newssting
Radio
BITING NEWS :
మూడు నెలల్లో తొలిసారిగా, భారతదేశం లో 50,000 కన్నా తక్కువ కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 42,640 కొత్త కేసులను నమోదు చేసింది, ఇది 91 రోజుల్లో అతి తక్కువ. దేశంలో యాక్టీవ్ కేసులు ఇప్పుడు 6,62,521 కు తగ్గాయి. భారతదేశం నిన్న ఒకే రోజులో 86.16 లక్షల మందికి (86,16,373) వ్యాక్సిన్ ఇచ్చారు, ఇది ప్రపంచంలో ఇప్పటివరకు సాధించిన అత్యధిక సింగిల్ డే టీకాలలో ఇదే రికార్డు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 28,87,66,201 మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించారు. * ఏపీ లో గత 24 గంటల్లో 55,002 సాంపిల్స్ ని పరీక్షించగా 2,620 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. నిన్నటి వరకు రాష్ట్రంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,53,183 మరణాలు 12,363 రాష్ట్రం మొత్తంలో వ్యాక్సిన్ వేయించుకున్నవారు 1,39,95,490 మంది. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు 1,12,50,631, రెండవ డోస్ తీసుకున్నవారు 27,44,589. * హైదరాబాద్ లో సుదీర్ఘ విరామానంతరం..కొత్త పాలకమండలి కొలువుదీరాక..ఈ నెల 29వ తేదీన జరగనున్న జీహెచ్‌ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 77 అంశాలు చేర్చారు. ఈ సమావేశానికి ముందు, 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ఆమోదం కోసం ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. * విజయ్ దళపతి 65 వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ లో విజయ్ తుపాకీతో ఉన్న పోస్టర్ విడుదల అయ్యి నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు జూన్ 22 న దళపతి విజయ్ పుట్టినరోజు.

విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

09-05-202109-05-2021 12:20:01 IST
2021-05-09T06:50:01.402Z09-05-2021 2021-05-09T06:44:08.243Z - - 22-06-2021

విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు నేడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే సినిమాలో నటిస్తూ ఉన్నాడు. ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతూ ఉంది. ఇక ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో లైగర్ నుండి టీజర్ వస్తుందని అందరూ భావించారు. విజయ్ దేవరకొండ అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూశారు. కానీ చిత్ర నిర్మాణ సంస్థలు బ్యాడ్ న్యూస్ చెప్పాయి. అదేమిటంటే ఈరోజు టీజర్ ను విడుదల చేయడం లేదట..! 

ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో మూవీ టీజ‌ర్‌ను వాయిదా వేస్తున్న‌ట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది. మే 9న లైగ‌ర్ ప‌వర్ ప్యాక్ట్ టీజ‌ర్ రిలీజ్ చేద్దామ‌ని అనుకున్నామని..ఇలాంటి స‌మ‌యంలో టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం క‌న్నా, వాయిదా వేయ‌డ‌మే మంచిద‌నిపించిందని తెలిపారు. చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌తంలో ఎన్న‌డు క‌నిపించ‌ని లుక్‌లో కనిపిస్తాడని.. త‌ప్ప‌క అభిమానుల‌ని అల‌రిస్తాడని బలంగా చెప్పగలుగుతున్నామని అన్నారు. ప్రస్తుతమున్న ప‌రిస్థితుల‌లో బ‌య‌ట తిర‌గ‌కుండా ప్ర‌తి ఒక్క‌రు ఇంటి ప‌ట్టునే ఉండాలని చిత్ర యూనిట్ చెబుతోంది. త‌ప్ప‌క వ్యాక్సిన్ వేయించుకోవాలని.. వైద్యులు చెబుతున్న సూచ‌న‌లు పాటిస్తూ అంద‌రు జాగ్ర‌త్త‌గా ఉండాలని తెలిపింది. ప‌రిస్థితులు అన్ని కుదుట‌పడ్డాక లైగర్ మిమ్మ‌ల్ని ఎంట‌ర్ టైన్ చేసేందుకు వ‌స్తాడ‌ని చిత్ర నిర్మాణ సంస్థలు ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్, పూరీ కనెక్ట్స్ ప్ర‌క‌టించాయి.  

మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉన్నారు. విదేశాల్లోనూ, ముంబై లోనూ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తూ ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ ను టార్గెట్ చేసుకుని.. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతూ ఉంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉంటాయనడంలో సందేహం లేదు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle