newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

నారప్ప లో ఆ లోపం స్పష్టంగా కనిపిస్తుంది

20-07-202120-07-2021 18:24:39 IST
2021-07-20T12:54:39.264Z20-07-2021 2021-07-20T12:54:26.904Z - - 25-07-2021

నారప్ప లో ఆ లోపం స్పష్టంగా కనిపిస్తుంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన 'అసురన్' ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అద్దాల దర్శకత్వంలో కలి పులి ఎస్. ధాను, సురేష్ బాబులు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని నేడు అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసారు. ఇక ఈ చిత్రం చూసినవారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో వెంకటేష్ నటనతో సినిమాని ఓ రేంజ్ కి తీసుకు వెళ్ళాడని ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్ట్ లో వెంకటేష్ అద్భుతంగా చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే సెకండాఫ్ కి వచ్చే సరికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వెంకటేష్ కనిపించిన తీరు సినిమాలో ప్రధాన లోపంగా చెబుతున్నారు. కడు పేదరికంలో ఉంటూ సారా కాసే పాత్ర అది కానీ వెంకటేష్ మాత్రం కలర్ ఫుల్ డ్రెస్సులు వేసుకుంటూ క్లీన్ గా, గ్లామరస్ గా కనిపించడం తో ఆ పాత్ర తేలిపోయిందని. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో వెంకటేష్ కి జంటగా అభిరామి కనిపించడం కూడా ఎబ్బెట్టుగా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. వెంకటేష్ ముందు అభిరామి చిన్నపిల్లలా కనిపించడం స్పష్టంగా తెలుస్తూనే ఉందని ఈ విషయంలో దర్శకుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మక్కీకి మక్కీ, ఫ్రేం టు ఫ్రేం ఒరిజినల్ ని దించేసిన శ్రీకాంత్ అడ్డాలా ఫ్లాష్ బ్యాక్ ని అలాగే దించేయడం ఇదేమి క్రియేటివిటీ అని కొందరు విమర్శిస్తున్నారు కూడా. 

ఆకాశం నీ హద్దురా రీమేక్ ఆ హీరోతోనే..

ఆకాశం నీ హద్దురా రీమేక్ ఆ హీరోతోనే..

   12 hours ago


నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

నా వల్ల సినిమాకి నష్టం వాటిల్లకూడదు..

   12 hours ago


హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

హీరో ఆర్య తనని అంకుల్ ని చేశాడంటున్న విశాల్

   24-07-2021


Shilpa Shetty: మా ఆయన అమాయకుడు.. దీనితో రాజ్ కుంద్రాకు సంబంధం లేదు: శిల్పా శెట్టి

Shilpa Shetty: మా ఆయన అమాయకుడు.. దీనితో రాజ్ కుంద్రాకు సంబంధం లేదు: శిల్పా శెట్టి

   24-07-2021


ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. హాజరైన అమితాబ్ బచ్చన్

ప్రభాస్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.. హాజరైన అమితాబ్ బచ్చన్

   24-07-2021


రాజ్ కుంద్రాకు అండగా శిల్పాశెట్టి నిలుస్తుందా..?

రాజ్ కుంద్రాకు అండగా శిల్పాశెట్టి నిలుస్తుందా..?

   24-07-2021


ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష వివాహం..?

ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష వివాహం..?

   24-07-2021


తమిళనాడు లో అఖండ క్లైమాక్స్ షూటింగ్

తమిళనాడు లో అఖండ క్లైమాక్స్ షూటింగ్

   23-07-2021


బాలయ్య మా అధ్యక్షుడు అయితే అంతకన్నా ఆనందం లేదు..

బాలయ్య మా అధ్యక్షుడు అయితే అంతకన్నా ఆనందం లేదు..

   23-07-2021


నాలుగో పెళ్లి చేసుకోబోతున్న విజయకుమార్ కూతురు

నాలుగో పెళ్లి చేసుకోబోతున్న విజయకుమార్ కూతురు

   23-07-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle