తీవ్ర నష్టాలలో ఉన్న ఆచార్య డిస్టిబ్యూటర్లకి మెగాస్టార్ అభయం ఇస్తారా..?
09-05-202209-05-2022 08:41:19 IST
2022-05-09T03:11:19.901Z09-05-2022 2022-05-09T03:11:16.649Z - - 27-05-2022

మెగాస్టార్ చిరంజీవికి తన కెరీర్లోనే అతి పెద్ద బాక్సాఫీస్ పరాభవం అంటే 'ఆచార్య' అనే చెప్పాలి. చిరు పాత్ర నీరసం తెప్పించేయడం చిరు మార్కు ఎంటర్టైన్మెంట్ ఇందులో పూర్తిగా మిస్సవడంతో ఆయన అభిమానులు కూడా ఆశించిన స్థాయిలో సినిమా చూడలేదు. మొత్తంగా ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో బయ్యర్లు ఇప్పుడు లబోదిబో అంటున్నారు. ఆల్రెడీ ఒక డిస్ట్రిబ్యూటర్ 'ఆచార్య' వల్ల ఎంతగా దెబ్బ తిన్నానో వివరిస్తూ తమను ఆదుకోవాలని కోరుతూ చిరుకు బహిరంగ లేఖ కూడా రాశాడు. చిరు ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద స్థాయిలో ఉన్నారు. కరోనా కష్టం వచ్చినపుడు.. ఏపీలో టికెట్ల ధరల సమస్య తలెత్తినపుడు ముందు పడి తన వంతుగా చేయాల్సిందల్లా చేశారు. వీటి వల్ల మంచి ఇమేజ్ తెచ్చుకున్న చిరు.. ఇప్పుడు తన సినిమా వల్ల నిండా మునిగిన బయ్యర్లను ఆదుకోకపోతే ఆయన నిబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతాయి. 'ఆచార్య' బిజినెస్ విషయాలన్నీ డీల్ చేసింది దర్శకుడు కొరటాల శివే కావడంతో ఆయనే బయ్యర్లకు సెటిల్మెంట్ విషయంలో చొరవ తీసుకున్నారని.. చిరు చరణ్ తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారని.. చిరు హాలిడేకు వెళ్లిపోతే చరణ్ కొత్త సినిమా షూటింగ్లో బిజీ అయిపోయాడని.. ఈ విషయమై కొరటాల ఆగ్రహంతో ఉన్నాడని వార్తలొస్తున్నాయి.

ఆమె అద్భుతమైన డ్యాన్సర్ ....!
14-05-2022

బ్లాక్బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సర్కారువారి పాట
12-05-2022

ఆ నాలుగు థియేటర్లలో 'సర్కారు వారి పాట' 6 షోలు
11-05-2022

రెండు సిల్వర్ ట్రోఫీలు దక్కించుకున్న బాలయ్య `అన్ స్టాపబుల్` షో
11-05-2022

విజయ్ సినిమాలో శ్రీకాంత్..!
11-05-2022

ఆచార్య ఫ్లాప్ లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాత్ర కూడా
10-05-2022

ప్రభాస్ కు జోడీగా మాళవిక ..!
09-05-2022

కాజల్ కు షాక్ ఇచ్చిన నెటిజన్లు ..!
08-05-2022

మహేశ్ బాబు మంచి ఫీల్డర్.. సంగీత దర్శకుడు తమన్ కామెంట్
08-05-2022

రామ్ గోపాల్ వర్మ ఇక సినిమాల దుకాణం సర్దేయాల్సిందేనా..?
08-05-2022
ఇంకా