newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

రామ్ గోపాల్ వర్మ ఇక సినిమాల దుకాణం సర్దేయాల్సిందేనా..?

08-05-202208-05-2022 07:25:54 IST
2022-05-08T01:55:54.081Z08-05-2022 2022-05-08T01:55:50.834Z - - 10-08-2022

రామ్ గోపాల్ వర్మ ఇక సినిమాల దుకాణం సర్దేయాల్సిందేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ట్విట్టర్ లో పోస్ట్ లు ఎంతలా సంచలనం సృష్టిస్తాయో తెలిసిందే. అయితే 'శివ' చిత్రంతో తెలుగు సినిమాల్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఆయనకు దారుణంగా అవమానం జరిగింది. ఆయన తెరకెక్కించిన తాజాగా మూవీ 'మా ఇష్టం'. ఇద్దరు లేడీ లెస్బియన్ ల కథతో ఈ సినిమాని ఆయన రూపొందించారు. వివాదాస్పద కథాంశం కావడంతో దీని చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. ఏకంగా పీవీఆర్ సినిమాస్ గ్రూప్ థీయేటర్స్ వర్మ చిత్రాన్ని ప్రదర్శించలేమంటూ బహిష్కరించాయి. వర్మ ఈ మధ్య నాకు నచ్చినట్టే తీస్తానని చూస్తే చూడండి లేదంటే మీ ఖర్మ అని బాహాటంగానే అనడం, పైగా వర్మ సినిమాల్లో కంటెంట్ బూతద్దం పెట్టి చూద్దామన్నా కనిపించకపోవడంతో ప్రేక్షకులు ఆసక్తిని చూపించడం లేదు. 

ఇక ఈ సినిమాకు హైదరాబాద్ లో దొరికిన థియేటర్ ఒక్కటే. అది కూడా రెండు ఆటల ఒప్పందంతో కావడం గమనార్హం. ఈ రెండు ఆటలకు కూడా ఓ ట్విస్ట్ వుంది. మే 12న సూపర్ స్టార్ మహేష్ నటించిన 'సర్కారు వారి పాట' రిలీజ్ కాబోతోంది. అంత వరకు మాత్రమే వర్మ 'మా ఇష్టం' రెండు షోలు ప్రదర్శన. ఆ తరువాత నుంచి అది కూడా వుండదు. మెయిన్ సిటీలోనే ఇలా వుంటే ఇతర సిటీలల్లో వర్మ సినిమా పరిస్థితి మరీ దారుణంగా మారిందంటున్నారు. పేరు లేని డైరెక్టర్ లు తీసే సినిమాలకు రెండు మూడు థియేటర్లు లభిస్తున్న ఈ రోజుల్లో ట్రెండ్ సెట్టర్ సినిమాలని తీసిన దర్శకుడు వర్మ చిత్రానికి ఒక్క థియేటర్ మాత్రమే లభించి అందులో రెండు ఆటలకు మాత్రమే పర్మీషన్ లభించడం ఆయనకు దక్కిన దారుణ అవమానం కాక మరేంటీ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. దీంతో వర్మ పని అయిపోయిందని చెబుతున్నారు. ఒకప్పుడు వర్మ సినిమా అంటే ఆ క్రేజే వేరు. ఆ హంగామానే వేరుగా వుండేది. తొలి రోజు సినిమా చూడాలని అభిమానులు ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్లకు తరలి వచ్చేవారు. కానీ పరిస్థితి మారింది. వర్మ సినిమాకు క్రేజ్ పూర్తిగా పడిపోయింది. ఒక్క థియేటర్ అందులో రెండు షోలు.. అది కూడా కేవలం ఆరు రోజులకు పడిపోవడంతో వర్మ ఇక దుకాణం సర్దేయాల్సిందే అంటున్నారు.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle