బుల్లితెరపై మెరువబోతున్న 'వెంకీ మామ..?'
20-01-202220-01-2022 07:44:34 IST
2022-01-20T02:14:34.123Z20-01-2022 2022-01-20T02:14:28.510Z - - 27-05-2022

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున బుల్లితెరపై వ్యాఖ్యాతగా తమ సత్తాని చాటుకున్నారు. తాజాగా బుల్లితెరపై వ్యాఖ్యాతగా నందమూరి బాలకృష్ణ 'ఆహా'లో ప్రసారమవుతున్న 'అన్ స్టాపబుల్' ప్రోగ్రాం కి విశేషమైన స్పందన ప్రేక్షకులనుండి వస్తుంది. తనదైన డైలాగ్స్, పంచులతో ఈ టాక్ షోని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు బాలయ్య. డిజిటల్ ప్లాట్ ఫాంలో ఈ టాక్ షో దూసుకెళ్తోంది. దీంతో మరో కొత్త షోని ప్రారంభించాలని 'ఆహా' టీం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సరికొత్త టాక్ షోకి విక్టరీ వెంకటేశ్‌ని హోస్ట్‌గా చేయించడానికి ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే 'ఆహా' టీమ్ వెంకటేశ్‌ని సంప్రదించారని, ఆయనను ఒప్పించడానికి అల్లు అరవింద్ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే..త్వరలోనే వెంకీమామని మనం హోస్ట్‌గా చూడొచ్చు. ప్రస్తుతం వెంకటేశ్ ఎఫ్ 3 చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇక యాంకరింగ్ కూడా చేసినట్లయితే నలుగురు సీనియర్ హీరోలు బుల్లితెరపై కూడా తమ సత్తా చూపించినట్లవుతుంది.

ఆమె అద్భుతమైన డ్యాన్సర్ ....!
14-05-2022

బ్లాక్‌బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సర్కారువారి పాట
12-05-2022

ఆ నాలుగు థియేటర్లలో 'సర్కారు వారి పాట' 6 షోలు
11-05-2022

రెండు సిల్వర్ ట్రోఫీలు దక్కించుకున్న బాలయ్య `అన్ స్టాపబుల్` షో
11-05-2022

విజయ్ సినిమాలో శ్రీకాంత్..!
11-05-2022

ఆచార్య ఫ్లాప్ లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాత్ర కూడా
10-05-2022

ప్రభాస్ కు జోడీగా మాళవిక ..!
09-05-2022

తీవ్ర నష్టాలలో ఉన్న ఆచార్య డిస్టిబ్యూటర్లకి మెగాస్టార్ అభయం ఇస్తారా..?
09-05-2022

కాజల్ కు షాక్ ఇచ్చిన నెటిజన్లు ..!
08-05-2022

మహేశ్ బాబు మంచి ఫీల్డర్.. సంగీత దర్శకుడు తమన్ కామెంట్
08-05-2022
ఇంకా