newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

ఆస్కార్ బరిలో రెండు భారతీయ చిత్రాలు

21-01-202221-01-2022 22:08:04 IST
2022-01-21T16:38:04.754Z21-01-2022 2022-01-21T16:34:37.964Z - - 27-05-2022

ఆస్కార్ బరిలో రెండు భారతీయ చిత్రాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రతిష్టాత్మకమైన 94వ ఆస్కార్‌ అవార్డుల బరిలో రెండు భారతీయ చిత్రాలు నామినేట్‌ అయ్యాయి. అందులో ఒకటి సూర్య నటించిన 'జై భీమ్‌' చిత్రం కాగా, మరోకటి మోహన్‌ లాల్‌ నటించిన 'మరక్కార్‌' చిత్రం. కాగా ఆస్కార్‌ రేసులో మొత్తం 276 సినిమాలు షార్ట్‌ లిస్ట్‌ అవగా అందులో రెండు ఇండియన్‌ సినిమాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ రెండూ సౌత్‌ ఇండస్ట్రీకి చెందినవే కావడం విశేషం. గతేడాది అమెజాన్‌ ప్రైమ్ లో విడుదలైన 'జై భీమ్' చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కిన విషయం తెలిసిందే. జస్టిస్ చంద్రు జీవిత కథతో పాటు వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిన ఈ చిత్రానికి టి.జి.జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు. ఇక మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన మరక్కార్‌ చిత్రానికి ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించారు. చారిత్రక కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.ఇక ఆయా కేటగిరీలకు చెందిన ఫైనల్ నామినేషన్లను ఆస్కార్ కమిటీ ఫిబ్రవరి 8న ప్రకటించనుంది. అవార్డుల వేడుక మార్చి27న అమెరికాలో జరగనుంది.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle