newssting
Radio
BITING NEWS :
5జీ దెబ్బకు నిలిచిపోయిన ఎయిర్ ఇండియా విమాన సేవలు..! విమానాశ్రయాల రన్ వేల పక్కన 5జీ రోల్ అవుట్ చేయడం వల్ల ఇందులోని సీ-బ్యాండ్ స్పెక్ట్రమ్ వల్ల పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు, అస్థిర వాతావరణంలో దింపేటప్పుడు సమాచారాన్ని అందించే కీలక భద్రతా పరికరాలకు అంతరాయం కలగనున్నట్లు విమానయాన సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. * థ్యాంక్యూ బీజేపీ: అఖిలేష్‌ యాదవ్‌... అపర్ణ యాదవ్‌ బీజేపీలో చేరడంపై అఖిలేష్‌ యాదవ్‌ సందిస్తూ.. అపర్ణ యాదవ్‌ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. * హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావును కలిసేందుకు ప్రయత్నం చేశారు. అయితే అపాయింట్‌మెంట్‌ లేనిదే ఎంట్రీ లేదని సెక్యూరిటీ సిబ్బంది అ‍డ్డగించింది. సీఎం కేసీఆర్‌ లేకుంటే కనీసం మంత్రి కేటీఆర్‌ను కలుస్తానంటూ ఓవర్‌ యాక్షన్‌కు దిగాడు. సెక్యూరిటీ సిబ్బంది ప్రగతి భవన్‌లోనికి పంపించకపోవడంతో జేసీ వెనుదిరిగాడు. * వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. సబ్‌ డివిజన్, మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. * భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

సిరివెన్నెల మృతిపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

30-11-202130-11-2021 18:49:12 IST
2021-11-30T13:19:12.147Z30-11-2021 2021-11-30T13:18:32.264Z - - 24-01-2022

సిరివెన్నెల మృతిపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటన్నారు. ‘‘అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని ట్విట్టర్ వేదికగా స్పందించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ.. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సిరివెన్నెల మృతి తో టాలీవుడ్ పరిశ్రమ మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle