newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు.. సినీ హీరో ఎన్టీఆర్ ఆవేదన

21-11-202121-11-2021 08:48:48 IST
2021-11-21T03:18:48.254Z21-11-2021 2021-11-21T03:18:42.745Z - - 05-12-2021

చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు.. సినీ హీరో ఎన్టీఆర్ ఆవేదన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మీడియా సాక్షిగా కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నందమూరి వారసుడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ ఘాటుగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చాలా సర్వసాధారణం. అవి ప్రజా సమస్యలపై జరగాలే కానీ, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజాసమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పానలకు నాంది పలుకుతుంది. స్త్రీజాతిని గౌరవించడం అనేది మన సంస్కృతి. మన నవ నాడుల్లో, మన జవజీవాల్లో, మన రక్తంలో ఇమిడిపోయిన ఒక సంప్రదాయం. దాన్ని రాబోయే తరాలకు జాగ్రత్తగా అందించాలి. అంతేకానీ, మన సంస్కృతిని కలచివేసి, కాల్చేసి, ఇదే రాబోయే తరాలకు బంగారు బాట వేస్తున్నామనుకుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పుు. ఈ మాటలు నేను ఒక వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబానికి చెందినవాడినిగా మాట్లాడటం లేదు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి చెందిన పౌరుడిగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులకు ఒకటే విన్నపం. ఈ అరాచక సంస్కృతిని ఇక్కడే ఆపేయండి. ప్రజా సమస్యలపై పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నాను..’ అంటూ ఎన్టీఆర్ భావోద్వేగంగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

   02-12-2021

నన్ను ఇకపై ‘తల’ అని పిలవవద్దు.. ఫాన్స్ కు హీరో అజిత్ విన్నపం

నన్ను ఇకపై ‘తల’ అని పిలవవద్దు.. ఫాన్స్ కు హీరో అజిత్ విన్నపం

   01-12-2021

సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖులు నివాళులు

సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖులు నివాళులు

   01-12-2021

ప్రభాస్ రాధే శ్యామ్ పాట ఆషికి ఆ గయీ వచ్చేసింది, లొకేషన్స్ సూపర్

ప్రభాస్ రాధే శ్యామ్ పాట ఆషికి ఆ గయీ వచ్చేసింది, లొకేషన్స్ సూపర్

   01-12-2021

ఆప్యాయంగా మిత్రమా అని పిలిచే పిలుపు ఆగిపోయింది.. చిరంజీవి ఆవేదన

ఆప్యాయంగా మిత్రమా అని పిలిచే పిలుపు ఆగిపోయింది.. చిరంజీవి ఆవేదన

   01-12-2021

సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి రాజకీయ, సినీ ప్రముఖుల నివాళి

సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి రాజకీయ, సినీ ప్రముఖుల నివాళి

   01-12-2021

సిరివెన్నెల మృతిపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

సిరివెన్నెల మృతిపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

   30-11-2021

సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమించారంటే నమ్మబుద్ది కావడం లేదు

సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమించారంటే నమ్మబుద్ది కావడం లేదు

   30-11-2021

ప్రఖ్యాత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు

ప్రఖ్యాత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు

   30-11-2021

కామెడీ రోల్ లో లావణ్య త్రిపాఠి కొత్త సినిమా

కామెడీ రోల్ లో లావణ్య త్రిపాఠి కొత్త సినిమా

   30-11-2021

ఇంకా

Newssting

 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle