బోండం తాగితే.. పోతుందిలే అనుకోకండి. ముందు క‌రోనా టెస్టుకి వెళ్లండి. ఎందుకంటే.. సెకండ్ వేవ్ లో ఎవ‌రికి క‌రోనా వ‌చ్చినా రాకున్నా.. క‌ళ్లు గులాబీ రంగులోకి మారితే మాత్రం డేంజ‌ర్ అంటున్నారు. క‌ళ్లు పింక్ లోకి మార‌గానే టెస్టుల‌కి వెళ్లండి అని స‌ల‌హా ఇస్తున్నారు. అలా వెళ్లిన వారిలో.. నూటికి 99 మందికి క‌రోనా ఉన్న‌ట్లు నిర్దార‌ణ అవుతోందంట‌.

2, అస‌లు చెవికీ క‌రోనాకి సంబంధం ఏంటి అనుకుంటాం. చెవి వినికిడికీ క‌రోనాకి సంబంధం ఏంటి అనుకుంటాం. కానీ.. ఈ క‌రోనాకి సిగ్గు శ‌రం లేదు అని ముందే అనుకున్నాం క‌దా. దాని ఇష్టం వ‌చ్చిన‌ట్లు మ‌నుషుల‌పై అటాక్ చేస్తోంది. క‌రోనా వ‌చ్చిన వారికి వినికిడి స‌మ‌స్య కూడా వ‌స్తుందంట‌. అలాగే.. పెద్ద శ‌బ్ధాలు వినిపిస్తాయంట‌. వ‌చ్చిన ప్ర‌తి వారికీ అలా అవుతుంది అని కాదు. అలా అనిపించినా కూడా క‌రోనా టెస్ట్ కి వెళ్లాలి అంటున్నారు డాక్ట‌ర్లు. 56 రకాలుగా టెస్టులు చేసిన తర్వాత ఫైన‌ల్ గా ఈ మాటలు చెబుతున్నారు.

3, విరేచ‌నాలు, వాంతులు, క‌డుపు నొప్పి వికారం ఉన్నా స‌రే.. ముందు మీరు క‌రోనా టెస్ట్ కి వెళ్లండి. అలా అని కంగారు ప‌డ‌కండి. ఫుట్ పాయిజ‌న్ అయ్యుండొచ్చు.. ఎండ దెబ్బ కూడా కావ‌చ్చు. కానీ.. మైండ్ మొత్తం దాని మీదే పెట్ట‌కుండా.. మైండ్ లో ఓ మూల‌న ఈ ఆలోచ‌న కూడా పెట్టుకుని.. వీలైనంత త్వ‌ర‌గా క‌రోనా టెస్ట్ కి వెళ్లండి. ప్రాణం పోతే వ‌స్తుందా చెప్పండి. క‌రోనా టెస్ట్ కి పోయి వ‌చ్చినంత మాత్రాన‌.. వ‌చ్చే న‌ష్టం ఏమీ లేదు క‌దా.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle