newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

విక్టరీ వెంకటేష్ కొత్త బిజినెస్ అదిరిపోయింది కదా..

10-01-202210-01-2022 22:05:09 IST
2022-01-10T16:35:09.804Z10-01-2022 2022-01-10T16:35:03.588Z - - 24-01-2022

విక్టరీ వెంకటేష్ కొత్త బిజినెస్ అదిరిపోయింది కదా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ నగరానికి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) స్టార్టప్ బైక్ వో లో టాలీవుడ్ అగ్రహీరో వెంకటేష్ దగ్గుబాటి భాగస్వామ్యం కుదిరినట్టు ప్రకటించారు. బైక్ వో అనేది ఈవీ టూ వీలర్ స్మార్ట్ హబ్ నెట్ వర్క్. ఈ కంపెనీ 2025 నాటికి దేశవ్యాప్తంగా 20,000 ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కంపెనీ తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. "బైక్ వో అనేది ఈవీ రంగంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్, సర్వీసింగ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది" అని విక్టరీ వెంకటేష్ తెలిపారు. 

ఈ భాగస్వామ్యంతో బైక్ వో తన ఈవీ సర్వీసింగ్, ఛార్జింగ్ నెట్ వర్క్ విస్తరిస్తుంది. మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్ కార్యకలాపాల కోసం తనను వినియోగించుకోనుంది. ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. గతంలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హైదరాబాద్‌కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీని విజయ్ మద్దూరి, కేదార్ సెలగంశెట్టి, వంశీ కారు మంచి నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమిట్‌లో ఈ కంపెనీ తమ బిజినెస్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు. లేటెస్ట్ టెక్నాలజీ తో ముందుకు వస్తున్న ఈ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని వెంకటేష్ అన్నారు.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle